అమెజాన్ ఇండియాలో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి.!

అమెజాన్ ఇండియాలో ఐఫోన్14పై భారీ డిస్కౌంట్.. మరెన్నో బెనిఫిట్స్.. ఇప్పుడే కొనేసుకోండి.!

ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 14 అమెజాన్‌లో డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. కేవలం రెండు నెలల క్రితమే లాంచ్ అయిన ఐఫోన్ 14 (iPhone 14) అధికారికంగా రూ.79,900 నుంచి సేల్ మొదలైంది.

ధర మీ బడ్జెట్‌కు మించి ఉంటే.. అమెజాన్ కొత్త ఐఫోన్ మోడల్‌ను చాలా తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఐఫోన్ 14 మోడల్ 128GBపై అమెజాన్‌లో రూ. 77400 ధరతో లిస్టు అయింది. ఈ ఫోన్ అసలు ధర కన్నా రూ. 2500 తక్కువగా ఉంటుంది.

అదనంగా, ఫ్లిప్కార్ట్ HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. రూ. 5వేల ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ 14 ధర రూ. 72400కి పడిపోతుంది. ఈ సేల్ ప్రారంభించినప్పటి నుంచి అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ HDFC క్రెడిట్ కార్డ్‌తో పాటు డెబిట్ కార్డ్‌పై కూడా అందుబాటులో ఉంది. మీరు చాలా కాలంగా ఐఫోన్ 14 కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయంగా చెప్పవచ్చు.

రూ. 72400లకు ఐఫోన్ 14 ప్రస్తుతం బెస్ట్ డీల్ ఇదే. మీరు ఇప్పటికీ ఐఫోన్ 11, ఐఫోన్ XR లేదా ఐఫోన్ 12 వంటి పాత ఐఫోన్ మోడల్‌లలో ఒకదాన్ని ఉపయోగిస్తుంటే.. అప్‌గ్రేడ్ చేయడానికి ఇదే బెస్ట్ డీల్. అయితే, మీరు ఐఫోన్ 13ని ఉపయోగిస్తుంటే.. వచ్చే ఏడాది తర్వాత లాంచ్ కానున్న ఐఫోన్ 15 కొనుగోలు చేయవచ్చు. రాబోయే ఐఫోన్ మోడల్ పనితీరు, కెమెరాలు, బ్యాటరీ పరంగా మునుపటి కన్నా కొత్త ఫీచర్లతో వచ్చింది. లేటెస్ట్ ఐఫోన్ 14 డైనమిక్ ఐలాండ్‌తో వచ్చే ప్రో మోడల్‌ల మాదిరిగా కాకుండా.. వైల్డ్ నాచ్డ్ డిజైన్‌తో 6.1-అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందిస్తుంది.

A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటు కనిష్టంగా 128GB స్టోరేజీతో పాటు లేటెస్ట్ iOS 16 సాఫ్ట్‌వేర్‌తో అందించనుంది. కెమెరా ముందు భాగంలో, ఐఫోన్ 14లో ఐఫోన్ 13లో అదే సెట్ కెమెరాలు, వెనుక ప్యానెల్‌లో రెండు కెమెరాలు, సింగిల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఐఫోన్ 14 బ్యాటరీ పనితీరు ఐఫోన్ 13 కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. అయితే పాత ఐఫోన్ మోడల్ తగినంతగా లేదని కాదని గమనించాలి. ప్రస్తుతం, ఐఫోన్ 13 కొన్ని బ్యాంక్ ఆఫర్‌లతో అమెజాన్‌లో రూ. 65వేల ధరతో అందుబాటులో ఉంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *