ఈ రకమైన కలలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు.. ఎందుకంటే!

ఈ రకమైన కలలను ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు.. ఎందుకంటే!

మనలో చాలా మందికి కునుకు(నిద్ర) తీయడం ప్రారంభమైన కొద్దిసేపటికే ఏవేవో కలలొస్తుంటాయి. ఈ కలలో కొన్ని అద్భుతమైన విషయాలు, వింతలు, విశేషాలు కనిపిస్తూ ఉంటాయి. మరికొందరికి చెడు కలలు, పీడకలలు వస్తుంటాయి. దీంతో నిద్రలో నుంచి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంటారు. ఎలాంటి కలలైనా సరే నిద్రలో నుంచి మేల్కొన్న తర్వాత కాస్త ఆలోచించేలా చేస్తాయి. ఈ నేపథ్యంలో మనకు వచ్చే కలల్లో కొన్నింటికి అర్థాలేంటి.. అవి మనల్ని ఎందుకు ఆలోచించేలా చేస్తాయి.. ఇదిలా ఉండగా మనకొచ్చే కలల్లో కొన్నింటిని ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీరు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని స్వప్నశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎలాంటి కలలను ఇతరులతో షేర్ చేసుకోకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

​చేపలు కనిపిస్తే;

స్వప్న శాస్త్రం ప్రకారం, మీకు తరచుగా కలల్లో చేపలు ఈత కొడుతున్నట్లు లేదా ఇతరులు చేపలను పట్టుకోవడం వంటి వాటిని చూస్తే ఇది శుభ పరిణామంగా పరిగణించబడుతుంది. కలలో చేపను చూడటం వల్ల మీరు త్వరలో ఊహించనంత లాభాలను పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని అర్థం. అందుకే కలలో చేపలు కనిపించిన విషయం గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు.

​కలలో దేవుడు కనిపిస్తే;

మనలో నిద్రపోయే వారిలో ఎవరికైనా దేవుడు కనిపిస్తే, వారు జీవితంలో చాలా ఆనందంగా ఉండబోతున్నారని అర్థం. అంతేకాదు తాము చేసే ప్రయత్నాలన్నింటీలో సులభంగా విజయం సాధిస్తారు. కలలో దేవుడిని చూడటం పవిత్రమైన సంఘటనగా భావిస్తారు. అందుకే ఈ కలల గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోకూడదు.

​కలలో తల్లిదండ్రులు;

మీరు నిద్రపోయిన సమయంలో వచ్చే కలల్లో ఎక్కువగా అమ్మనాన్నలు కనిపిస్తుంటే.. శుభప్రదమైన ఫలితాలొస్తాయని అర్థం. దీని వల్ల తాము భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే అవకాశాలున్నాయని చాలా మంది నమ్ముతారు. కాబట్టి ఇలాంటి కలల గురించి ఎవరికీ చెప్పకూడదు.

​కలలో ఇవి కనిపిస్తే;

మీకు కలలో వెండి పాత్రలు కనిపిస్తే, మీరు త్వరలో శుభవార్తలు వింటారు. వెండితో నిండిన కలశం వల్ల మీకు చాలా ప్రయోజనకర ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మీకున్న కష్టాల నుంచి సులభంగా బయటపడతారు. మీ జీవితంలో సంతోషం కూడా పెరుగుతుంది. అదే విధంగా ఎర్రని పూలు మీకు కలలో కనిపిస్తే మీ ఇంట్లో వాతావరణం ఆహ్లాదకరంగా మారబోతుందని అర్థం. కాబట్టి ఇలాంటి కలల గురించి ఇతరులతో మాట్లాడొద్దు.

​కలలో పాము;

కొందరికి తాము కనే కలల్లో తరచుగా పాములు కనిపిస్తూ ఉంటాయి. సాధారణంగా పాము అనగానే చాలా మందికి తెగ భయపడిపోతారు. అయితే కలలో పామును చూడటం వ్యాపారులు మంచి లాభాలను పొందుతారట. లేదా వారు చేసే పనిలో కచ్చితంగా విజయం సాధిస్తారు. అంతేకాదు మీరు ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు కూడా బలపడతాయి. అందుకే ఇలాంటి కలల గురించి ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ,పరిహారాలు అన్ని కేవలం ఊహల ద్వారా ఇవ్వబడినవి.దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.పై సమాచారాన్ని ” విశాఖ ఎక్స్ప్రెస్ “దృవీకరించడం లేదు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *