మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ;

మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో విస్తరణ;

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, మరొక మైలు రాయిని చేరుకోవడానికి సిద్దమవుతుంది

నగరంలోని ఐటీ కారిడార్ అయిన మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైలు ప్రాజెక్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించనుంది.  దీనిలో భాగంగా డిసెంబర్ 9 న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు శంకుస్థాపన చేయనున్నారు. ఇది ఎయిర్ పోర్ట్ కి వెళ్లే ప్రయాణికులకు చాలా అనువుగా ఉంటుంది. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వరకు సుమారు 31 కిలో మీటర్లలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుంది. దీని కోసం తెలంగాణ ప్రభుత్వం సుమారు రూ. 6,250 కోట్లను ఖర్చు చేయనుంది.

డిసెంబర్ 9న ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రోకు గౌరవ సీఎం కేసీఆర్ గారు శంకుస్థాపన చేస్తారని ప్రకటించడానికి సంతోషంగా ఉంది. మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు 31 కిలోమీటర్ల పొడవు ఉంటుందని, దీనికి సుమారు రూ. 6,250 కోట్లు ఖర్చవుతుందని తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నడిచే ప్రాజెక్టు అని, ఇది పూర్తి అవడానికి 3 సంవత్సరాల సమయం పడుతుందని, అదనంగా మరొక 31 కిలో మీటర్ల మెట్రో విస్తరణ కోసం భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని, దానిలో భాగంగా ఇప్పటికే మేము డీపీఆర్ ను సమర్పించామని మంత్రి ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక రంగం రోజు రోజుకి వృద్ధి చెందుతుందని, విదేశీ పర్యాటకుల సంఖ్య మరో 20 శాతం పెరుగుతుందని ఆశిస్తున్నామని, కోవిడ్ కి ముందు స్థాయిలతో పోలిస్తే దేశీయ పర్యాటక రంగం 30 శాతం పుంజుకుంటుందని భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బి.మనోహర్ తెలిపారు. 2023 చివరి నాటికి అంతర్జాతీయ పర్యాటకుల సంఖ్య 20 శాతం, దేశీయ పర్యాటకుల సంఖ్య 30 శాతం పెంచడమే తమ లక్ష్యమని, కోవిడ్ తర్వాత రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రాంతాలకు వచ్చే పర్యాటకుల సంఖ్య పెరిగిందని, రాష్టంలోని అన్ని హోటళ్ళు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఆక్యుపెన్సీ పెరగడమే దీనికి నిదర్శనమని, కేవలం విదేశీ పర్యాటకులు కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకుల సంఖ్య కూడా పెరిగిందని మనోహర్ తెలిపారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్రంలోని ఇతర పర్యాటక ప్రాంతాలలో కూడా పర్యాటకుల సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *