లాభనష్టాల్లో మార్కెట్ ఊగిసలాట.. చిన్న షేర్లలో బుల్స్ పరుగు, వీటిని కొంటే డబ్బులే డబ్బులు!
దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్యలో ఊగిసలాడుతున్నాయి. ట్రేడింగ్ ప్రారంభంలో లాభాలతో ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు.. ఆ తర్వాత కిందకి పడిపోయాయి. ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి సంకేతాలు మిశ్రమంగా ఉన్నాయి. బజాజ్ ట్విన్స్ లాభాల జోరులో ఉండగా.. స్మాల్ క్యాప్ షేర్లలో బుల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి. వీటితో పాటు చిన్న షేర్లు కూడా పరుగులు పెడుతున్నాయి. నేడు అప్పర్ సర్క్యూట్‌ను తాకిన పెన్నీ స్టాక్స్ జాబితా కింద ఇవ్వడం జరిగింది.. వాటిపై ఓ లుక్కేయండి.
ఆసియా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ మిశ్రమంగా ఉండటంతో.. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్పంగా లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ లాభాలను ఎంతో సేపు నిలుపుకోలేకపోయాయి. ఆ తర్వాత వెంటనే మార్కెట్లు పడిపోయాయి. నేడు ట్రేడింగ్ ప్రారంభంలోనే వేదంతా లిమిటెడ్ షేర్లు 5 శాతానికి పైగా పెరిగాయి. దీంతో బీఎస్ఈ మెటల్ ఇండెక్స్ సుమారు 2 శాతం పెరిగింది. బజాజ్ ట్విన్స్ అయిన బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నేడు సెన్సెక్స్‌లో టాప్ గెయినర్లుగా ట్రేడయ్యాయి. ఇవి మార్కెట్‌కి బూస్టప్ ఇచ్చాయి.
ట్రేడింగ్ ప్రారంభంలో పైకి ఎగిసిన మార్కెట్లు.. ప్రస్తుతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గ్లోబల్ టెక్నాలజీ స్టాక్స్ తగ్గడంతో.. మన మార్కెట్లో బీఎస్ఈ ఐటీ, బీఎస్ఈ టెక్ సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లోనే చెత్త ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఉదయం 11.00 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 0.25 శాతం తగ్గి 60,683 వద్ద ట్రేడైంది. అలాగే నిఫ్టీ 50 ఇండెకస్ 0.18 శాతం తగ్గి 18,020 స్థాయిల వద్ద కొనసాగింది. సెన్సెక్స్‌లో బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్స్ టాప్ గెయినర్లుగా లాభాలు పండించగా.. ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్, టెక్ మహింద్రా స్టాక్ మార్కెట్లను కిందకి పడేశాయి.
బీఎస్ఈలో 1,809 షేర్లు పెరగగా.. 1,372 షేర్లు నష్టాలు పాలవుతున్నాయి. అడ్వాన్స్-డిక్లైన్ రేషియో పూర్తిగా అడ్వాన్స్‌లకు అనుకూలంగా ఉంది. సియారామ్ సిల్క్ మిల్స్, రెయిన్బో చిల్ట్రెన్స్ మెడికేర్, అమర రాజా బ్యాటరీస్ స్టాక్స్ 10 శాతానికి పైగా పెరిగాయి. బెంచ్‌మార్క్ సూచీలు కిందకి పడిపోతున్నా.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్ మాత్రం లాభపడుతుంది. స్మాల్‌క్యాప్ కేటగిరీలో బుల్స్ యాక్టివ్‌గా ఉన్నాయి
మార్కెట్లు నష్టాల్లో ఉన్న ఈ సమయంలో కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం అప్పర్ సర్క్యూట్‌ను తాకి లాభాలు పండిస్తున్నాయి. ఈ స్టాక్స్ రాబోయే సెషన్స్‌లో కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. వీటిపై ఇన్వెస్టర్లు ఓ లుక్కేసి ఉంచితే మంచిదేమో.