ఆధార్ అప్‌డేట్‌, ఇతర మార్పులకి ఛార్జీలు ఎంతంటే..?

ఆధార్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు కొన్ని విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి. ఆధార్ సెంటర్‌కు వెళ్లిప్రతి ఒక్కరికీ అత్యంత కీలకమైన డాక్యుమెంట్ ఆధార్. ఇందులో తప్పులు ఉండటం చాలా అరుదైన విషయం. చాలా మంది ఆధార్ కార్డులో వివరాలను సరిచేసుకుంటూ ఉంటారు. ఆధార్ సెంటర్‌కు వెళ్లడం లేదా ఆన్‌లైన్‌లోనే కూర్చొని ఆధార్‌లో తప్పుగా ఉన్న సమాచారాన్ని మార్చుకోవచ్చు ఆధార్ వివరాలు మార్చుకోవాలంటే కొంత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. యూఐడీఏఐ ఏప్రిల్ 22 నాటి నోటిఫికేషన్‌‌ను గమనిస్తే.. ఆధార్ వివరాల అప్‌డేట్‌కు ఎంత ఖర్చవుతుందో తెలుసుకోవచ్చు. అడ్రస్, మొబైల్ నెంబర్, బయోమెట్రిక్స్ అప్‌డేట్‌కు కొంత డబ్బులు కట్టాల్సిందే.

యూఐడీఏఐ సర్క్యులర్ ప్రకారం.. పేరు, అడ్రస్, జెండర్, ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వంటి డెమోగ్రాఫిక్ వివరాల అప్‌డేట్‌కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇదివరకు వీటి అప్‌డేట్‌కు కేవలం రూ.25 చెల్లిస్తే సరిపోయేది. ఇప్పుడు ధరలు పెరిగాయి.

అదేవిధంగా ఫోటోగ్రాఫ్, ఫింగర్‌ప్రింట్స్, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్ కోసం కూడా రూ.50 ఖర్చవుతుంది. ఈ చార్జీలు పన్నులు కలుపుకొని ఉన్నాయి. ఇకపోతే ఇ-కేవైసీ, ఆధార్ కలర్ ప్రింట్ కోసం రూ.30 చెల్లించాలి. ఇకపోతే పైన పేర్కొన్న చార్జీలన్నీ ఆధార్ సెంటర్‌కు వెళ్లినప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ఆధార్ సెంటర్‌కు వెళ్లకుండా యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో వివరాలను అప్‌డేట్ చేసుకుంటే ఎలాంటి చార్జీలు ఉండవు. అయితే ఆధార్ కార్డును రిప్రింట్ కావాలని కోరితే మాత్రం రూ.50 కట్టాలి. ప్రింటింగ్ చార్జీలు, స్పీడ్ పోస్ట్ చార్జీలు, జీఎస్‌టీ వంటివి ఇందులో భాగమే. ఆధార్ రిప్రింట్ చార్జీలను ఆన్‌లైన్‌లోనే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ మార్గాల్లో చెల్లించొచ్చు.

ఆధార్‌కు సంబంధించిన ప్రతి అప్‌డేట్ కోసం కొంత రుసుము చెల్లించాలి. ఈ రుసుము యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిర్ణయిస్తుంది.

ఈ ఛార్జీల గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. దీనివల్ల ఆధార్‌ కేంద్రానికి వెళ్లినప్పుడు ఎటువంటి మోసానికి గురికాకుండా ఉంటారు. ఇటీవల ఆధార్‌ మార్పునకు ఎక్కువగా రుసుము వసూలు చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కస్టమర్ సర్వీస్ సెంటర్లలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ. కాబట్టి ఆధార్ అప్‌డేట్

ఛార్జీల గురించి తెలుసుకుందాం.

1.ఆధార్ సంఖ్య జనరేషన్ (0-5 సంవత్సరాలు) ఉచితం

2.ఆధార్ సంఖ్య జనరేషన్ (5 ఏళ్లు పైబడిన వారు)ఉచితం

3.బయోమెట్రిక్ అప్‌డేట్-ఉచితం

4.ఇతర బయోమెట్రిక్ అప్‌డేట్‌లు (డెమోగ్రాఫిక్ అప్‌డేట్‌లతో లేదా లేకుండా) రూ.100

5.జనాభా నవీకరణ 50 రూపాయలు

6.గుర్తింపు రుజువు లేదా నివాస రుజువులో అప్‌డేట్- 50 రూపాయలు

7.eICYC ద్వారా ఆధార్ శోధన-30 రూపాయలు

8.గుర్తింపు లేదా నివాస ధృవీకరణ పత్రం అప్‌డేట్ – 25 రూపాయలు

బాల్‌ ఆధార్‌ కార్డు

పిల్లల ఆధార్ కార్డును బాల్ ఆధార్ అంటారు. పిల్లల వయస్సు 5 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే బయోమెట్రిక్ వివరాలు అవసరం లేదు. పిల్లల ఆధార్ సమాచారం తల్లిదండ్రుల ఆధారంగా ఉంటుంది. పిల్లల ఆధార్‌కి తల్లిదండ్రుల వివరాలను అనుసంధానం చేస్తారు. పిల్లవాడు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్య ఉన్నప్పుడు అతని చేతుల పది వేళ్లు, ఐరిస్, ఫేస్‌ రికగ్నైషేజన్‌ అప్‌డేట్‌ చేస్తారు. తర్వాత ఈ వివరాలు ఒరిజినల్ ఆధార్ లెటర్‌లో అప్‌డేట్ అవుతాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *