ఎయిర్‌టెల్ సిమ్ వాడుతున్నారా? మీకో గుడ్ న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్

మీరు ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడుతున్నారా? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. ఎందుకని అనుకుంటున్నారా? ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది.

మరోసారి టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధంగా ఉంది. ధరల పెరుగుదల తప్పనిసరి అని ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోపాల్ విట్టల్ పేర్కొన్నారు.

ఎయిర్‌టెల్ 4జీ ధరలకే ప్రస్తుతం 5జీ సర్వీసులు అందిస్తోందని ఆయన గుర్తు చేశారు. అయితే వచ్చే 5జీ సర్వీసులకు సంబంధించి 6 నుంచి 9 నెలల కాలంలో ధరల అంశంపై ఒక నిర్ణయానికి రావాల్సి ఉందని తెలిపారు. అంటే రానున్న కాలంలో టారిఫ్ ధరలు పెరగనున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే టారిఫ్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. మరోసారి పెంపు అంటే సామాన్యులపై మరీముఖ్యంగా 5జీ సర్వీసులు ఉపయోగించే వారిపై ప్రభావం పడనుంది.

399 రూపాయలు కే కొత్తస్మార్ట్‌ఫోన్ .. ఎంఐ క్లియరెన్స్ సేల్‌లో సగం ధరకే ఫోన్లు!

అలాగే ఎయిర్‌టెల్ తన సబ్‌స్క్రైబర్లకు తీపికబురు కూడా అందించింది. ఎయిర్‌టెల్ సిమ్ కార్డు వాడే వారికి ఈ నెలలోనే అన్ని 5జీ స్మార్ట్‌ఫోన్లపై 5జీ సర్వీసులు అందుబాటులోకి వస్తాయని విట్టల్ తెలిపారు. అయితే ఐఫోన్లు మాత్రం ఇందుకు మినహాయింపు. యాపిల్ ఈ నెల తొలి వారంలో ఐఫోన్లలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తీసుకువస్తుందన్నారు. ఐఫోన్లలో డిసెంబర్ నెలలో 5జీ సేవలు అందబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

బంపర్ డీల్గూగుల్ పవర్‌ఫుల్ 5జీ ఫోన్‌పై ఏకంగా రూ.11 వేల డిస్కౌంట్!

శాంసంగ్‌లో 27 మోడళ్లు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తున్నాయని, ఇప్పటికే 16 మోడళ్లలో ఎయిర్‌టెల్ 5జీ సేవలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు. మిగతా ఫోన్లలో నవంబర్ 12 కల్లా 5జీ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వన్‌ప్లస్ 17 మోడళ్లు అన్నీ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తున్నాయన్నారు. వివోకు చెందిన 34 మోడళ్లు, రియల్‌మి 34 మోడళ్లు అన్నీ ఎయిర్‌టెల్ 5జీని సపోర్ట్ చేస్తున్నాయని తెలిపారు. షావోమికి చెందిన 33 మోడళ్లు, ఒప్పొ 14 మోడళ్లలో 5జీ సేవలు వస్తున్నాయని పేర్కొన్నారు.

ఇకపోతే 2024 మార్చి కల్లా అన్ని పట్టణ ప్రాంతాల్లో, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. అయితే కొన్ని ఫోన్లలో 5జీ ఉన్నా కూడా 5జీ సర్వీసులు పొందలేకపోతున్నారు. ఫోన్‌కు, టెలికం కంపెనీ నెట్‌వర్క్‌కు మధ్య అనుసంధానం లేకపోవడం ఇందుకు కారణం. ఇలాంటి సమస్యలను సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తారు. కాగా ప్రస్తుతం తక్కువ ధరకే 5జీ ఫోన్లు లభిస్తున్నాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *