న్యూ ఇయర్ కన్నా ముందుగానే ఫ్లిప్‌కార్ట్ లో ఆఫర్ల పండగ.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి

కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరో సూపర్ సేల్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ నెల 16 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

న్యూ ఇయర్ కన్నా ముందుగానే ఫ్లిప్‌కార్ట్ లో ఆఫర్ల పండగ.. ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు.. ఓ లుక్కేయండి

ఈ సేల్ 21వ తేదీ వరకు కొనసాగుతుందని ప్రకటించింది. ఈ సేల్ లో అన్ని రకాల ఉత్పత్తులపై సూపర్ డీల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపింది ఫ్లిప్ కార్ట్. ఇంకా ఈ సేల్ లో ఫ్లిప్ కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో షాపింగ్ చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుందని వెల్లడించింది.

స్మార్ట్ ఫోన్లు:

ఈ సేల్ లో పోకో, రియల్మీ, యాపిల్ , వివో తదితర స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఆ ఆఫర్ల వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు సేల్ పేజీలో పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్స్ పై 80 శాతం:

ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ముఖ్యంగా టాబ్లెట్లు, డేటా స్టోరేజ్ డివైజ్ లు, స్టైలింగ్ డివైజ్ లు, ప్రింటర్స్&మానిటర్లపై ఈ ఆఫర్ ఉంటుందని వెల్లడించింది.

టీవీలు, అప్లియెన్సెస్ పై..

టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ అప్లియెన్సెస్ పై బిగ్ సేవింగ్ డేస్ సేల్ లో 75 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. బెస్ట్ సెల్లింగ్ టీవీలపై 65 శాతం, రిఫ్రిజిరేటర్లపై 55 శాతం, ఏసీలపై 55 శాతం, హోం అప్లియెన్సెస్ పై 70 శాతం తగ్గింపులు ఉంటాయని తెలిపింది ఫ్లిప్ కార్ట్.

ఫ్యాషన్:

ఫ్లిప్ కార్ట్ లో ఫ్యాషన్ వస్తువులపై 50-80 శాతం వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపింది ఫ్లిప్ కార్ట్. మహిళల ష్యూలు, చెప్పులపై 80 శాతం తగ్గింపులు ఉంటాయని వెల్లడించింది. ఇంకా టీషర్ట్ లు, జీన్స్ పై 80 శాతం వరకు తగ్గింపు ఉంటుందని తెలిపింది.

అమెజాన్ మెస్మరైజ్ ఆఫర్!”>

– కిచెన్, డైనింగ్ వస్తువులపై సైతం 80 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

– ఫర్నీచర్ వస్తువులపై సైతం 80 శాతం వరకు తగ్గింపులు ఉంటాయని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఆఫీస్ చైర్లను రూ.2790 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చని వెల్లడించింది

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *