టెక్నాలజీ రంగంలో చాట్ జీపీటీ ఓ సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఏఐ చాట్‌బోట్ హాట్‌టాపిక్‌గా ఉంది.
ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ అరుదైన ఘనత సాధించింది. కేవలం కొద్దినెలల్లోనే చాట్‌జీపీటీ సాధించిన మైలురాళ్లను ప్రముఖ యాప్‌లు సైతం చేరుకోలేదు.
న్యూయార్క్ : ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న యాప్‌గా చాట్‌జీపీటీ అరుదైన ఘనత సాధించింది. కేవలం కొద్దినెలల్లోనే చాట్‌జీపీటీ సాధించిన మైలురాళ్లను ప్రముఖ యాప్‌లు సైతం చేరుకోలేదు. గత ఏడాది నవంబర్‌లో చాట్‌జీపీటీ లాంఛ్ అయిన 5రోజుల్లోనే 10 లక్షల మంది యాక్టివ్ యూజర్లను సాధించగా, రెండు నెలల్లోనే 10 కోట్ల యూజర్లను ఈ యాప్ దక్కించుకుంది.
ఇన్స్టాగ్రాం, స్పాటిఫై, టిక్‌టాక్ వంటి కంపెనీలు రెండేండ్లకు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయాయి. జనవరిలో ఓపెన్ఏఐ చాట్‌బాట్ ఏ సోషల్ మీడియా, కంటెంట్ సంబంధిత యాప్‌కు సాధ్యం కాని రీతిలో రోజుకు 1.3 కోట్ల యూజర్లను ఆకట్టుకుందని సిమిలర్ వెబ్ రిపోర్ట్ వెల్లడించింది. ఇన్‌స్టా, స్పాటిఫై, టిక్‌టాక్ వంటి దిగ్గజ యాప్స్ సైతం ఈ ఫీట్ సాధించేందుకు కొన్నేండ్ల సమయం తీసుకున్నాయి.
ఓపెన్ఏఐ డెవలప్‌చేసిన చాట్‌జీపీటీ అత్యంత వేగంగా ఎదిగిన యాప్ అని, 20 ఏండ్ల ఇంటర్నెట్ స్పేస్‌లో ఇంత వేగంగా ఎదిగిన కన్జూమర్ ఇంటర్నెట్ యాప్ ఇదేనని యూబీఎస్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. 10 కోట్ల నెలవారీ యూజర్లను చేరుకునేందుకు టిక్‌టాక్‌కు 9 నెలల సమయం పట్టగా, ఇన్స్టాగ్రాం రెండున్నరేండ్లలో ఈ ఫీట్ సాధించిందని యూబీఎస్ విశ్లేషకులు పేర్కొన్నారు. గొప్ప సంభాషణల చాతుర్యం కలిగిన చాట్‌జీపీటీ యువత, ప్రొఫెషనల్ యూజర్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ఈమెయిల్స్ రాయడం, అసైన్‌మెంట్స్‌తో పాటు క్లిష్టమైన కోడింగ్ ఇష్యూలను కూడా చాట్‌జీపీటీ యాప్ సులభంగా పరిష్కరిస్తోంది. చాట్‌జీపీటీకి విశేష ఆదరణ లభిస్తుండటంతో గూగుల్ సొంతంగా తన ఏఐ చాట్‌బాట్ వెర్షన్‌ను లాంఛ్ చేసేందుకు గూగుల్ సన్నద్ధమైంది. ఈ ఏడాది మేలో గూగుల్ తన ఏఐ చాట్‌బాట్‌ను లాంఛ్ చేయడంతో పాటు 21 ఇతర ఏఐ ఉత్పత్తులపైనా సెర్చింజన్ దిగ్గజం కసరత్తు సాగిస్తోంది.
ఎందుకంత పాపులర్ అయింది?
2022 నవంబర్‌లో లేటెస్ట్ చాట్ జీపీటీ-3 అందుబాటులోకి వచ్చింది. లాంచ్ అయిన మూడు రెండు నెలల్లోనే ప్రపంచమంతా పాపులర్ అయింది. ఇందుకు ముఖ్య కారణం అడిగిన ప్రశ్నకు ఇది ఒకే సమాధానాన్ని పూర్తి సమాచారంతో సమగ్రంగా ఇస్తుంది. ఒకవేళ దేని గురించి అయినా గూగుల్‌లో సెర్చ్ చేస్తే చాలా లింక్స్ కనిపిస్తాయి. దాంట్లో సమాచారాన్ని అంతా క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. అదే చాట్ జీపీటీ అయితే ఒకే ఆన్సర్ ఇస్తుంది. అది కూడా సింపుల్, కాన్వర్జేషన్ లాంగ్వేజ్‌లో వివరంగా సమాధానం చెప్పేస్తుంది. అందుకే చాట్ జీపీటీ అత్యంత వేగంగా పాపులర్ అయింది. కోట్లాది మంది దీన్ని ఇష్టపడుతున్నారు.
కోడింగ్ నుంచి వంటల వరకు..
చాట్ జీపీటీ ఏ విషయంపై అయినా సమాధానాలు ఇస్తుంది. హిస్టరీ, సైన్స్, టెక్నాలజీ, కోడింగ్, మ్యాథమాటిక్స్, జనరల్ నాలెడ్జ్, పోగ్రామింగ్ లాంగ్వెజెస్, భాషలు, సాంస్కృతిక విషయాలు, ఆరోగ్యం, వంటకాలు, లైఫ్‌స్టైల్.. ఇలా ఒక్కేటేమిటి ఏ విషయాన్నైనా టెక్స్ట్ రూపంలో చాట్ జీపీటీని అడగవచ్చు. దాదాపు అన్ని ప్రశ్నలకు ఇది సమాధానాలు ఇస్తుంది. గూగుల్‌ను అడిగినట్టుగానే ఈ చాట్ జీపీటీని ఏ క్వశ్చన్లు అయినా అడగవచ్చు. చాట్ జీపీటీ తన డేటా బేస్‌లోని సమాచారాన్ని టెక్స్ట్ రూపంలో చూపిస్తుంది. మీరు ఈ చాట్ జీపీటీతో టెక్స్ట్ రూపంలో ముచ్చటించవచ్చు. గ్రామర్ తప్పులను కూడా ఇది సరిదిద్దుతుంది. ఏదైనా అంశంపై కథనాలను కూడా రాసిపెడుతుంది. సెంటెన్స్ లను మార్చేందుకు కూడా ఉపయోగపడుతుంది.
ప్రస్తుతం 2021 వరకు సమాచారాన్ని చాట్ జీపీటీ కచ్చితంగా చెబుతోంది. 2022 నుంచి జరిగిన తాజా పరిణామాలు ఇంకా డేటా బేస్‌లో లేవు. త్వరలోనే అప్డేట్ అయ్యే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం ఇంటర్నెట్కు చాట్ జీపీపీ కనెక్ట్ అయి లేదు. అయితే దీని డేటా బేస్‌లో చాలా సమాచారం ఉంటుంది కాబట్టి.. పూర్తి వివరాలను అందించగలదు.