చదువు, ఆరోగ్యం ఇలా చాలా విషయాలపై ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లల మానసిక ఆరోగ్యం తరచుగా ఇబ్బందుల్లో పడుతూ ఉంది.
తల్లిదండ్రులు తమ పిల్లల మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడే ఐదు చిట్కాలను తెలుసుకుందాం. పిల్లలను పెంచడం కష్టమే వాళ్ళను సరైన మార్గంలో పెంచడం అనేది అంత తేలికైన విషయం అయితే కాదు. పిల్లల ఎదుగుదలకు మంచి పోషకాహాన్ని ఇవ్వడం అవసరం. చదువు, ఆరోగ్యం ఇలా చాలా విషయాలపై ఆందోళన చెందుతూ ఉంటారు. పిల్లల మానసిక ఆరోగ్యం తరచుగా ఇబ్బందుల్లో పడుతూ ఉంది. సాధారణంగా కోవిడ్ తరువాత పిల్లల్ని
చాలా మానసిక ప్రతికూల సమస్యలు ఆందోళను పెడుతూ ఉంటాయి.
నిపుణుల సలహాల మేరకు రెండు మూడు సంవత్సరాల మధ్య పిల్లలు ట్యాబ్స్, టీవి, ఫోన్ వంటి స్క్రీన్ లకు అలవాటుపడి రోజుకు రెండు మూడు గంటల కంటే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ పిల్లలు 5.5 సంవత్సరాల తక్కువ శారీరక శ్రమతో పెరుగుతున్నారు. ప్రతిరోజూ ఒక గంట లేదా అంతకంటే తక్కువ సమయం స్క్రీన్ లను ఉపయోగించే వారితో పోలిస్తే వీరి మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుందని తేలింది.
చిట్కాలు ఇవే..
1. పిల్లలతో సమయం గడపండి.
పిల్లలతో మంచి సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వారితో సన్నిహితంగా మెలగడానికి సమయం గడపడమే మంచి ఉపాయం. పిల్లలతో ఆడుకోవడం, సినిమా చూడటం, వారి ప్రపంచం గురించి తెలుసుకోవడం తల్లిదండ్రులకు చాలా ముఖ్యం.
2. చెప్పే విషయంలో శ్రద్ధ వహించండి.
చాలాసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలు ఏమి చెపుతున్నారో అనేది పట్టించుకోరు. అయినప్పటికీ పిల్లలు తమ భావాలను పంచుకుంటున్నప్పడు కాస్త శ్రద్ధగా వినండి. పిల్లల ఆలోచనలు, కలలు, ఆశయాలు మరెన్నో పంచుకోవడానికి వారిని కమ్యునికేషన్ చేయడం ముఖ్యం.
ప్రశంసించండి.
పిల్లల్ని ప్రతి తల్లిదండ్రులు తప్పు చేసినపుడు మందలించినా, తిట్టినా పడతారు. అలాగే వాళ్ళు చేసే చిన్న పనులను అప్పుడప్పడూ మెచ్చుకుంటూ కూడా ఉండాలి. వారిని కొత్త పనులు చేయడానికి పోత్సహించండి. ఇది పిల్లల్లో ఉత్సాహాన్ని నింపుతుంది.
4. అంచనాలు అవసరం.
పిల్లల్ని ఎదుటి పిల్లలతో పోల్చకూడదు. పోలికలు ఎప్పుడూ మంచి ఫలితాలను ఇవ్వవు. ఇది పిల్లలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. స్నేహితులు, తోబుట్టువులతో పోల్చడం కన్నా పిల్లల్లోని ప్రత్యేక లక్షణాలను ప్రోత్సహించడం అవసరం. చిన్న చిన్న విజయాలను కూడా పట్టించుకుని ప్రోత్సహించాలి.
5. ఒత్తిడి, ఆందోళన..
పిల్లలు అధిక ఆందోళన, ఒత్తిడి అనుభవిస్తున్నారా.. అది గమనించండి. మనం బయటి ప్రపంచాన్ని మార్చలేకపోయినా, పిల్లలకు అలవాట్లు, ప్రవర్తన నేర్పగలము. అది పిల్లలకు చదువు పరంగా, ఇతర కారణాలతో కలిగే ఒత్తిడి నుంచి బయటపడే వీలును కలిగిస్తుంది.