ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌ న్యూస్‌..మీకు నచ్చిన భాషలో మెసేజ్ పంపవచ్చు..ఎలాగంటే

ప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూత్ ను అట్రాక్ట్ చేస్తోంది ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌. దేశాలతో సంబంధం లేకుండా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్ ఇన్‌స్టాగ్రామ్‌ పేరు సంపాదించుకుంది.

ఇదిలా ఉండగా నిత్యం కొత్త ఫీచర్లను అదుబాటులోకి తీసువచ్చే ఇన్ స్టా తాజాగా యూజర్ల కోసం మరోకొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అదే అనువాద ఫీచర్. ఎవరైనా మెసేజ్ ను మీకు తెలియని భాషలో పంపించినట్లయితే దానిని మీకు నచ్చిన భాషలోకి అనువాదం చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లకు భాష సమస్య అనేది ఉండదు.

ఇన్‌స్టాగ్రామ్‌ ట్రాన్స్ లేట్ ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో చూద్దాం.
ఎవరైనా మెసేజ్ పంపినప్పుడు, వారు మెసేజ్ ను ట్రాన్స్ లేట్ చేసుకునే ఆఫ్షన్ పొందుతారని Instagram తెలిపింది. ఈ యాప్ సందేశాన్ని ఆటోమెటిగ్గా అనువదిస్తుంది. మీకు ఈ ఫీచర్ కావాలంటే …మీరు ట్రాన్స్ లెట్ సిట్టింగ్ లో టోగుల్ ను ఆన్ చేయాలి. ఆ తర్వాత ఈ ఫీచర్ ఎనేబుల్ అవుతుంది.

-ముందుగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ని తెరవండి.
-ఆ తర్వాత ఎగువ కుడి మూలలో ఉన్న సందేశ చిహ్నంపై క్లిక్ చేస్తే DMs విభాగానికి వెళ్తుంది.

ఆపై మీరు సందేశాన్ని అనువదించాలనుకుంటున్న చాట్‌ను ఒపెన్ చేయండి.
– మీ ప్రొఫైల్ వివరాలపై క్లిక్ చేయండి, ఆ తర్వాత చాట్ సెట్టింగ్ ఒపెన్ అవుతుంది.
-ఇక్కడ మీరు థీమ్ నుండి బ్లాక్ చేయడానికి అనేక ఎంపికలను కనుగొంటారు.
– ఫీచర్‌ను ఆన్ చేయడానికి ట్రాన్స్ లేట్ మెసేజ్ సెట్టింగ్ టోగుల్‌పై క్లిక్ చేయండి.
– చాట్‌లోని అన్ని మెసేజ్ లను మీకు నచ్చిన భాషలోకి అనువదించబడతాయి.
-అదనంగా, యాప్ ఆటోమెటిగ్గా కొత్త ఇన్‌కమింగ్ మెసేజ్ లను కూడా మీ భాషలోకి అనువదిస్తుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *