వచ్చే ఐదు రోజుల్లో కేరళలో భారీ నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల తీవ్రత పెరగడమే ఇందుకు కారణమని చెప్పింది.
జూలై 3 నుంచి 5 వరకు కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 24 గంటల వ్యవధిలో 115.6 మిమీ నుంచి 204.4 మిమీ వరకు భారీ వర్షపాతం నమోదు కానున్నట్టు తెలుస్తోంది. కోజికోడ్ జిల్లాలో జూలై 5న అత్యధిక వర్షాలు కురుస్తాయని, జిల్లాలో 204.4 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎమ్డి అంచనా వేసింది.
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలు తీవ్రమై పరిస్థితి మరింత దారుణంగా మారితే, తీరప్రాంతాలకు సమీపంలో నివసించే ప్రజలను సహాయక శిబిరాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కోరింది. కేరళ, కర్నాటక, లక్షద్వీప్‌లలో బుధవారం (జూలై 5) వరకు సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులను ఆదేశించింది
ఈ నెల 12న మరాఠావాడాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయి. 12,13న ఛత్తీస్‌గఢ్- విదర్భలో, 13,14న బిహార్‌లో, 12 నుంచి 14 మధ్యల్లో ఝార్ఖండ్, సౌరాష్ట్ర, కచ్, పశ్చిమ్ బెంగాల్, ఒడిశాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. మధ్యప్రదేశ్, గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కోంకణ్, గోవాల్లో 5 రోజుల పాటు విస్త్రతంగా వర్షాలు కురుస్తాయి.
ఐఎమ్డి రైన్ అలెర్ట్ : ఈ నెల 12-15 మధ్యలో తూర్పు రాజస్థాన్‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి. ఇక రానున్న ఐదు రోజుల్లో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌లో వానలు కురుస్తాయి.
తెలంగాణ, కర్ణాటకలో 12న మోస్తారు వర్షాలు పడతాయి. 12,13న తమిళనాడులోని ఘాట్ ప్రాంతాలు, 12-14మధ్యలో కర్ణాటక తీర ప్రాంతంలో విస్తృతంగా వానలు కురుస్తాయి.
ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చమ్ బెంగాల్లో సముద్రంలో పరిస్థితులు తీవ్రంగా ఉండనున్నాయి. 12-14 మధ్యలో ఆయా ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో కుంభవృష్టి..
తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తునే ఉన్నాయి. గత పదేళ్లలో సెప్టెంబర్‌లో ఎన్నడు కురవని స్థాయిలో కుంభవృష్టి కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లిలో 35.1సెం.మీల వర్షపాత నమోదైంది. రాజన్న జిల్లా అవునూర్‌లో 20.8, మర్తనపేటలో 20.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. మెదక్, రంగారెడ్డి, నిజమాబాద్, కరీంనగర్, నల్లగొండ ఉమ్మడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో కొత్త రికార్డులు ఏర్పడ్డాయి. 1908 నుంచి ఇప్పటి వరకు 24 గంటల వ్యవధిలో అత్యధిక వర్షం ఖమ్మం జిల్లా కోహెడలో నమోదైంది. 1996 జూన్ 17న 67.5 సెంటిమీటర్ల వర్షపాతం, 1983 అక్టోబర్ 6న నిజామాబాద్‌లో 35.5సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆళ్ళపల్లిలో ఆదివారం 35.1 సెం.మీల వర్షపాతం నమోదైంది.