ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.
ఈ కొత్త అప్డేట్లతో, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ ప్రైవసీతో పాటు ఎక్స్పీరియన్స్ మెరుగుపర్చేందుకు సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంది. ఈ నెలలో రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్డేట్లో వాట్సాప్ ఎట్టకేలకు ఐఓఎస్ యూజర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌ను రిలీజ్ చేసింది.
పిప్ మోడ్ ఇప్పుడు వాట్సాప్ యూజర్లు వీడియో కాల్లో ఉన్నప్పుడు ఏకకాలంలో ఇతర యాప్‌లను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తుంది. ఐఓఎస్‌లో వెర్షన్ 23.3.77 ఫీచర్ ప్రకారం.. ఐఓఎస్ పిక్చర్-ఇన్-పిక్చర్ మోడ్‌కు సపోర్టుతో యూజర్లు ఇప్పుడు వాట్సాప్ వీడియో కాల్ సమయంలో వీడియో పాజ్ చేయకుండా మల్టీ టాస్క్ చేయొచ్చునని వాట్సాప్ వెల్లడించింది. ముఖ్యంగా, ఆండ్రాయిడ్ వాట్సాప్ యాప్ యూజర్ల కోసం ఇప్పటికే పిప్ మోడ్ అందుబాటులో ఉంది. అయితే, ఐఓఎస్ యూజర్ల కోసం వాట్సాప్ గత ఏడాది నుంచి పిప్ మోడ్‌లో పనిచేస్తోంది డిసెంబర్లో ఫీచర్ టెస్టింగ్ కూడా ప్రారంభించింది.
ఐఓఎస్ పిప్ మోడ్ ఎలా పనిచేస్తుందంటే? :
మీరు వీడియో కాల్ సమయంలో వాట్సాప్ యాప్ నుంచి నిష్క్రమిస్తే.. పిప్ మోడ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. వాట్సాప్ యూజర్లు ప్రస్తుతానికి కావాలనుకుంటే వీడియో కాల్ వ్యూలను పాజ్ చేసేందుకు లేదా హైడ్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది. అయినప్పటికీ, పిప్ మోడ్ ప్రారంభం కాకపోతే.. మీ వాట్సాప్ ని అప్డేట్ చేయండి. అవసరమైన అన్ని సెట్టింగ్‌లను మార్చడానికి వాట్సాప్ సెట్టింగ్ యాప్ అనుమతిని చెక్ చేయండి.
ఐఫోన్లో కొత్త వాట్సాప్ ఫీచర్లు ఇవే :
పిప్మోడ్ కాకుండా వాట్సాప్ ఐఓఎస్యూజర్ల కోసం మరికొన్ని ఫీచర్లను కూడా రిలీజ్ చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..
– పెర్సొనాలిసేడ్అవతార్ : ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాదిరిగానే మెటా ఇప్పుడు తమ యూజర్లను ప్లాట్‌ఫారమ్ కోసం సొంతంగా కస్టమైజ్ చేసిన అవతార్‌ను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫొటోగా వాట్సాప్ అవతార్‌ను క్రియేట్ చేయొచ్చు లేదా స్టిక్కర్ ప్యాక్‌ను తయారు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో వారి చాట్ సంభాషణలకు మరింత వినోదాన్ని యాడ్ చేయొచ్చు.
మీ అవతార్‌ని క్రియేట్ చేయడానికి :
– వాట్సాప్ సెట్టింగ్‌లకు వెళ్లండి.
– అవతార్ టాప్ చేయండి> మీ అవతార్‌ని క్రియేట్ చేయండి.
– ఇప్పుడు మీ అవతార్‌ని క్రియేట్ చేయడానికి ఈస్టెప్స్ ఫాలో అవ్వండి.
– ఆపై డన్ పై టాప్ చేయండి.
వాట్సాప్‌లో మీ అవతార్‌కి మీ ప్రొఫైల్ ఫొటో సెటప్ :
– సెట్టింగ్స్ వెళ్లండి.
– మీప్రొఫైల్ ఫోటో> ఎడిట్> టాప్ ఆన్ ఎడిట్
– యూస్ అవతార్ ఆప్షన్ టాప్ చేయండి.
పిప్తో సహా ఈ ఫీచర్లు రాబోయే వారాల్లో అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ చెబుతోంది. అయితే, అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. మీ వాట్సాప్‌లో కొత్త అప్డేట్లను పొందాలంటే.. కొత్త అప్డేట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.