సాధారణంగా ఏదైనా స్మార్ట్‌ఫోన్ పొరపాటున నీళ్లలో పడితే ఏమౌతుంది? అది పనిచేయదని అందరి తెలుసు.. కానీ, అన్ని స్మార్ట్ ఫోన్లు అలా కాదు..
ఏడాది పాటు సముద్రంలో ఉన్న ఐఫోన్ యజమానికి తిరిగి రావడంతో ఆపిల్ తన స్మార్ట్ఫోన్లతో కొత్త ఘనతను సాధించింది. ది సన్ యుకె యొక్క నివేదిక ప్రకారం, క్లేర్ అట్ఫీల్డ్ అనే ప్యాడిల్బోర్డర్ ఆగస్టు 2021లో తన బోర్డులో ఉన్నప్పుడు సముద్రంలో తన ఐఫోన్‌ను తప్పుగా ఉంచింది. 39 ఏళ్ల ఆమె స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల ఒడ్డుకు కొట్టుకుపోయిందని పేర్కొంది. తరువాత మరియు పూర్తి పని స్థితిలో ఉంది. అట్ఫీల్డ్ తన ఆపిల్ ఐఫోన్ 8+ని వాటర్‌ప్రూఫ్ బ్యాగ్‌లో ఉంచినప్పుడు పడిపోయిందని పేర్కొంది.
ఆపిల్ ఐఫోన్ ఎంత కాస్ట్ ఉంటుందో అంతే వాటి కండిషన్ బాగుంటుందనడంలో సందేహం అక్కర్లేదు. ఇప్పుడు అదే ఒక మహిళ విషయంలో రుజువైంది. ఏడాది కిందట సముద్రంలో పొగట్టుకున్న ఐఫోన్ ఇప్పుడు దొరికేసరికి ఆమెలో ఎక్కడలేని సంతోషాన్ని వ్యక్తం చేసింది. దాదాపు 465 రోజుల క్రితం సముద్రంలో తన ఫోన్‌ను పోగొట్టుకున్న హాంప్‌షైర్‌కు చెందిన ఒక మహిళ.. తన ఐఫోన్ వర్కింగ్ కండిషన్ చూసి షాకౌంది. ఆ ఐఫోన్ ఇప్పటికీ అద్భుతంగా పనిచేస్తుంది.
అప్పట్లలో ఈ ఐఫోన్ బీచ్ సమీపంలో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఆ ఐఫోన్ కుక్క వాకర్ ద్వారా గుర్తించారు. మహిళ సముద్రంలోకి వెళ్లిన సమయంలో ఐఫోన్ 8 ప్లస్ ను పోగొట్టుకుంది. ఆ ఫోన్ కోసం చాలా ఆశగా వెతికింది. కానీ, ప్రయోజనం లేకపోయింది. అయనప్పటికీ తన ఆశను వదులుకోలేదు. బీచ్ కు వెళ్లనప్పుడల్లా తన ఐఫోన్ దొరుకుతుందనే ఆశతో ముందుకు సాగింది. ఊహించిన విధంగా నవంబర్ 7న తన ఐఫోన్ మళ్లీ కంటపడటంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు. సాధారణంగా ఏదైనా ఇతర ఫోన్ అయితే పనిచేయదు. కానీ, ఈ ఐఫోన్ మాత్రం వర్క్ చేయడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది.
యాహూ న్యూస్ ప్రకారం.. 39 ఏళ్ల క్లేర్ అట్ఫీల్డ్ గత ఏడాది ఆగస్టు 4న హాంప్‌షైర్‌లోని హవంత్ తీరంలో ప్యాడిల్‌బోర్డ్ నుంచి ఐఫోన్ 8 ప్లస్ పొగట్టుకుంది. కుక్కల వాకర్ ద్వారా కనుగొన్న ఐఫోన్ 8పై ఎక్కువ స్కాచ్‌లు లేవు. ఎందుకంటే.. ఆమె ఐఫోన్ కేసుతో ఉంది. అందులో మెడికల్ కార్డ్ కూడా ఉంది. ఆ కార్డు ద్వారా మహిళ వివరాలను గుర్తించారు. అయితే ఆ ఐఫోన్ ఇప్పటికీ పని చేయడాన్ని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. తన ఐఫోన్ ఇప్పటికీ పనిచేస్తుందని చూసి నమ్మలేకపోతున్నానని క్లేర్ చెప్పుకొచ్చింది. కాకపోతే.. ఐఫోన్ వెనుక భాగం పూర్తిగా దెబ్బతిన్నది.
నీరు లోపలికి వెళ్లినప్పటికీ ఆ ఐఫోన్ అద్భుతంగా పనిచేస్తోంది. క్లైర్ దగ్గర ఇప్పుడు కొత్త ఫోన్ ఉంది. కానీ, తన పాత ఐఫోన్‌ను తిరిగి పొందడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఐఫోన్ 8 IP68 రేటింగ్‌ను కలిగి ఉంది. అయితే ఆపిల్ఇంజనీర్లు కూడా ఐఫోన్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. నీటిలో ఒక ఏడాది పాటు ఈ ఐఫోన్ ఉన్నా పనిచేస్తుందని తెలిపారు. అలా అని ఐఫోన్ యూజర్లు ఎవరూ కూడా ఎక్స్పర్మెంట్ చేయొద్దని ఆపిల్ సూచించింది. మీ ఐఫోన్‌ను నీటిలో వేసేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు