అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్‌ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది.

ఇది 7వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తాంధ్ర తీరానికి చేరే ఛాన్స్ ఉందని

వాతావరణశాఖ పేర్కొంది.

అల్పపీడనం ఎఫెక్ట్ తమిళనాడు, పుదుచ్చేరిని తాకుతుందని.. ఆ తర్వాత ఏపీకి చేరుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ (Andhra Pradesh Weatherman ) రిపోర్టు ప్రకారం.. బంగాళాఖాతంలోని తేమ గాలుల ఫలితంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది. డిసెంబర్ 5న అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది.

ఇక తెలంగాణకు చూస్తే ఎలాంటి వర్ష సూచన లేదు. వాతారణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు. మరోవైపు తెలంగాణలో చలిగాలులు పెరుగుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్‌ నగరంతో పాటు, రాజధాని పరిసర ప్రాంతాలు, జిల్లా్ల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పొగ మంచు కమ్ముకోవడం వల్ల రహదారులపై రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే ఐదురోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది

గత మూడు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా మోసర్తు వర్షాలు కురుస్తుండగా…మరో 2 రోజులు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆయా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, వరంగల్, హన్మకొండ, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మాల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అనవసర ప్రయాణాలు, విద్యుత్ స్తంభాలు, లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఉత్తర ఆంధ్ర ప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం, సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని ఐఎండీ హెచ్చరించింది. సోమవారం వరకు ఒడిశా తీరం వెంబడి, వాయవ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రంలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *