ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్ లలో పాన్ కార్డు కూడా ఒకటిగా మారిపోయింది. అంతేకాకుండా పాన్ కార్డ్ అన్నది కొన్ని విషయాలలో కీలకంగా మారింది.
మరి ముఖ్యంగా బ్యాంకుకు సంబంధించిన లావాదేవీల విషయంలో పాన్ కార్డు అన్నది తప్పనిసరి. పాన్ కార్డు వల్ల మన ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవచ్చు. అయి/తే కొంతమందికి పాన్ కార్డులో వారి ఫొటో స్పష్టంగా కనిపించలేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది మాత్రం ఏమీ కాదు అన్నట్టుగా చూసి చూడనట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. పాన్ కార్డులో ఫోటో మార్పు చేసుకోవాలి అనుకున్న వారు ఫోటో ని సులభంగా మార్చుకోవచ్చు.
అయితే ఇందుకోసం మీరు ఏదైనా మీసేవ ఇతర నెట్ సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా
ఫోటోతో పాటు కార్డు పై మీ సంతకాన్ని కూడా మార్చుకోవచ్చు. మరి పాన్ కార్డులో ఫోటోని ఏవిధంగా మార్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాన్ కార్డులో ఫోటో ని మార్చాలి అనుకుంటే అందుకోసం ముందుగా NSDL వెబ్ సైట్ లోకి వెళ్ళాలి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే అప్లై ఆన్లైన్ రిజిస్టర్ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీరు అప్లికేషన్ టైప్ ఆప్షన్ కి వెళ్లి పాన్ లో మార్పుని ఎంచుకోవాలి.
ఆ తరువాత ఆ మార్పులు చేర్పులకు సంబంధించిన ఆప్షన్ ను ఎంచుకొని అందులో అడిగే వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కస్టమర్ క్యాప్చర్ కోడ్ ను పూర్తిచేసి, కేవైసీ ని పూర్తి చేయాలి. ఆ తర్వాత స్క్రీన్ పై రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి సిగ్నేచర్ మ్యాచింగ్,రెండవది ఫోటో అప్డేట్. అందులో ఉండే సమాచారాన్ని పూర్తిచేసి కొనసాగించడంపై క్లిక్ చేయాలి. తర్వాత ఐడి రుజువును సమర్పించి డిక్లరేషన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఇక ఫోటోను ఆన్లైన్లో మార్చుకోవడానికి రుసుమును కూడా చెల్లించాల్సి ఉంటుంది. రుసుము చెల్లింపు తర్వాత ఫోటో మార్చే ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత ఫోటోను మార్చడానికి నింపిన ఫారం ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. ఇదే వెబ్ సైట్ లో మనం సంతకం కూడా మార్చుకునే సదుపాయం ఉంది.