పాదాల పగుళ్లను తగ్గించుకునే సింపుల్ టిప్స్

పాదాలు పగిలి ఇబ్బంది పడుతున్నారా? డిటర్జెంట్లు పాదాలపై దాడి చేస్తున్నాయా? శరీరంలో విపరీతమైన వేడి వల్ల పాదాల పగుళ్ళు వచ్చి సతమతమవుతున్నారా? చలికాలం ఎంత జాగ్రత్తగా ఉన్నా పాదాల మీద పగుళ్లు ఏర్పడుతున్నాయా…. వీటిని నిర్లక్ష్యం చేస్తే చర్మం ఊడి గాయాలుగా మారి ఇన్‌ఫెక్షన్లు మొదలవుతాయి.

అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చికిత్స కు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే ఈ సమస్యకు చికిత్సలున్నాయి.

పాదాల పగుళ్లను తగ్గించుకోవడానికి రకరకాల టిప్స్ పాటించి విసిగి పోయిన వారు ఈ టిప్ ని పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చు. దీనికోసం ఒక క్యాండిల్ తీసుకుని అందులో దారం తీసేసి ముక్కలుగా చేయాలి.
ఈ ముక్కలను ఆవనూనెలో వేసి వేడి చేయాలి. తరువాత కాళ్లను వేడి నీళ్లల్లో ఉంచి శుభ్రం చేయాలి. ఆ తరువాత ఈ ఆవ నూనె మిశ్రమాన్ని పాదాలకు బాగా పట్టించాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేసి తరువాత పాదాలకు సాక్స్ ను వేసుకుని పడుకోవాలి. ఇలా వారం రోజుల పాటు చేయడం వల్ల ఎంతటి పగుళ్లైనా మాయమవుతాయి. ఈ టిప్స్ ని పాటించడం వల్ల చాలా సులభంగా పాదాల పగుళ్లను తగ్గించుకోవచ్చు.బాగా మగ్గిన అరటి పండును గుజ్జుగా చేసి పాదాలకు పట్టించాలి. ఒక 15 నిమిషాల తరువాత పాదాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లను నివారించుకోవచ్చు. అలాగే ఎక్కువగా పాదాల పగుళ్లు ఉన్నప్పుడు అవకాడో ఫ్రూట్ మసాజ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అవకాడో సగం భాగాన్ని అలాగే పచ్చి కొబ్బరిని జార్ లో వేసి మెత్తగా చేయాలి. తరువాత దీనికి అరటి పండు గుజ్జును కలిపి కాళ్లకు పట్టించి మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు తగినంత తేమ లభిస్తుంది. దీంతో పాదాల పగుళ్లు నివారించబడతాయి.
అంతేకాకుండా ఈ టిప్ ని పాటించడం వల్ల పాదాల పగుళ్లు కూడా రాకుండా ఉంటాయి.ఇక ఒక గిన్నెలో నిమ్మరసం, రోజ్ వాటర్, గ్లిసరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన పాదాల పగుళ్లపై రాయాలి. ఇలా వారానికి రెండు నుండి మూడు సార్లు క్రమం తప్పకుండా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇక పాదాల పగుళ్లను నివారించే రెండో చిట్కా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాగా పగిలిన పాదాలు ఉన్న వారికి ఇది మంచి చిట్కా అని చెప్పవచ్చు. పొడి చర్మం ఉన్న వారికి పాదాల పగుళ్లు ఎక్కువగా వస్తాయి. అలాంటి వారు రాత్రి పడుకునే ముందు పాదాలకు నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ మర్దనా చేయాలి. ఇలా ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.అలాగే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు, నిమ్మరసం, గ్లిసరిన్, రోజ్ వాటర్ ను వేసి అందులో గోరు వెచ్చని నీటిని పోయాలి. తరువాత అందులో పాదాలను ఉంచి కొద్ది సేపు అలాగే ఉంచాలి. తరువాత పాదాలను స్క్రబ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలపై ఉండే మృతకణాలు తొలిగిపోతాయి
Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *