టెంపరరీ లేదా గిగ్ వర్కర్లకు 2022 సంవత్సరంలో ఎన్నడూ లేని విధంగా డిమాండ్ నెలకొన్నట్లు తాజాగా ఒక రిపోర్ట్ వెల్లడించింది.
నిర్ధిష్ట రంగాల్లో పార్ట్‌టైమ్‌గా పనిచేసే వీరికి పది రెట్లు డిమాండ్ పెరగడం, గిగ్ వర్కర్స్ మూడు రెట్లు పెరగడం వల్ల గతేడాది గిగ్ ఎకానమీకి అత్యంత విజయవంతమైన సంవత్సరంగా నిలిచిందని టాస్క్‌మో రిపోర్ట్- 2022 తెలిపింది.
గ్రేట్ రిటైర్మెంట్, మూన్‌లైటింగ్ నుంచి లేఆఫ్ సీజన్ వరకు అనేక మార్పులు, అలానే గిగ్ మార్కెట్లోని సౌకర్యవంతమైన నియామకం, వర్కింగ్ అవర్స్ అనేవి ఉద్యోగులను ఇటు వైపు ఆకర్షించాయని నివేదిక వివరించింది
2021 వరకు గిగ్ ఎకానమీ బ్లూ కాలర్/ఆఫీస్ వెలుపల ఉద్యోగాల్లో పని చేసే వర్కర్లకు మారు పేరుగా ఉండేది. కానీ 2022 సంవత్సరం ఆ పరిస్థితులను, మొత్తం ముఖచిత్రాన్ని మార్చేసింది. 2021 ఏడాదితో పోలిస్తే 2022లో ఆఫీస్ ఉద్యోగాల్లో పనిచేసే వ్యక్తులకు డిమాండ్ బాగా పెరిగింది
అలా ఈ రకమైన ఉద్యోగాలలో తాత్కాలిక లేదా ఫ్రీలాన్స్ ప్రాతిపదికన పనిచేసే వ్యక్తులకు ఇది మరిన్ని అవకాశాలను కల్పించింది.టాస్క్మొప్రకారం, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్లు, ఈ-కామర్స్ కంపెనీల కోసం ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, టెక్నికల్ స్కిల్స్ వర్కర్స్, అనలిస్టులు, డేటా సైంటిస్ట్ రోల్స్ కోసం వైట్-కాలర్ గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగింది
ఇది పాజిటివ్ మార్పేనా లేక తాత్కాలికమైనదా అనేది తెలియదు కానీ గిగ్ ఎకానమీ ప్రపంచవ్యాప్తంగా నియామకాలు, వర్కింగ్ సినారియోని నిరంతరం తిరగరాస్తోంది. ఇండియన్ కంపెనీలు వ్యాపార అభివృద్ధి, ఫీల్డ్ సేల్స్, మైల్ డెలివరీ, డిజిటల్ ప్రమోషన్, బ్రాండ్ ప్రమోషన్, మైక్రో ఇన్ఫ్లుయెన్సర్లు తదితర జాబ్స్ కోసం ఎక్కువగా గిగ్ వర్కర్ల కోసమే వెతుకుతున్నాయి. టాస్క్‌మో నివేదిక 2022 ప్రకారం, మొత్తంమీద గిగ్ వర్కర్ల డిమాండ్ 10X పెరిగింది. అయితే గిగ్ వర్కర్ల భాగస్వామ్యం 2021 సంవత్సరంతో పోలిస్తే 2022 సంవత్సరంలో 3X పెరిగింది.
రిపోర్ట్ ప్రకారం కంపెనీలు ఇప్పుడు పెద్ద నగరాల్లోనే కాకుండా చిన్న నగరాలు, పట్టణాల్లో ఎక్కువ మందిని నియమించుకుంటున్నాయి. ఇది ఒక శుభవార్తగా పరిగణించవచ్చు
అదనంగా, పాండిచ్చేరి, మీర్జాపూర్, పాట్నా, జబల్పూర్, కాన్పూర్ వంటి నగరాల్లోని ప్రజలు ఇప్పుడు తాత్కాలిక లేదా ఫ్రీలాన్స్ ఉద్యోగాలను చేపట్టడం ప్రారంభించారు. చాలా మంది వ్యక్తులు గిగ్ ఎకానమీలో పనిచేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే వారు తమ ఓన్ వర్కింగ్ గంటలను ఎంచుకోవచ్చు, స్వతంత్రంగా పని చేయవచ్చు
అలానే నివేదిక ప్రకారం, గిగ్ ఆర్థిక వ్యవస్థలో యువత భాగస్వామ్యం 2019-2022 మధ్య 8 రెట్లు పెరిగింది. గిగ్ జాబ్ పాత్రలను ఎంచుకునే యువతలో ఎక్కువ మంది బెంగళూరు, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, చెన్నై వంటి టైర్-1 నగరాలకు చెందినవారు ఉన్నారు
అంతేకాకుండా, గిగ్ ఉద్యోగాల్లో పనిచేసే మహిళల సంఖ్య 2022 ఏడాదిలో రెట్టింపు అయింది. 2021తో పోలిస్తే 2022లో ఈ తరహా ఉద్యోగాల్లో ఎక్కువ మంది మహిళలు పనిచేశారు. మహిళలు ఎక్కువగా కస్టమర్ సర్వీస్‌కు సంబంధించిన ఉద్యోగాలు, కంటెంట్ చెక్ చేయడం, ఫోన్లో సేల్స్ చేయడం, సర్వేలు చేయడం వంటివి చేశారు