తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి?.. రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల పరిస్థితి!
తప్పు ఒకరు చేస్తే శిక్ష మరొకరు అనుభవిస్తున్నట్లు తయారైంది రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థుల పరిస్థితి. కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నిర్లక్ష్యం, నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వ జాప్యం ఫలితంగా లక్షన్నర మంది ప్రథమ, ద్వితీయ ఇంటర్ విద్యార్థులు పరీక్ష ఫీజుకు అదనంగా రూ.వెయ్యి చొప్పున ఆలస్య రుసుం చెల్లించాల్సి వస్తోంది ప్రైవేటు కళాశాలల నిర్లక్ష్యం.. ప్రభుత్వ నిర్ణయంలో అలసత్వంతో ఇంటర్ విద్యార్థులకు శాపంగా మారింది. గృహ, వాణిజ్య సముదాయాల్లో కొనసాగుతున్న కళాశాలలు అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర…