వాట్సాప్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు అలర్ట్.. అలా చేయకపోతే డేంజర్ లో పడినట్టే!

ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం మొబైల్స్ , ఇంటర్నెట్‌  వినియోగం చాలా రెట్లు పెరిగింది. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్  డిజిటల్‌ పేమెంట్స్‌ ట్రాన్సాక్షన్లు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో డిజిటల్‌ డివైజెస్‌ లక్ష్యంగా సైబర్‌ దాడులు జరుగుతున్నాయి. ఫోన్లు  కంప్యూటర్లలో లోపాలను ఆసరాగా చేసుకొని హ్యాకర్లు దాడులు చేస్తున్నారు. పాస్‌వర్డ్‌లు, ఇతర డేటాను దొంగిలించి బ్యాంక్‌ అకౌంట్స్‌లో నగదు మాయం చేస్తున్నారు. సున్నితమైన వివరాలను బహిర్గతం చేస్తామని యూజర్లను బెదిరించి డబ్బు వసూలు చేస్తున్నారు. అయితే తాజాగా వాట్సాప్‌, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ యూజర్లు హ్యాకర్లకు టార్గెట్‌ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్.

వాట్సాప్‌ యూజర్లు టార్గెట్‌ అయ్యే అవకాశం

హ్యాకింగ్, సైబర్ దాడుల ప్రమాదాల నుంచి ప్రజలను రక్షించడానికి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్  పని చేస్తోంది. ఇంటర్నెట్‌ స్పేస్‌లో ప్రమాదాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తోంది. సైబర్‌ దాడులకు గురికాకుడా ఉండేందుకు సలహాలు, సూచనలు అందిస్తోంది.

తాజాగా వాట్సాప్ యాప్‌ వినియోగిస్తున్న యూజర్లు జాగ్రత్తగా ఉండాలని ఈ సంస్థ హెచ్చరిస్తోంది. వాట్సాప్‌లో మల్టిపుల్‌ వల్నరబిలిటీస్‌ ఉన్నాయని, హ్యాకర్స్‌కు టార్గెట్‌ మారడంలో సహాయపడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. వాట్సాప్‌లోని వల్నరబిలిటీస్‌ ఆర్బిటరీ కోడ్స్‌ను రన్‌ చేయడానికి అటాకర్‌కు ఉపయోగపడుతాయని, ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు యూజర్లు తమ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని CERT-In పేర్కొంది.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలి

మొజిల్లా ఫైర్‌ఫాక్స్బ్రౌజర్‌లో కూడా మల్టిపుల్‌ వల్నరబిలిటీస్‌ ఉన్నాయని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్ తెలిపింది. ఈ లోపాలను వినియోగించుకుని హ్యాక్‌ చేయడానికి వీలుగా రూపొందించిన వెబ్‌సైట్‌ను హ్యాకర్స్‌ ఓపెన్‌ చేసే అవకాశం ఉందని నోడల్ ఏజెన్సీ తెలిపింది. ఇటువంటి ప్రమాదాల నుంచి బయటపడానికి వినియోగదారులు మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ వెర్షన్‌ని 105కి, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ ESRని వెర్షన్ 102.3కి అప్‌డేట్ చేయాలని సూచించింది.

మీరు వాట్సాప్,వెబ్‌లో నోటిఫికేషన్‌లను స్వీకరించకపోతే, మీ నోటిఫికేషన్‌లు మీ బ్రౌజర్‌లో ఆన్ చేయబడి ఉన్నాయని నిర్ధారించుకోండి.
నోటిఫికేషన్‌లను ఆన్ చేయండి
మీ బ్రౌజర్‌లో, మీ చాట్‌ల జాబితా పైన ఉన్న నీలిరంగు బ్యానర్‌లో డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌లను ఆన్ చేయి క్లిక్ చేయండి.
స్క్రీన్‌పై ప్రాంప్ట్‌లను అనుసరించండి.
గమనిక: మీకు నీలం రంగు బ్యానర్ కనిపించకుంటే, పేజీని రిఫ్రెష్ చేయండి. మీకు ఇప్పటికీ బ్యానర్ కనిపించకుంటే, మీరు మీ వాట్సాప్, సెట్టింగ్‌లలో నోటిఫికేషన్‌లను మ్యూట్ చేసి ఉండవచ్చు లేదా ఆఫ్ చేసి ఉండవచ్చు.నోటిఫికేషన్‌లను అన్‌బ్లాక్ చేయండి
మీ బ్రౌజర్‌లో, మెనూ చిహ్నాన్ని క్లిక్ చేసి, ఆపై ఎంపికలు లేదా ప్రాధాన్యతలను క్లిక్ చేయండి.
గోప్యత & భద్రతపై క్లిక్ చేయండి.
అనుమతులు కింద, నోటిఫికేషన్‌ల ద్వారా సెట్టింగ్‌లు… క్లిక్ చేయండి.
“వెబ్.వాట్సాప్.కం”ద్వారా డ్రాప్‌డౌన్ బ్లాక్‌కి సెట్ చేయబడితే, దానిని అనుమతించడానికి మార్చండి.
మార్పులను సేవ్ చేయి క్లిక్ చేయండి.
ప్రత్యామ్నాయంగా, “హెట్ప్స్://వెబ్.వాట్సాప్.కం/”ద్వారా లాక్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్‌లను పంపడం బ్లాక్ చేయబడినట్లు చూపితే, “x” క్లిక్ చేసి, ఆపై పేజీని రిఫ్రెష్ చేయండి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *