వాట్సాప్‌ మెసేజ్‌ను తప్పుగా కొట్టారా? ఇకపై ఆందోళన అక్కర్లేదు, ఎందుకంటే..

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ ప్లాట్‌ ఫామ్ వాట్సాప్. ఎప్పటికప్పుడు తన వినియోగదారుల ముందుకు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంది.

మెసేజింగ్ లో మరింత సులువైన విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం నిరంతరం చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో ఎడిట్ ఫీచర్ గురించి జోరుగా చర్చ నడుస్తున్న ఈ సమయంలో వాట్సాప్ కు సంబంధించిన కీలక విషయం వెల్లడైంది. వాట్సాప్ త్వరలో మెసేజ్ ఎడిట్ ఫీచర్ ను అందుబాటులోకి

తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఎడిట్ మెసేజ్ ఫీచర్ కు సంబంధించి బీటా వెర్షన్ లో టెస్ట్ రన్ నడుస్తోంది. త్వరలోనే ఈ పరీక్షలు పూర్తి చేసుకుని వినియోగదారుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

సాధారణంగా వాట్సాప్ లో ఏదైనా మెసేజ్ పంపితే.. దాన్ని ఎడిట్ చేసే అవకాశం లేదు. ఏదైనా మెసేజ్‌ను పొరపాటుగా పంపిస్తే కచ్చితంగా డిలీట్ చేయాల్సి ఉంటుంది. కానీ, వాట్సాప్ ఇకపై ఆ ఇబ్బంది నుంచి విముక్తి కలిగించబోతుంది. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. మెసేజ్ పంపిన తర్వాత కూడా దాన్ని ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈనేపథ్యంలో ఎప్పుడైనా హడావిడిగా పంపిన మెసేజ్ లలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే వాటిని ఆ తర్వాత సరిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ ఎడిట్ ఫీచర్ కు సంబంధించిన విషయాలను తాజాగా వెబ్ బీటా ఇన్ఫో వెల్లడించింది.

వాస్తవానికి వాట్సాప్ ​లో ఎడిట్​ మెసేజ్​ ఫీచర్​ పై చాలా రోజులుగా పరిశోధన జరుగుతున్నట్లు తెలుస్తున్నది. గతంలో ఓసారి ఈ విషయం గురించి వాట్సాప్ ప్రస్తావించింది. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. వాట్సాప్​ యూజర్స్​ కూడా మెసేజ్ ఎడిట్ ఫీచర్ గురించి ఎదురుచూస్తున్నారు. తాజాగా వెబ్ బీటా ఇన్ఫో ఈ విషయానికి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ దశలో ఉన్నట్లు తెలిపింది. వాట్సాప్​ వర్షెన్​ 2.22.20.12లో ఈ ఫీచర్ ను టెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం కచ్చితంగా ప్రస్తావించలేదు. అటు వాట్సాప్ లో ఎడిట్ మెసేజ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? అనే విషయాన్ని కూడా వివరించలేదు. అయితే, తొలుత పంపిన వాట్సాప్ మెసేజ్ ను ఎడిట్ చేస్తే.. ఆ మెసేజ్ పక్కనే ఎడిటెడ్ అని చూపించే అవకాశం ఉందంటున్నారు టెక్ నిపుణులు. అంతేకాదు.. మెసేజ్ పంపిన కొద్ది సేపటి వరకే ఎడిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్తున్నారు. వాట్సాప్ కు భారత్ లో దాదాపు 50 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

వాట్సాప్‌లో మిస్ అయిన మెసేజ్‌ని ఎలా రీకాల్ చేయాలి?
తొలగించిన WhatsApp సందేశాలను తిరిగి పొందడానికి, మీరు యాప్ సెట్టింగ్‌లలో తప్పనిసరిగా చాట్ బ్యాకప్‌ని ప్రారంభించి ఉండాలి. దీన్ని చేరుకోవడానికి, సెట్టింగ్‌ల ట్యాబ్‌ను నొక్కండి. ఇది iPhone యాప్ దిగువ బార్‌లో ఉంది; ఆండ్రాయిడ్‌లో, ఎగువ-కుడివైపు మూడు-చుక్కల మెనుని తెరిచి, సెట్టింగ్‌లను ఎంచుకోండి. అక్కడ నుండి, చాట్‌లు > చాట్ బ్యాకప్‌కి వెళ్లండి.
  వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని తప్పించుకుంటున్నారని మీకు ఎలా తెలుస్తుంది?
వాట్సాప్ సందేశం మిస్ అయినందుకు చిత్ర ఫలితం? ఇక చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే..
వాట్సాప్‌లో ఎవరైనా మిమ్మల్ని బ్లాక్ చేశారో లేదో తెలుసుకోవడానికి వాట్సాప్ రెండవ టిక్‌లు ఒకటి.   పరిచయానికి సందేశం పంపడం ద్వారా ప్రారంభించండి మరియు టిక్‌ల కోసం చూడండి. సింగిల్ గ్రే టిక్ అంటే సందేశం పంపబడిందని అర్థం, డబుల్ గ్రే మరియు డబుల్ బ్లూ టిక్‌లు వరుసగా “డెలివరీ” మరియు “రీడ్” అని చూపుతాయి…
Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *