రూపాయి విలువ షేర్లు.. అన్నీ అప్పర్‌సర్క్యూటే.. కొంటే కాసుల పంట!
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. వరుసగా నాలుగు సెషన్లు తీవ్ర ఒడుదొడుకుల మధ్య ట్రేడయిన అనంతరం కిందటి సెషన్లో మన సూచీలకు లాభాలొచ్చాయి. అయితే మళ్లీ మరుసటి రోజు ఒత్తిడికి లోనవుతున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 70 పాయింట్లు పెరిగి 61 వేల 500 మార్కు వద్ద కదలాడుతోంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 10 పాయింట్లకుపైగా లాభంతో 18 వేల 250 వద్ద ఉంది. ఆటో, PSU బ్యాంకింగ్ ఇండెక్స్ 0.5 శాతం చొప్పున లాభపడ్డాయి. సిప్లా, హెచ్డీఎఫ్సీ లైఫ్, SBI, మారుతీ సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ రాణిస్తున్నాయి. ఇదే క్రమంలో అదానీ ఎంటర్ప్రైజెస్, టీసీఎస్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, హెచ్‌యూఎల్ డీలాపడ్డాయి. మార్కెట్లు ఒడుదొడుకుల్లో ఉన్నప్పటికీ కొన్ని పెన్నీ స్టాక్స్ మాత్రం రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి.
మొత్తంగా ఇవాళ సెషన్ ఆరంభంలో 1793 షేర్లకుపైగా లాభపడ్డాయి. 814 షేర్లు నష్టపోయాయి. 148 షేర్లలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దాదాపు అన్ని రంగాలు సానుకూలంగానే ట్రేడవుతున్నాయి. BSE ఫైనాన్షియల్ సర్వీసెస్, BSE రియాల్టీ 0.5 శాతం చొప్పున పెరిగాయి. BSE స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో సద్భవ్ ఇంజినీరింగ్ లిమిటెడ్, TCNS క్లాతింగ్ లిమిటెడ్, ఆర్తి సర్ఫాక్టెంట్స్ వరుసగా 11, 8,7 శాతం చొప్పున పెరిగాయి. బాలాజీ టెలీఫిల్మ్స్, ఒలెక్ట్రా లిమిటెడ్, కోప్రాన్ లిమిటెడ్ మాత్రం నష్టపోయాయి. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి ఆస్ట్రేలియా పార్లమెంటు ఓకే చెప్పింది. దీంతో మార్కెట్లు లాభాల్లో కదలనున్నట్లు సమాచారం.
అయితే మార్కెట్లు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నప్పటికీ కొన్ని చిన్న చిన్న షేర్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. పంకజ్ పాలిమర్స్ లిమిటెడ్, ఓంటిక్ ఫిన్సర్వ్ లిమిటెడ్ వంటి చిన్న చిన్న స్టాక్స్ అప్పర్‌సర్క్యూట్‌లో లాకయ్యాయి. వీటిపై ఓ కన్నేస్తే మంచిది. రాబోయే సెషన్లలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది.