ప్రేమ‌యినా.. పెళ్ల‌యినా.. ఈ విష‌యం తెలుసుకోకుంటే అంతే!

ప్రేమ‌యినా.. పెళ్ల‌యినా.. ఈ విష‌యం తెలుసుకోకుంటే అంతే!

మీరు ప్రేమ‌లో ఉన్నా.. వివాహ బంధంలో ఉన్నా.. మీ బంధం ధృఢంగా ఉండ‌డానికి కొన్ని విష‌యాలు అవ‌స‌రం. ప్రేమించి పెళ్లి చేసుకొనేవారు,పెళ్లి చేసుకొని భాగ‌స్వామిని ప్రేమించే వారు త‌మ బంధానికి సంబంధించి కొన్ని విష‌యాలు తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అవేంటో తెలుసుకోండి.

* మీ భాగ‌స్వామికి మీరెంత ఇష్టమైనా మీ మనసులో ఎప్పుడు ఏమనుకుంటున్నారో ఆయన కనిపెట్టలేకపోవచ్చు. కాబట్టి మీకేమైనా కావాలంటే ఏదైనా చెప్పాలంటే మనసు విప్పి చెప్పేయండి. అంతేకానీ ఆయనే తెలుసుకోవాలి, తెచ్చిపెట్టాలని ఆశించొద్దు. ఇలాంటివి సినిమాల్లోనే బాగుంటాయి. నిజజీవితంలో కాదు.

* మీకు పెళ్లి అయినా ప్రేమ‌లో ప‌డ్డా మీ తోటి వ్య‌క్తి వ్యక్తిత్వాలు మారిపోవు. ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాలి. పెళ్లయిన వారు కుటుంబానికి తగ్గట్టుగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే ప్రేమలో ఉన్న వారు మీరు ఎదుటి వ్య‌క్తి జీవితంలోకి రాక‌ముందు కూడా అత‌నికి ఒక జీవితం ఉంద‌ని గుర్తించి దాన్ని గౌర‌వించాలి.

* ఈ విష‌యం తెలుసుకోంకుండా మొత్తం మీ గురించే మీతో ఉండాలి అనుకోవ‌డం క‌చ్చితంగా త‌ప్పే. బంధం బాధ్య‌త‌ను పెంచుతూనే స్వేచ్ఛ‌ను ఇవ్వాలి. అంతే త‌ప్ప భారం కాకుడ‌దు అని గుర్తించుకోండి.

*మీ భాగ‌స్వామిని అత‌ను లేదా ఆమె చిన్నప్పటి నుంచి పాటించిన విలువలు, అలవాట్లను ఒక్కసారే మీ కోసం మార్చుకోమని ఒత్తిడి చేయడం సరికాదు. ఇలా చేస్తే మీ మీద గౌర‌వం, ప్రేమ త‌గ్గే అవ‌కాశం ఉంది.

* ప్ర‌పంచంలో అంద‌రూ ఒకేలా ఉండరు. మీరు ఉన్న‌ట్టే మీ భాగ‌స్వామి ఉండాలి అనుకోవ‌చ్చు.. కానీ అది క‌చ్చితంగా సాధ్యం కాదు. భిన్న‌త్వంలోనే అందం ఎక్కువ‌గా ఉంటుంది. అత‌ను లేదా ఆమె సామ‌ర్థ్యాల్లో ఏదైనా లోటు పాట్లు ఉండొచ్చు. అయినా వారు మీరు ఎంచుకొన్న భాగ‌స్వామి అని గుర్తించండి.

* మీ భాగస్వామికి మీరు అప్పగించిన పనులను సమయానికి పూర్తి చేయట్లేదనో…  ఒకవేళ మిమ్మల్ని మెప్పించాలని త్వరగా చేసినా అది సరిగ్గ చేయలేకపోతే అప్పుడూ ఇబ్బందే కదా. సర్దుకుపోవడం నేర్చుకోండి.

* మీరు ఉన్న‌తంగా ఆలోచించే వారు అయి ఉండొచ్చు. చేసే పనుల్లో వేగం ఉండొచ్చు.. ఇలా చాలా సుగుణాలు మీ సొంతమ‌యై ఉండొచ్చు.. అయితే వాటిని ప్రతి సారి, ప్రతిక్షణం మీ భాగస్వామి మెచ్చుకోవాలని ఎదురుచూడొద్దు. అది అత్యాశే.. త‌ప్పుకూడా.

* ఒక్క‌టి మాత్రం నిజం జీవిత భాగ‌స్వామి, ప్రియుడు, ప్రియురాలిపై మితిమీరిన అంచనాలు ఉండొద్దు. ఇవి ఏ బంధాన్నయినా బలహీనపరుస్తాయి. మీరనుకున్నట్లుగానే భాగస్వామి నడుచుకోవాలనుకోవడం, మీ అంచనాలను ప్రతిసారీ అందుకోవాలనుకోవడం అత్యాశే అవుతుంది. మీ బంధం చక్కగా సాగాలంటే భాగస్వామి నుంచి ఈ విషయాలను ఆశించకండి మరి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *