మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం ఉండటం లేదా.. అయితే లైఫ్ టైమ్ పెరిగేందుకు ఈ టెక్ చిట్కాలను అనుసరించండి;

మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం ఉండటం లేదా.. అయితే లైఫ్ టైమ్ పెరిగేందుకు ఈ టెక్ చిట్కాలను అనుసరించండి!

 

ఇప్పుడు స్మార్ట్‌ఫోన్‌ వినియోగం చాలా పెరిగిపోయింది. దీంతో ఫోన్‌లో మాట్లాడటం, పేమెంట్స్‌, మెసేజ్‌లు, వీడియోలు.. ఇలా స్మార్ట్‌ఫోన్‌ నిరంతరం బిజీగానే ఉంటోంది.

మనం 4జీ నుంచి 5జీకి మారిపోతున్నాం. అయితే స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీని కూడా సేఫ్‌గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఛార్జింగ్‌ పెట్టుకుంటూ ఉండటం.. బ్యాటరీ బ్యాకప్‌లను వెంటపెట్టుకోని వెళ్లడం ప్రతిసారీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే బ్యాటరీ జీవిత కాలాన్ని పెంచుకుంటే మంచిదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ ఫోన్‌ను ఛార్జింగ్‌ చేస్తూ ఉన్నా సరే బ్యాటరీ లైఫ్‌ తగ్గిపోతుంది. ఉన్న బ్యాటరీనే ఎక్కువ సమయం రావాలంటే మాత్రం ఇలాంటి చిట్కాలను ఫాలో కావడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది. అయితే ఏం చేయాలో తెలుసుకుందాం..

 

బ్రైట్‌నెస్‌ తగ్గించుకోవడం.. కళ్ళపై ఒత్తిడి:

 

మీరు బ్యాటరీని ఎక్కువసేపు పని చేయాలని అనుకుంటే.. స్మార్ట్‌ఫోన్ లైటింగ్ తగ్గించాలి. ఎందుకంటే బ్యాటరీ గంటల తరబడి ఉంటుంది. మీ కళ్ళపై ఎక్కువ ఒత్తిడిని కలిగించదు.

 

స్పీకర్ వాల్యూమ్‌ను మీడియం కంటే కొంచెం:

 

బ్యాటరీ ఎక్కువసేపు ఉండేలా చేయడానికి, మీరు స్పీకర్ వాల్యూమ్‌ను మీడియం కంటే కొంచెం తక్కువగా ఉంచాలి. అది మీడియం కంటే ఎక్కువగా ఉండకూడదు. మీరు చాలా బ్యాటరీని ఆదా చేయవచ్చు.

 

స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్:

 

మీ స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ ఎక్కువ లోడ్ అవుతుంటే.. బ్యాటరీ కూడా ఎక్కువగా పోతుంది. అటువంటి పరిస్థితిలో స్మార్ట్‌ఫోన్ నుంచి భారీ గేమ్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.

 

డూప్లికేట్ ఛార్జర్‌తో ఛార్జింగ్ వద్దు:

 

మీరు డూప్లికేట్ ఛార్జర్ సహాయంతో స్మార్ట్ ఫోన్‌ను ఛార్జ్ చేస్తుంటే, దాన్ని ఉపయోగించడం మానేయండి ఎందుకంటే డూప్లికేట్ ఛార్జర్ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ జీవితాన్ని తగ్గించడమే కాకుండా దానిని పాడు చేస్తుంది.

 

వీటితో ప్రాసెసర్‌పై ఒత్తిడి:

 

మీ స్మార్ట్‌ఫోన్‌లో ఫైల్‌లు సేకరించబడి ఉంటే.. వాటిని ప్రాధాన్యత ప్రకారం తొలగించండి. ఎందుకంటే అవి స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్‌పై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి. దీని కారణంగా బ్యాటరీ వినియోగం పెరుగుతుంది.

 

బ్లూటూత్, లోకేషన్‌ ఆపేయండి:

 

స్మార్ట్‌ఫోన్‌లో అవసరం లేనప్పుడు బ్లూటూత్‌ కనెక్షన్‌, జీపీఎస్‌ వంటి వాటిని నిలివేయండి. బ్యాటరీ ఎక్కువగా వాడుకునే వాటిలో జీపీఎస్‌ ఒకటి. అందుకే జీపీఎస్‌తో పని లేనప్పుడు దానిని ఆపేసుకుంటే మంచిది. జీపీఎస్‌, బ్లూటూత్‌ కనెక్షన్‌ కావాలనుకున్నప్పుడు చాలా తేలికగానే ఓపెన్‌ చేసుకునే వెసులుబాటు స్మార్ట్‌ఫోన్లలో ఉంటుంది. మరి అలాంటప్పుడు అనవసరంగా ఉండే వాటిని కట్టేస్తేనే బ్యాటరీ లైఫ్‌ ఎక్కువ కాలం వస్తుంది.

లైవ్‌ వాల్‌పేపర్స్‌, విడ్జెట్స్‌ ఒద్దే ఒద్దు:

 

మనలో చాలా మంది స్మార్ట్‌ఫోన్లో లుక్‌ కోసం ఆన్‌లైన్ వాల్‌పేపర్స్‌ను ఉపయోగిస్తుంటారు. యానిమేటెడ్‌, గ్రాఫిక్స్‌తో రూపొందించిన లైవ్‌ వాల్‌పేపర్స్‌ను సెట్‌ చేసుకుంటే బ్యాటరీ వినియోగం పెరుగుతుంది. ఫోన్‌లో ఆఫ్‌లో ఉన్నా సరే బ్యాటరీ వినియోగం మాత్రం కొనసాగుతుంటుంది. కాబట్టి లైవ్‌ వాల్‌పేపర్స్‌, విడ్జెట్స్‌ను వినియోగిచడం మంచిది కాదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *