‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లాలంటేనే సామాన్యులకు ఎంతో కష్టం. అలాంటిది ఓ పెద్దాయన కొరడా తీసుకుని ఆ రాష్ట్ర సీఎంను ఎడా పెడా కొట్టేశాడు. అయితే అన్ని దెబ్బలు తింటున్నా.. ముఖ్యమంత్రి మాత్రం నవ్వుతూ ఉన్నారు.
పక్కన వారు ఆపడం మానేసి.. కళ్లప్పగించి చూస్తున్నారు, కెమెరాలు, మోబైల్ ఫోన్లలో ఫోటోలు తీసుకుంటున్నారు కానీ.. ఎవరూ ఆపలేదు.
అదేంటి.. సీఎంను కొరడాతో కొడుతున్నా ఎవరూ ఏమీ అనకపోవడం ఏంటి..? అని ఆలోచిస్తున్నారా..? ఎందుకంటే అది అక్కడి సంప్రదాయం.
ప్రతి ఏడాది దీపావళి తర్వాత ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో గోవులకు గోవర్ధన పూజ నిర్వహిస్తారు. దుర్గ్ జిల్లాలోని జజన్ గిరి అనే గ్రామంలో గోవర్ధన పూజ సందర్భంగా కొరడా దెబ్బలు తినడం ఎప్పటినుంచో వస్తోంది. నేడు జజన్ గిరి గ్రామంలో ఈ పూజ నిర్వహించగా, సీఎం భూపేశ్ భగేల్ కూడా హాజరయ్యారు. గోవర్ధన పూజలో పాల్గొన్న ఆయన ఆ వింత ఆచారాన్ని పాటించారు. కొరడాతో 8 పర్యాయాలు కొట్టించుకున్నారు.
ఆయన గతేడాది కూడా ఈ పూజా కార్యక్రమాలకు విచ్చేశారు. కొరడా దెబ్బలు తింటే దైవ కృప లభిస్తుందన్నది అక్కడి వారి నమ్మకం. తాను కూడా ఈ వింత ఆచారాన్ని నమ్ముతానని సీఎం భగేల్ వెల్లడించారు. రాష్ట్ర ప్రజల క్షేమాన్ని కోరి కొరడా దెబ్బలు తిన్నానని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
రాష్ట్రం సౌభాగ్యంతో తులతూగాలని, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని స్వయానా ముఖ్యమంత్రి ఇలా కొరడా దెబ్బలు కొట్టించుకుంటారు.
ఛత్తీస్‌ఘడ్‌లో ఉందీ సంప్రదాయం. దుర్గ్ జిల్లా, జజంగిర్ గ్రామంలో ప్రతి ఏటా గోవర్ధన్ పూజ వైభవంగా నిర్వహిస్తారు.
ఈ పూజలో రాష్ట్ర సీఎం స్వయంగా పాల్గొంటారు. ఈ ఏడాది జరిగిన పూజలో సీఎం భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు.
సంప్రదాయం ప్రకారం ఆయన కూడా చేతిపై కొరడాతో దాదాపు పది దెబ్బలు కొట్టించుకున్నారు” అని ఆ కథనంలో పేర్కొన్నారు.
ఛత్తీస్‌ఘడ్ సీఎం భూపేష్ బాఘెల్ కొరడా దెబ్బలు తిన్నారు. సీఎం కొరడా దెబ్బలు తినడమేంటి..? ఆయనను కొట్టే ధైర్యం ఎవరికుంది..?
అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజం. ఐదు కొరడా దెబ్బలు తిన్న సీఎం ఇక చాలంటూ చెయ్యి వెనక్కి తీసుకున్నారు. కొరడా దెబ్బలు కొట్టిన వ్యక్తికి నమస్కరించి గుడి నుంచి వెళ్లిపోయారు. దుర్గ్ జిల్లా జబన్ గిరి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలో దీపావళి పండుగ మరుసటి రోజు కొరడా దెబ్బలు తినే ఆచారం ఆనవాయితీగా వస్తోంది. పండుగ సందర్భంగా గోవర్ధన పూజలో పాల్గొని కొరడా దెబ్బలు తింటే అన్ని కష్టాలు.. విఘ్నాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని ప్రజల నమ్మకం. ఇందులో భాగంగానే సీఎం భూపేష్ బాఘెల్ ఇవాళ జజన్ గిరి గ్రామానికి వెళ్లి గోవర్ధన పూజ చేశారు. అనంతరం కొరడా దెబ్బలు తిన్నారు. ముఖ్యమంత్రి కొరడా దెబ్బలు తిన్న వీడియోను సీఎంవో ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు