వాట్సాప్ లో అవసరం లేని ఫైల్స్ ను ఇలా డిలీట్ చేయొచ్చు..

వాట్సాప్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. కోట్లాది మంది తమ తమ రోజు వారీ అవసరాల కోసం ఈ మెసేజింగ్ యాప్ ను వినియోగిస్తున్నారు. వాట్సాప్ ద్వారా చాటింగ్ తో పాటు వీడియో, ఆడియో కాల్స్ చేసుకోవచ్చు. తమ ఉద్యోగ, వ్యాపార పనులను వాట్సాప్ ద్వారా నిర్వహించుకోవచ్చు. వాట్సాప్ అనేది నిజానికి ఓ సముద్రం లాంటిది. ఇందులో ఎన్నో అద్భుతాలున్నాయి. చక్కటి ఫీచర్లు ఉన్నాయి. కానీ, చాలా మందికి వాటి గురించి తెలియదు. కొన్ని ట్రిక్స్ నేరుగా వాట్సాప్ లోనే ఉండగా..  మరికొన్ని థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. వాటిలో ఒక ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

వాట్సాప్ వినియోగదారులకు సాధారణంగా చాలా వీడియోలు, ఆడియోలు, మెసేజ్ లు వస్తుంటాయి. ఒక్కోసారి పొరపాటున ఆయా వీడియోలు, ఆడియోలు డిలీట్ అవుతాయి. ఇప్పుడు మన డిలీట్ చేసిన వీడియోలను, ఆడియోలను, మెసేజ్ లను  చూడవచ్చు.

కొంత మంది అప్పుడప్పు కొన్ని సందేశాలను పంపించి కొద్ది సేపటికే తొలగిస్తారు. ఆ మెసేజ్ లను పొందిన వ్యక్తిలో ఒక క్యూరియాసిటీ కలుగుతుంది. ఇంతకీ డిలీట్ చేసిన మెసేజ్ లో ఏముందో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇందుకోసం కొంత మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే కొన్ని ట్రిక్స్ ఉపయోగించడం మూలంగా డిలీట్ చేసిన వాటిని చూడవచ్చు. నకు తెలిసిన వారు, బంధుమిత్రుల కాంటాక్ట్ ల నుంచి మన ఫోన్లోకి ఎంతో మీడియా ఫైల్స్  అంటే ఫొటోలు , వీడియోలు , డాక్యుమెంట్లు , జిఫ్ ఫైల్స్వచ్చి చేరుతుంటాయి.

దీనివల్ల ఫోన్ స్టోరేజీ  పై భారం పెరిగిపోతుంది. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. లేదంటే పెరిగిపోయిన ఫైల్స్ వల్ల ఫోన్ పనితీరు నెమ్మదించొచ్చు. వాట్సాప్ లో ఈ అవసరం లేని ఫైల్స్   చెత్తను సులభంగానే డిలీట్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ యాప్ ను తెరవాలి. పైన కుడివైపున కనిపించే మూడు డాట్ల వద్ద క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ సెలక్ట్ చేసుకోవాలి. అందులో మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ కు వెళ్లాలి. అప్పుడు వాట్సాప్ ఫైల్స్ డేటా (ఫోన్ మెమొరీ) కనిపిస్తుంటుంది. అక్కడ కనిపించే లార్జర్ దెన్ 5 ఎంబీ ఫైల్స్ ను క్లిక్ చేయాలి. అక్కడ ఉండే పెద్ద సైజు ఫైల్స్ లో అవసరం లేని వాటిని సెలక్ట్ చేసుకుని డిలీట్ చేయవచ్చు. అక్కడే కాంటాక్ట్ లిస్ట్ కనిపిస్తుంది. అంటే ప్రతి కాంటక్ట్ నుంచి వచ్చిన స్టోరేజీ వివరాలు ఉంటాయి. కనుక కాంటాక్ట్ వారీగా మీడియా ఫైల్స్ చూసి డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత, ఫోన్ స్టోరేజీని ఓ సారి పరిశీలించుకుని అక్కడ కూడా కనిపిస్తే డిలీట్ చేసుకోవాలి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *