మీ ఆధార్ నెంబర్ తో ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయో తెలుసుకోండిలా

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు అన్నది ఎంత కీలకంగా మారిందో మనందరికీ తెలిసిందే. ముఖ్యమైన డాక్యుమెంటల్ లలో ఆధార్ కార్డు కూడా ఒకటి. ప్రైవేట్ గవర్నమెంట్ ఇలా ప్రతి ఒక పనికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి.

ఇది సాధారణ మొబైల్ కమ్యూనికేషన్‌ల కోసం ఉపయోగించగల 9 సిమ్‌లను మరియు M2M (మెషిన్ టు మెషిన్) కమ్యూనికేషన్‌ల కోసం మిగిలిన 9 సిమ్‌లను కలిగి ఉన్న సంఖ్యను 18కి పెంచింది. మీ ఆధార్ కార్డ్‌లో ఎన్ని సిమ్‌లు ఉన్నాయి?

గ్యాస్ సిలిండర్ నుంచి బ్యాంకు ఖాతాల వరకు ప్రతి ఒక్క విషయానికి ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. చివరికి మొబైల్ ఫోన్ సిమ్ కార్డు తీసుకోవాలి అన్నా కూడా ఆధార్ నెంబర్ తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే ఆధార్ నెంబర్ ను మనం వినియోగిస్తున్నప్పటికీ మనకి తెలియకుండా చాలామంది నేరగాళ్లు దుర్వినియోగం చేస్తున్నారు. మరి ముఖ్యంగా సిమ్ కార్డ్స్ తీసుకునే విషయంలో ఆధార్ ని దుర్వినియోగం చేస్తున్నారు.

అయితే ఒకవేళ సిమ్ కార్డు తీసుకోవడానికి మీ ఆధార్ నెంబర్ ను ఎవరైనా మీకు తెలియకుండా ఉపయోగించి ఉంటే అటువంటప్పుడు టెన్షన్ పడాల్సిన పనిలేదు. ఈజీగా మీ ఆధార్ నెంబర్ పై యాక్టివ్ గా ఉన్న సిమ్ ల వివరాలు తెలుసుకోవచ్చు. అంతే కాకుండా వెంటనే ఆ సిమ్ములపై రిపోర్ట్ చేసి వాటి సేవలను నిలిపి వేయవచ్చు. అయితే ఆధార్ నెంబర్ పై యాక్టివ్గా ఉన్న సిమ్ముల వివరాలు తెలుసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం టాఫ్ కాఫ్ పేరుతో ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ వెబ్సైట్ ద్వారా మన పేరుతో రిజిస్టర్ అయిన మొబైల్ కనెక్షన్లను ఈజీగా తెలుసుకోవచ్చు. టాఫ్ కాఫ్ వెబ్ సైట్ సేవలను ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం పరిమితం చేసింది. అందులో తెలంగాణ, ఏపీ,కేరళ రాజస్థాన్,జమ్మూ కాశ్మీర్ లో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

మరి మన ఆధార్ నెంబర్ పై ఏ సిమ్ములు ఉన్నాయో ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. హెట్ప్స్://టాప్కాప్.డిజిటెలీకం. గొవ్.ఇన్‌/లోకి వెళ్లి మీ మొబైల్‌ నంబరును ఎంటర్‌ చేసి రిక్వెస్ట్‌ ఓటీపీ పై క్లిక్ చేయాలి. తరువాత మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ఎంటర్‌ చేసి వాలిడేట్‌ పై క్లిక్‌ చేయాలి. అప్పుడు మన ఆధార్‌ నంబర్ పై జారీ అయిన మొబైల్‌ నంబర్లు కనిపిస్తాయి. వాటిలో మీకు తెలియని నంబర్లు ఉంటే వెంటనే రిపోర్టు చేయొచ్చు. ముందుగా నంబర్ ఎంచుకుని దిస్‌ ఈజ్‌ నాట్‌ మై నంబర్‌, నాట్‌ రిక్వయిర్డ్‌, రిక్వయిర్డ్‌ ఆప్షన్లలో మీకు అవసరమైనది సెలెక్ట్‌ చేసుకొని, రిపోర్టు చేయాలి. వెంటనే ఫోన్‌కు సందేశం వస్తుంది.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా  ప్రకారం, మీ ఆధార్ నంబర్‌తో ఎన్ని మొబైల్ నంబర్‌లు లింక్ అయ్యాయో తెలుసుకోవడం కూడా మీకు చాలా ముఖ్యం. తద్వారా మీ ఆధార్ నంబర్ ఎక్కడా దుర్వినియోగం కావడం లేదని తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డ్‌తో ఎన్ని నంబర్లు లింక్ అయ్యాయో తెలుసుకోవడానికి, మీ మొబైల్ నంబర్‌ను దానికి లింక్ చేయడం అవసరం. కొన్నిసార్లు మొబైల్ ఫోన్ దొంగతనం లేదా పడిపోవడం వల్ల సిమ్ కార్డ్ పోతుంది మరియు మీ సిమ్ కార్డ్ దుర్వినియోగం కావచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *