నోకియా టాయిలెట్ పేపర్… సోనీ రైస్ కుక్కర్… ఈ నిజాలు మీకు తెలుసా?

నోకియా పేరు వినగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు (Smartphones), ఇతర గ్యాడ్జెట్స్ గుర్తొస్తాయి కదా?
మరి కోల్గేట్ (Colgate) పేరు వింటే  ఏం గుర్తొస్తుంది? టూత్ పేస్ట్ గుర్తొస్తుంది. మీ టూత్ పేస్ట్‌లో ఉప్పుందా అనే యాడ్ గుర్తొస్తుంది. అసలు..!
ఈ కంపెనీలు మొదట  ఏం తయారు చేశాయో, ఏమి అమ్మాయో తెలుసా?
      నోకియా మొదట టాయిలెట్ పేపర్లు తయారు చేసి అమ్మింది. కోల్‌గేట్ క్యాండిల్స్ తయారు చేసింది. ఇలా ప్రస్తుత ప్రముఖ కంపెనీలు మొదట్లో ఏఏ ప్రొడక్ట్స్ తయారు చేశాయో మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. వాల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ట్వీట్‌ని ఆయన రీట్వీట్ చేశారు. ఆంట్రప్రెన్యూర్స్ ఎలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటారో, అవకాశాలను ఎలా గుర్తిస్తారో చెప్పే లిస్ట్ ఇది అని, మన వ్యక్తిగత జీవితాలకు అనేక పాఠాలను నేర్పుతుందని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మార్పును చూసి భయపడవద్దని, మీరు మొదట ప్రారంభించిన దానితోనే ఉండాల్సిన అవసరం లేదని, పరిణామమే జీవితం అని అభిప్రాయ పడ్డారు. వాల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ట్వీట్‌లో ఆసక్తికరమైన వివరాలున్నాయి. ప్రముఖ కంపెనీలు మొదట్లో తయారు చేసిన వస్తువుల జాబితా ఉంది. ఆ జాబితా ప్రకారం ఏ కంపెనీ మొదట ఏఏ ప్రొడక్ట్స్ తయారు చేసిందో తెలుసుకుందాం.
ఎలక్ట్రానిక్స్ కంపెనీగా పేరున్న నోకియా టాయిలెట్ పేపర్లు అమ్మింది. మరో ఎలక్ట్రానిక్స్ కంపెనీ సోనీ మొదట్లో ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లు తయారు చేసింది. ఇక స్మార్ట్‌ఫోన్ , స్మార్ట్ టీవీ బ్రాండ్ అయిన సాంసంగ్ పండ్లు, చేపల్ని అమ్మింది. ప్రముఖ టాయ్స్ కంపెనీ లీగో వుడెన్ టాయ్ డక్స్ తయారుచేసేది. ఓరల్ కేర్ బ్రాండ్ అయిన కోల్గేట్ మొదట్లో క్యాండిల్స్ తయారు చేసేది. టొయోటా మొదట్లో మగ్గం పనులు చేసేది. నింటెండో కంపెనీ ప్లేయింగ్ కార్డ్స్, టిఫానీ అండ్ కో కంపెనీ స్టేషనరీ, హస్‌బ్రో కంపెనీ టెక్స్‌టైల్స్, ఐకియా సంస్థ పెన్స్, వ్రిగ్లీ సంస్థ సోప్, ఎవాన్ కంపెనీ బుక్స్, డ్యూపాంట్ మొదట్లో గన్ పౌడర్ అమ్మేవి.
ఇలా ఈ కంపెనీలన్నీ మొదట తయారు చేసిన ప్రొడక్ట్స్ ఇవే. కానీ ఇప్పుడు ఈ కంపెనీల పేరు చెబితే గుర్తొచ్చే ప్రొడక్ట్స్ వేరు. ఎక్కడ మార్కెట్ ఉందో, మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉందో తెలుసుకొని, వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకొని ఈ కంపెనీలు ఇంతలా ఎదిగాయి. మొదట తయారు చేసిన ప్రొడక్ట్స్ మాత్రమే అమ్మాలని పట్టుబట్టి కూర్చొని ఉంటే ఇంత పెద్ద కంపెనీలు కాకపోయేవి….
       ఈ జాబితా గొప్ప పాఠాలను అందిస్తుంది మొదటి ఉత్పత్తుల జాబితాను పంచుకుంటూ, ఆనంద్ మహీంద్రా ఇలా వ్రాశాడు, “అవకాశాలు వచ్చినప్పుడు వ్యాపారవేత్తలు ఎంత సరళంగా ఉంటారో చూపే చాలా ఆకర్షణీయమైన జాబితా ఇది.” అలాగే, ఆనంద్ మహీంద్రా ఈ జాబితా మాకు మార్పుకు భయపడని ముఖ్యమైన పాఠాన్ని కూడా ఇస్తుందని రాశారు. మీరు మొదట ఏమి చేయడం ప్రారంభించారో దానికి అంకితం చేయవలసిన అవసరం లేదు. ఎదుగుదల జీవితం!    ”టయోటా ఈ పని చేసేదిఆనంద్ మహీంద్రా షేర్ చేసిన జాబితా నుండి చాలా ఆసక్తికరమైన సమాచారం బయటకు వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టయోటా మొదట్లో ఆటోమేటిక్ మగ్గాలను తయారు చేసేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్లాస్టిక్ బిల్డింగ్ బ్లాక్‌లను తయారు చేసే పెద్ద కంపెనీ లెగో, చెక్క బొమ్మలను తయారు చేయడానికి స్థాపించబడింది. శామ్సంగ్ ప్రారంభంలో పండ్లు మరియు కూరగాయల వ్యాపారం చేసేది, డ్యూపాట్ గన్ పౌడర్ వ్యాపారంలో నిమగ్నమై ఉంది

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *