రిపబ్లిక్ డే సందర్భంగా.. బైక్ ల నుంచి ఫోన్ల దాకా భారీగా డిస్కౌంట్లు.. లిస్ట్ ఇదే..

భారత దేశ వ్యాప్తంగా ఈరోజు అంటే జనవరి 26న 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజలంతా ఘనంగా జరుపుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఈ కామర్స్ సంస్థలతో పాటు ఆఫ్ లైన్ సంస్థలు కూడా భారీగా ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థలు అందిస్తున్న ఆఫర్ల వివరాలు ఇలా ఉన్నాయి

విజయ్ సేల్స్ మెగా రిపబ్లిక్ డే సేల్ 
విజయ్ సేల్స్ సైతం అనేక ఉత్పత్తులపై 65 శాతం రాయితీలను ప్రకటించింది. గాడ్జెట్‌లు, గృహ మరియు వంటగది ఉపకరణాలు మరియు వినోద ఉత్పత్తులపై కూడా బెస్ట్ ఆఫర్‌లు ఉన్నాయి. పలు బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.7500 వరకు తక్షణ డిస్కౌంట్ అందుకోవచ్చు

క్రోమా రిపబ్లిక్ డే సేల్  జనవరి 19న ప్రారంభమైన ఈ సేల్ జనవరి 29 వరకు కొనసాగనుంది. ఈ సేల్ లో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నారు. దీంతో పాటు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలపై కూడా రాయితీలు ఉన్నాయి.

బజాజ్ మాల్ గ్రాండ్ రిపబ్లిక్ డే  జనవరి 16 నుంచి బజాజ్ మాల్ గ్రాండ్ రిపబ్లిక్ డేస్ సేల్ ను ప్రారంభిం

చింది. ఈ సేల్ లో రూ.6000 వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు ఉన్నాయి. ఇంకా అన్ని రకాల ద్విచక్ర వాహనాలపై క్యాష్ బ్యాక్ ఆఫర్లతో పాటు సరసమైన EMI ఆప్షన్లు అందించబడుతున్నాయి.

TCL రిపబ్లిక్ డే సేల్  ఈ సేల్ జనవరి 15న ప్రారంభమై జనవరి 30 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో స్మార్ట్ టీవీలు, ఎల్‌ఈడీ టీవీలు, మినీ ఎల్‌ఈడీ టీవీ మోడళ్లపై 55 శాతం తగ్గింపును ప్రకటించింది. ఎంపిక చేసిన ఉత్పత్తులపై 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇవ్వబడుతోంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *