వాట్సాప్‌లో మెసేజ్ పంపినవారికి తెలియకుండా ఎలా చదవాలో తెలుసా? ఇదిగో సింపుల్ ట్రిక్..!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీ విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతోంది. వాట్సాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.

ప్రైవేట్ మెసేజింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రత్యేక ప్రైవసీ ఫీచర్లను అందిస్తుంది. సాధారణంగా వాట్సాప్‌లో ఫీచర్ రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేసే వీలుంది. ఒకసారి ఆఫ్ చేసిన తర్వాత.. అవతలి వైపు ఉన్న వ్యక్తి తమ మెసేజ్‌లను చదివారా లేదా అనేది వినియోగదారులు తెలుసుకోలేరు. కానీ ఫీచర్‌లో ఒక లోపం ఉందని గమనించాలి.

ఈ ఫీచర్ పంపినవారు, రిసీవర్ రెండింటికీ రీడ్ రిసిప్ట్‌లను కూడా నిలిపివేస్తుంది. తద్వారా వారి వాట్సాప్ మెసేజ్‌లు చదువుతున్నారా? లేదా అని ఎవరూ చెక్ చేయలేరు. ఇప్పుడు చాట్ ఓపెన్ చేయకుండా లేదా అవతలి వ్యక్తికి తెలియకుండా మెసేజ్‌లను ఎలా చదవాలి? అంటారా? వాట్సాప్ చాట్‌ని ఓపెన్ చేయకుండా లేదా పంపినవారికి తెలియకుండా ఉండేలా వాట్సాప్మెసేజ్ చదవగలిగే కొన్ని టెక్ టిప్స్ ఉన్నాయి. ఈ టిప్స్ ద్వారా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు వాట్సాప్ మెసేజ్‌లను చదువుకోవచ్చు.

వాట్సాప్ బ్లూ టిక్ సెట్టింగ్‌లను ఎలా ఆఫ్ చేయాలంటే? :
కానీ, అన్ని ఇతర ‘అనధికారిక పద్ధతుల’ కన్నా ముందు వాట్సాప్ అధికారిక ఫీచర్‌ను ఓసారి చూద్దాం.. ఇది రీడ్ రిసిప్ట్ ఆఫ్ చేస్తుంది.. అంటే బ్లూ టిక్‌ను ఆఫ్ చేస్తుందని గమనించాలి. వాట్సాప్రీడ్ రిసిఫ్ట్ ఆఫ్ చేయడానికి వాట్సాప్ సెట్టింగ్స్ >అకౌంట్> ప్రైవసీకి వెళ్లి, రీడ్ రిసిఫ్ట్ ఆప్షన్ ఆఫ్చేయండి. మీరు రీడ్ రిసిఫ్ట్‌లను ఆఫ్ చేయకుండానే మెసేజ్ చూడగలిగే కొన్ని ఇతర మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్ ప్లేన్మోడ్‌ని ఆన్ చేయండి :
వాట్సాప్‌లో మెసేజ్ ఓపెన్ చేయడానికి ముందు మీ డివైజ్‌లో ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయండి. ఈ పద్ధతి ద్వారా పంపిన మెసేజ్ కండిషన్ అప్‌డేట్ చేయకుండా వాట్సాప్ నిరోధిస్తుంది.
సెట్టింగ్స్> ఎయిర్ ప్లేన్ మోడ్ >టర్న్ ఆన్ఇప్పుడు వాట్సాప్ ఓపెన్ చేసి చాట్ చదవండి. ముఖ్యంగా, మీరు ఎయిర్‌ప్లేన్ మోడ్‌ని ఆఫ్ చేసి, ఆన్‌లైన్‌కి తిరిగి వచ్చిన తర్వాత ఈ ఫీచర్ కొన్నిసార్లు పని చేయకపోవచ్చు, వాట్సాప్ మెసేజ్‌ల రీడ్ స్టేటస్‌ను అప్‌డేట్ చేయవచ్చు.

నోటిఫికేషన్ బార్ ద్వారా చూడొచ్చు :
ఇది చాలా సులభమైనది.చాట్ విండోను ఓపెన్ చేయకుండానే వాట్సాప్ మెసేజ్ చదవచ్చు. నోటిఫికేషన్ విండోను కిందికి స్ర్కోల్ చేయండి. అక్కడ నోటిఫికేషన్ బార్‌లో మెసేజ్ నేరుగా చూడండి. అయితే, మీరు త్వరితగతిన చూడాలి. ఒకసారి రెండు లేదా మూడు మెసేజ్‌లు ఉంటే మాత్రం మీరు ఆయా మెసేజ్‌లను చూడలేరు.

పాప్-అప్ నోటిఫికేషన్‌ను ఆన్ చేయండి :
మీరు మెసేజ్ నోటిఫికేషన్‌ను పాప్-అప్‌గా కనిపిస్తుంది. పాప్-అప్ నోటిఫికేషన్‌ను ఆన్ చేయడానికి >ఓపెన్ వాట్సాప్ > అప్పర్ రైట్ కార్నర్ ట్యాప్ చేయండి >సెట్టింగ్స్> నోటిఫికెషన్స్ > పాప్ అప్ నోటిఫికెషన్స్ > ఆల్వేస్ షో ది పాప్ అప్ ఎంపిక చేయండి.

నోటిఫికేషన్‌ని టాప్ చేసి పట్టుకోండి :
ఐఫోన్ వినియోగదారులు మెసేజ్ ప్రివ్యూని చూడటానికి వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్‌ను Tap చేసి పట్టుకోవచ్చు. హోమ్ స్క్రీన్‌కి వాట్సాప్ యాప్ విడ్జెట్‌ని యాడ్ చేయండి. వాట్సాప్ విడ్జెట్‌లు మీ కాంటాక్టుల ద్వారా నోటిఫికేషన్‌లు, స్వీకరించిన మెసేజ్‌లను కూడా చూడవచ్చు. మీరు యాప్‌ను ఓపెన్ చేయకుండానే విడ్జెట్‌ల నుంచి నేరుగా ఈ మెసేజ్‌లను చదవవచ్చు.

మీ డివైజ్ హోమ్ స్క్రీన్‌పై వాట్సాప్ విడ్జెట్‌ కోసం :
హోమ్ స్క్రీన్‌పై టాప్ చేసి పట్టుకోండి> మీ డివైజ్‌లో విడ్జెట్‌ల లిస్టును స్క్రోల్ చేయండి> వాట్సాప్ విడ్జెట్‌ను యాడ్ చేయండి.

లాస్ట్ మెసేజ్ చదవడానికి చాట్‌పై హోవర్ చేయండి :
ఈ టిప్ వాట్సాప్ వెబ్ యూజర్లకు ఉపయోగపడుతుంది. చివరి మెసేజ్ చూడటానికి కాంటాక్ట్ లిస్ట్‌పై మౌస్‌ని ఉంచండి. పంపినవారు పంపిన చివరి మెసేజ్ మౌస్ కర్సర్ పాయింట్ పెట్టడం ద్వారా చదవగలరు.

థర్డ్ పార్టీ యాప్ ద్వారా కూడా చదవచ్చు :
వాట్సాప్‌లో పంపినవారికి తెలియకుండా వాట్సాప్ మెసేజ్ చదవడంలో మీకు సహాయపడే కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. అయితే, థర్డ్-పార్టీ యాప్‌లు సురక్షితమైనవి లేదా నమ్మదగినవి కావని గమనించాలి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *