కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా ఉదయాన్నే వీటిని తినండి కొవ్వు ఇట్టే కరిగిపోద్ది

 ఆరోగ్యంగా ఉండాలన్నా, అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవాలన్నా మనం తినే ఆహారానిదే కీలక పాత్ర జం్ ఫుడ్స్, బాగా వేయించిన ఫుడ్స్, అధిక కొవ్వు పదార్థాలు ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. వీటిని తినడం వలన ముఖ్యంగా  శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే.. అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అధిక బరువు పెరగడం, ఊబకాయం వంటి సమస్యలు వస్తాయి. అలాగే, స్ట్రోక్ వంటి సమస్యలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే అవకాశం ఉంది. అందుకే తినే ఆహారంపై కొద్దిగా శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నచ్చిన ఫుడ్ అని, ఏది పడితే అది తింటే చివరాఖరకు ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉందని వార్నింగ్ ఇస్తున్నారు. శరీరంలో కొవ్వు  పేరుకుపోతే.. రక్త నాళాల్లో రక్తం సరఫరాలకు అంతరాయం ఏర్పడి.. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు డెసిలీటర్‌కు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పలు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారిపోయి శరీరమంతా రక్తప్రసరణ సక్రమంగా జరగదు.దీని వల్ల పలు వ్యాధులు తలెత్తుతాయి. కొన్నిసార్లు కొలెస్ట్రాల్ పరిధీయ ధమనులలో పేరుకుపోతుంది. ఇది గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అయితే వైద్యుల సలహాలతో పాటు కొన్ని ఇంటి చిట్కాలతో రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం పరగడుపునే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు

ఒక టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, రెండు-నాలుగు బాదం గింజలు, అలాగే 8-10 ఎండుద్రాక్షలను అర గిన్నె ఓట్స్‌తో ప్రతిరోజూ రాత్రి నానబెట్టి, ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో నిల్వ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయులను తగ్గిస్తాయి

బాదంపప్పు

బాదంపప్పులో విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థంగా పనిచేస్తాయి.

మెంతులు

మెంతుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెంతులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతాయి. అలాగే ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు, ఇనుము, కాల్షియం,కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పొద్దు తిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు గింజల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆహారంలో సోయాబీన్స్‌కు బదులుగా సన్‌ఫ్లవర్‌ నూనెను ఉపయోగించడం మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.

అవిసె గింజలు

అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *