ఎస్‌బీఐ కార్డ్ ఉన్నవారికి గుడ్ న్యూస్… పండుగ సీజన్‌లో భారీ ఆఫర్స్!
పండుగ సీజన్‌లో భారీ ఆఫర్స్ అందిస్తోంది ఎస్‌బీఐ. ఫెస్టివల్ సీజన్‌లో షాపింగ్ చేసేవారు ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ ఉపయోగించి ఈ ఆఫర్స్ పొందొచ్చు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌తో పాటు రీటైల్ స్టోర్లలో షాపింగ్ చేసి డిస్కౌంట్స్ పొందొచ్చు. అయితే అంతకన్నా ముందు ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ హోల్డర్స్ ఇ-కామర్స్ లావాదేవీల కోసం తమ కార్డును యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో ఆన్‌లైన్ షాపింగ్ చేయనివారు తప్పనిసరిగా తమ కార్డ్ యాక్టివేట్ చేయాలి. ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో ఏటీఎంలో, పీఓఎస్ మెషీన్స్ అంటే స్వైపింగ్ మెషీన్స్‌లో సాధారణంగా ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు. ఆన్‌లైన్ లావాదేవీల కోసం తమ కార్డుపై ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్స్‌కు అనుమతి ఇస్తూ యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఎస్‌బీఐ కస్టమర్లు ఎస్ఎంఎస్ ద్వారా ఈజీగా ఇ-కామర్స్ యాక్టివేషన్ ప్రాసెస్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.ఉదాహరణకు మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ చివరి నాలుగు అంకెలు 1234 ఉన్నాయనుకుందాం. swon ecom 1234 అని టైప్ చేసి 09223966666 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపిస్తే చాలు. మీ ఎస్‌బీఐ డెబిట్ కార్డుపై ఇ-కామర్స్ లావాదేవీల యాక్టివేషన్ పూర్తవుతుంది. ఇక మీరు ఇ-కామర్స్ ట్రాన్సాక్షన్స్ కోసం మీ ఎస్‌బీఐ కార్డ్ ఉపయోగించుకోవచ్చు.
ఎస్‌బీఐ డెబిట్ కార్డుతో రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో, మొబైల్ యాప్‌లో, స్టోర్స్‌లో లావాదేవీలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. గరిష్టంగా రూ.1,000 వరకు తగ్గింపు పొందొచ్చు. అక్టోబర్ 9 వరకు ఆఫర్ పొందొచ్చు. ఎస్‌బీఐ మాస్టర్‌కార్డ్ డెబిట్ కార్డుతో మేక్ మైట్రిప్ వెబ్‌సైట్, మొబైల్ అప్లికేషన్‌లో లావాదేవీలు చేస్తే 12 శాతం అదనంగా డిస్కౌంట్ పొందొచ్చు. గరిష్టంగా రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. అక్టోబర్ 22 వరకు ఆఫర్స్ పొందొచ్చు.
ఇక పండుగ సీజన్ సందర్భంగా ఎస్‌బీఐ రుణాలు తీసుకునేవారికి ‘ఉత్సవ్ కే రంగ్ ఎస్‌బీఐకే సంగ్’ పేరుతో ఆఫర్స్ ప్రకటించింది బ్యాంకు . జీరో ప్రాసెసింగ్ ఫీజుతో రుణాలను అందిస్తోంది. కార్ లోన్ తీసుకునేవారికి రూ.1 లక్షకు రూ.1,551 ఈఎంఐ, గోల్డ్ లోన్‌పై రూ.1 లక్షకు రూ.3,134 ఈఎంఐ, పర్సనల్ లోన్‌పై రూ.1 లక్షకు రూ.1,868 ఈఎంఐతో రుణాలు అందిస్తోంది.