‘హాయ్‌ మమ్‌’ సైబర్‌ స్కామ్‌… రూ.54 కోట్లు దోచేసిన నేరగాళ్లు… మీరు జాగ్రత్తగా ఉండండిలా

ప్రపంచవ్యాప్తంగా సైబర్ మనీ ఫ్రాడ్స్‌ పెరిగిపోతున్నాయి. సైబర్‌ నేరగాళ్లు (Cyber Frauds) ప్రజలను మభ్యపెట్టి బ్యాంకు అకౌంట్‌లను ఖాళీ చేస్తున్నారు.

రోజు రోజుకూ కొత్త విధానాల్లో సైబర్‌ నేరాలు పుట్టుకొస్తున్నాయి. ఏటీఎం, యూపీఐ, సిమ్‌ స్వాప్‌ (Sim Swap) ఇలా చాలా రకాలుగా మోసాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాలో ఒక కొత్త కేసు నమోదైంది. ఇక్కడ మోసగాళ్ళు బాధితుల కుటుంబ సభ్యులుగా నటిస్తూ, వారి మొబైల్ ఫోన్‌లను పోగొట్టుకున్నారనే నెపంతో డబ్బు పంపమని అడుగుతున్నారు.

కుటుంబ సభ్యుల్లా నటిస్తారు

ఇటీవల బయటపడిన ఈ స్కామ్‌ను హాయ్ మమ్(Hi Mum) లేదా కుటుంబ వంచన (family Impersonation)గా పేర్కొంటున్నారు. సైబర్‌ నేరగాళ్లు WhatsApp టెక్స్ట్‌లో బాధితులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. సన్నిహితులు లేదా కుటుంబ సభ్యులుగా నటిస్తూ చాట్‌ చేస్తున్నారు. ఫోన్‌ పోగొట్టుకున్నామని, లేదా ఫోన్‌ చెడిపోయిందని, అందుకే వేరే నంబర్‌ నుంచి మెసేజ్‌ పంపుతున్నామని చెబుతారు. అవతలి వారు నమ్మినవెంటనే.. సహాయం అవసరమని, డబ్బు పంపమని అడుగుతారు. ఇండిపెండెంట్ నివేదిక ప్రకారం.. ఈ స్కామ్‌కి ఆస్ట్రేలియాలో చాలా మంది బలై పోయారు. దాదాపు 7 మిలియన్‌ల డాలర్లకు పైగా(సుమారు రూ. 57.84 కోట్లు) నష్టపోయారు.

‘హాయ్ మమ్’ స్కామ్ అంటే ఏంటి?

నివేదికల ప్రకారం.. స్కామర్ బాధితులను వాట్సాప్‌లో కాంటాక్ట్‌ అవుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిలా మాట్లాడుతారు. ఫోన్‌ పోయిందని చెప్పి నమ్మితారు. కొత్త నంబర్‌తో కాంటాక్ట్‌ అవుతున్నట్లు చెబుతారు. అవతలివారిలో నమ్మకం కలిగిన తర్వాత అత్యవసరంగా పేమెంట్స్‌ చేయాలని, కొత్త ఫోన్‌ కొనుక్కోవాలని డబ్బు అడుగుతారు. అదే విధంగా కొత్త సోషల్‌ మీడియా అకౌంట్ ఓపెన్‌ చేస్తున్నానని, వివరాలు, ఫొటోలు కావాలని పర్సనల్ డీటైల్స్‌ కూడా కలెక్ట్‌ చేస్తున్నారు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ ప్రస్తుతానికి పని చేయడం లేదని, ఫోన్‌కు ఓటీపీలు రావడం లేదని, అత్యవసరంగా డబ్బులు కావాలని కోరుతారు.

రూ.57.84 కోట్లు దోచేశారు

ఆస్ట్రేలియన్ కన్స్యూమర్ అండ్ కాంపిటీషన్ కమిషన్ (ACCC) ‘హాయ్ మమ్’ స్కామ్‌లలో గణనీయమైన పెరుగుదలను గుర్తించిందని, 1,150 మందికి పైగా స్కామ్‌కు గురయ్యారని నివేదిక పేర్కొంది. ప్రజలు గత కొన్ని నెలల్లోనే 2.6 మిలియన్లు అంటే దాదాపు రూ. 21 కోట్లు నష్టపోయారు. 2022లోనే కనీసం 11,100 మంది బాధితుల నుంచి 7.2 మిలియన్ డాలర్లు (రూ.57.84 కోట్లు) దోచుకున్నారు. ఈ మోసాల బారిన పడినవారిలో ఎక్కువగా 55 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న స్త్రీలు ఉన్నారు. హాయ్ మమ్ స్కామ్‌లు గణనీయంగా పెరిగాయని, కుటుంబ సభ్యులు లేదా స్నేహితుడి పేరిట సహాయం అవసరమని వచ్చే మెసేజ్‌ల పట్ల ఆస్ట్రేలియన్లు జాగ్రత్తగా ఉండాలని ACCC కోరింది. ఆస్ట్రేలియన్లను అప్రమత్తం చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది.

ఇండియాలోనూ సైబర్‌ నేరాలు

ఈ కేసు ఆస్ట్రేలియాలో బయటపడినా.. భారతీయులకూ సైబర్‌ నేరాల ముప్పు ఎక్కువగా ఉంది. కొన్నేళ్లుగా భారత్‌లో కూడా సైబర్ మోసాలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇటీవల ఢిల్లీకి చెందిన ఒక వ్యాపారవేత్తను మోసగించి, అతని అనేక బ్యాంకు అకౌంట్‌ల నుంచి సుమారు రూ.50 లక్షలు దోచేశారు. SIM మార్పిడి, QR కోడ్ స్కామ్‌లు, ఫిషింగ్ లింక్‌ల కేసులు వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఈ సైబర్ మోసాల నుంచి దూరంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి.

నోకియా కొత్త ఫోన్”>

సైబర్ నేరాల నుంచి రక్షణ పొందడం ఎలా?

ఫోన్‌ కాల్స్‌లో OTPని ఎవరితోనూ పంచుకోవద్దు. డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ పిన్, CVV నంబర్‌ను ఎవరికీ షేర్‌ చేయకూడదు. తెలియని మెయిల్స్‌, నంబర్‌ల నుంచి వచ్చిన లింక్‌లను ఎప్పుడూ క్లిక్‌ చేయయూడదు. ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మాత్రమే బ్రైజ్‌ చేయాలి. అనుమానాస్పద లాగిన్‌లు, సందేశాల గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఆన్‌లైన్ షాపింగ్ సమయంలో పేమెంట్‌ డీటైల్స్‌ను వెబ్‌సైట్‌లలో ఎప్పుడూ సేవ్ చేయకూడదు. బ్యాంక్‌ నుంచి కాల్‌ చేస్తున్నట్లు ఎవరు చెప్పినా నమ్మకూడదు. ఎలాంటి బ్యాంక్‌, యూపీఐ, వ్యక్తిగత వివరాలు తెలియజేయకూడదు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *