మొబైల్ నంబర్ లేకుండానే వాట్సాప్ వాడొచ్చు, జస్ట్ ఈ ట్రిక్ ఉపయోగిస్తే చాలు?

మెటా యాజమాన్యంలోని ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ ద్వారా అన్ని పనులను చక్కదిద్దుకుంటున్నారు.

అయితే, వాట్సాప్ కు సంబంధించిన ఓ ట్రిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వాట్సాప్ వాడాలంటే మనకు కచ్చితంగా ఫోన్ నంబర్ అవసరం ఉంటుంది. వాట్సాప్ ఇన్ స్టాల్ చేసే సమయంలో కచ్చితంగా ఫోన్ నెంబర్ ద్వారానే చేసుకోవాలి. ఆ తర్వాత చాటింగులు, షేరింగ్ కు మోబైల్ నెంబర్ అవసరం లేదు. అయితే, మోబైల్ నెంబర్ లేకపోయినా వాట్సాప్ రన్ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ విధానాన్ని వాట్సాప్ అంగీకరించకపోయినా, థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. నిజానికి కొంత మంది వినియోగదారులకు తమ వివరాలు వాట్సాప్ మేనేజ్ మెంట్ కి తెలియడం ఇష్టం ఉండదు. తాము చేసే చాటింగ్ వివరాలను మోబైల్ నెంబర్ ద్వారా వాట్సాప్ యాజమాన్యం తెలుసుకోవడం నచ్చదు. అలాంటి వారి కోసమే ఓ థర్డ్ పార్టీ యాప్ తయారైంది. ఇంతకీ దాన్ని ఎలా వాడాలో చూద్దాం..

స్పూప్ టెక్ట్స్ మెసేజ్ యాప్ తో వాట్సాప్ వాడొచ్చు!

1. ముందుగా ఫోన్ లో వాట్సాప్ ఉంటే డిలీట్ చేయాలి. మళ్లీ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ని డౌన్లోడ్ చేయాలి.

2. స్పూప్ టెక్ట్స్ మెసేజ్ యాప్ని కూడా ప్లే స్టోర్ నుంచీ డౌన్లోడ్ చేసి, ఇన్స్టాల్ చేయాలి.

3. ఇప్పుడు వాట్సాప్ ఇన్ స్టాల్ చేయాలి. ఈ సమయంలో వాట్సాప్ మిమ్మల్ని ఇంటర్నెట్ ద్వారా వెరిఫై చేయదు. ఎస్సెమ్మెస్ అప్షన్ ను ఎంచుకోవాలని చెప్తుంది.

4. అప్పుడు మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చెయ్యండి. వెంటనే క్యాన్సిల్ క్లిక్ చేయండి. ఆథరైజేషన్ విధానం ఆగిపోతుంది.

5. ఇప్పుడు స్పూప్ టెక్ట్స్ మెసేజ్ యాప్ ఓపెన్ చేసి ఈ వివరాలను ఎంటర్ చేయాలి. (టూ : +447900347295, ఫ్రొం: +(కంట్రీ కోడ్) (మొబైల్ నెంబర్), (మెసేజ్: యువర్ ఇమెయిల్ అడ్రస్)

6. మీకు బదులుగా స్పూప్ టెక్ట్స్ మెసేజ్ యాప్ వాట్సాప్ ని వెరిఫై చేస్తుంది. ఆ తర్వాత మీరు వాట్సాప్ని వాడుకోవచ్చు. మీరు ఏ మొబైల్ నంబర్ నుంచి వాట్సాప్ వాడుతున్నారో ఎవరికీ తెలియదు.

ల్యాండ్ లైన్ నంబర్ తోనూ వాట్సాప్ వినియోగించుకోవచ్చు!

1. మీ దగ్గర ఓ ల్యాండ్ లైన్ ఉండాలి. అది అందుబాటులో ఉండేలా చూసుకోవాలి.

2. గూగుల్ ప్లేస్టోర్ నుంచి వాట్సాప్ బిజినెస్ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలి.

3. వాట్సాప్ ఇన్ స్టాల్ అయ్యాక ఓటీపీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలవుతుంది.
4. మీరు దేశం ఇండియాను సెలెక్ట్ చేసుకోవాలి. భారత కోడ్ +91 కనిపిస్తుంది. ఇప్పుడు ఎస్టీడీ కోడ్, తర్వాత మీ ల్యాండ్ లైన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. కానీ, మీ ఎస్టీడీ కోడ్ ముందు 0ను తీసివేయాలి.

5. మీరు నంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాట్సాప్ బిజినెస్ మీ నంబర్ కు ఒక ఓటీపీ పంపుతుంది. కానీ, మీరు ఇచ్చింది ల్యాండ్ లైన్ నంబర్. ఓటీపీ రాదు. ఓటీపీకి ఇచ్చిన టైమ్ అయిపోగానే ఓటీపీ కోసం కాల్ మీ ఆప్షన్ ఎంచుకోవాలి.

6. మీ ల్యాండ్ లైన్ నంబర్ కు కాల్ వస్తుంది. ఓటీపీని ఆ కాల్ ద్వారా చెప్తారు. ఓటీపీని ఎంటర్ చేయాలి. ప్రక్రియ మొత్తం పూర్తయ్యాక మీరు మీ ల్యాండ్ లైన్ నంబర్ తో వాట్సాప్ వాడుకోవచ్చు.

 

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *