మీ ఆధార్ కార్డ్ పర్సులో లేదా? ఎక్కడైనా పాన్ కార్డ్ అవసరం ఉందా? డ్రైవింగ్ లైసెన్స్ ఇంట్లో మర్చిపోయారా?
ఇలాంటి డాక్యుమెంట్స్ అవసరమైతే ఎలా డౌన్‌లోడ్ చేయాలని కంగారుపడాల్సిన అసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఉంటే చాలు. అప్పటికప్పుడు వాట్సప్‌లో పాన్ కార్డ్ , ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి డాక్యుమెంట్స్ సింపుల్‌గా డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ డాక్యుమెంట్స్ డిజీలాకర్ యాప్‌లో లేదా పోర్టల్‌లో మీరు సేవ్ చేసుకొని ఉంటే వాటిని వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేయొచ్చు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన అఫీషియల్ యాప్ అయిన డిజీలాకర్‌లో అన్ని రకాల ముఖ్యమైన డాక్యుమెంట్స్ సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫిజికల్ డాక్యుమెంట్ మర్చిపోయినా డిజీలాకర్ నుంచి అప్పటికప్పుడు సాఫ్ట్ కాపీ డౌన్‌లోడ్ చేసి అవసరమైన చోట సబ్మిట్ చేయొచ్చు. ఐడీ కార్డుల నుంచి సర్టిఫికెట్ల వరకు అన్ని రకాల ప్రభుత్వ డాక్యుమెంట్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఎక్కడైనా ఇవి చెల్లుబాటు అవుతాయి. ఇటీవల డిజీలాకర్ సేవలు వాట్సప్‌లో కూడా ప్రారంభం అయ్యాయి. డిజీలాకర్‌లోని డాక్యుమెంట్స్‌ని వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మై గౌ హెల్పడెస్క్ చాట్ బాట్ ద్వారా ఈ ప్రాసెస్ చాలా ఈజీ. మరి మీ డాక్యుమెంట్స్ వాట్సప్‌లో ఎలా డౌన్‌లోడ్ చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకోండి
Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మై గౌ హెల్ప్‌డెస్క్ నెంబర్ +91 9013151515 సేవ్ చేయండి.
Step 2- వాట్సప్ ఓపెన్ చేసి మై గౌ హెల్ప్‌డెస్క్నెంబర్ సెర్చ్ చేయండి.
Step 3- ఛాట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత హాయ్ లేదా నమస్తే అని మెసేజ్ పంపండి.
Step 4- ఆ తర్వాత డిజీలాకర్ సర్వీసెస్, కోవిన్ ఆన్ వాట్సప్ అని రెండు ఆప్షన్స్ వస్తాయి.
Step 5- డిజీలాకర్ అకౌంట్ పైన క్లిక్ చేయాలి.
Step 6- మీ డిజీలాకర్ అకౌంట్‌కు లింక్ అయిన 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.
Step 7- మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి.
Step 8- మీ ఛాట్‌బాట్‌లో డిజీలాకర్‌లో సేవ్ అయి ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కనిపిస్తాయి.
Step 9- ఇందులో మీకు కావాల్సిన డాక్యుమెంట్ లేదా ఐడీ కార్డ్ డౌన్‌లోడ్ చేయొచ్చు.
మొబైల్స్ ఇవే
డౌన్‌లోడ్ చేసిన ఫైల్ పీడీఎఫ్ రూపంలో మీ స్మార్ట్‌ఫోన్‌లో సేవ్ అవుతుంది. ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలంటే మీకు డిజీలాకర్ అకౌంట్ ఉండాలి. మీ డిజీలాకర్ అకౌంట్‌లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ సేవ్ చేసి ఉండాలి. అప్పుడే వాట్సప్‌లో మీ డాక్యుమెంట్స్ డౌన్‌లోడ్ చేయడం సాధ్యమవుతుంది. డిజీలాకర్ అకౌంట్ లేకపోతే డిజీలాకర్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయొచ్చు