ఫేషియల్ రికగ్నిషన్, స్మార్ట్ గ్లాసెస్ వాడకాన్ని నిషేధించిన ఇటలీ.. కారణమదే..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఒకరి ఫేస్ ద్వారా వారి ఐడెంటిటీని క్షణాల్లో గుర్తించే ఈ టెక్నాలజీని ఇండియాలో కూడా తీసుకొస్తున్నారు.

అయితే తాజాగా ఇటలీ మాత్రం ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌ని బ్యాన్ చేసింది. అంతేకాదు, ‘స్మార్ట్ గ్లాసెస్ ‘ ఉపయోగించడాన్ని కూడా నిషేధించింది. ఆ దేశం ప్రైవసీ వాచ్‌డాగ్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ‘ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్‌’, ‘స్మార్ట్ గ్లాసెస్’తో ప్రయోగాలు చేసినందుకు రెండు మునిసిపాలిటీలకు చురకలంటించింది. ఒక నిర్దిష్ట చట్టాన్ని ఆమోదించే వరకు ఈ టెక్నాలజీల వినియోగాన్ని ఆపేయాలని ఆదేశించింది.

అయితే, ఈ టెక్నాలజీలపై విధించిన నిషేధానికి ఒక మినహాయింపు ఉంది. న్యాయ విచారణలు లేదా నేరాలను పరిష్కరించే విషయాల్లో ఈ బయోమెట్రిక్ డేటా ఆధారిత సిస్టమ్స్ వాడవచ్చు. “అర్హత అవసరాలు, షరతులు, ఫేషియల్ రికగ్నిషన్‌కు సంబంధించిన హామీలను, ప్రొఫెషనలిటీ(లా) సూత్రానికి అనుగుణంగా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ తాత్కాలిక నిషేధం

విధిస్తున్నాం.” అని డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ ఒక స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. బయోమెట్రిక్ డేటాను ఉపయోగించే ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌లు నిర్దిష్ట చట్టాన్ని ఆమోదించే వరకు లేదా కనీసం వచ్చే ఏడాది చివరి వరకు వినియోగించడానికి వీల్లేదని ప్రైవసీ వాచ్‌డాగ్ తెలిపింది.

ఈ సిస్టమ్‌ల భద్రతపై ఆందోళనలను వ్యక్తం చేస్తూ యూరోపియన్ యూనియన్, ఇటాలియన్ చట్టం ప్రకారం, వీడియో డివైజ్‌లు ఉపయోగించి పబ్లిక్ సంస్థలు వ్యక్తిగత డేటాను ప్రాసెస్ చేయడమనేది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఏజెన్సీ పేర్కొంది. ప్రభుత్వ అధికారుల

కార్యకలాపాలతో ముడిపడి ఉన్నప్పుడు వాటిని ఉపయోగించాలనుకునే మునిసిపాలిటీలు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో పట్టణ భద్రతా ఒప్పందాలను కుదుర్చుకోవాలని వెల్లడించింది.

దక్షిణ ఇటాలియన్ నగరమైన లెక్సే , టస్కాన్ నగరమైన అరెజ్జో మునిసిపాలిటీలు ఈ సిస్టమ్స్ వినియోగించాలని ప్లాన్ చేయగా ఇటలీ వీటిని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అధికారుల ప్రకారం, Lecce మునిసిపాలిటీ ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని వినియోగించడానికి సిద్ధమైంది. మరోవైపు టస్కాన్ లోకల్ పోలీసులకు కారు నంబర్ ప్లేట్‌లను గుర్తించగల ఇన్‌ఫ్రారెడ్ సూపర్ గ్లాసెస్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయంలో జోక్యం చేసుకున్న వాచ్‌డాగ్.. లెక్సే మునిసిపాలిటీ అడాప్ట్ చేసుకున్న సిస్టమ్స్ గురించి వివరణ, వాటి ప్రయోజనం, చట్టపరమైన ఆధారం, దాని మానిటరింగ్ డివైజ్‌ల ద్వారా యాక్సెస్ చేసిన డేటాబేస్‌ల లిస్ట్‌ను అందించాలని ఆదేశించింది.

అడ్వర్టైజింగ్ యాప్‌లు: ప్లే స్టోర్‌లో అడ్వర్టైజింగ్ యాప్స్.. టెస్ట్ చేస్తున్న గూగుల్ .. వివరాలు ఇవే..

లాక్ స్క్రీన్: ఆండ్రాయిడ్ ఫోన్ లాక్ స్క్రీన్‌.. ఎంత సింపుల్ గా తీశాడో చూడండి.. ఫోన్ కు సెక్యూరిటీ ఎలా మరి..?

ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌లు యూజర్ల ఐడెంటిటీని నిర్ధారించడంలో సహాయపడతాయి. స్మార్ట్ గ్లాసెస్ దృష్టిలోపం ఉన్న వ్యక్తులకు హెల్ప్ చేస్తాయి. ఈ గ్లాసెస్‌లోని AI డివైజ్‌ల ఫొటోల నుంచి వివిధ రకాల సమాచారాన్ని సేకరించి, ఆపై యూజర్లతో తిరిగి మాట్లాడగలవు. ఆ విధంగా దృష్టిలోపం ఉన్నా కూడా స్మార్ట్ గ్లాసెస్‌తో కంప్యూటర్ స్క్రీన్‌లు, పోస్టర్లు, బార్‌కోడ్‌లు, టైమ్‌టేబుల్స్‌, ఫుడ్ ప్యాకేజింగ్, బార్‌కోడ్‌లతో సహా మరిన్ని వివరాలు వినొచ్చు. వాటిని ట్రాన్స్‌లేట్‌ కూడా చేసుకుని వినొచ్చు

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *