బ్లూటూత్ ఆన్ చేస్తే హ్యాకింగ్ రిస్క్… ఇలా చేయడం మర్చిపోవద్దు

ఒకప్పుడు బ్లూటూత్ వినియోగం పెద్దగా ఉండేది కాదు.

కానీ బ్లూటూత్ డివైజ్‌లు వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ ఎప్పటికీ ఆన్‌లోనే ఉంటుంది. బ్లూటూత్ స్పీకర్స్ , బ్లూటూత్ హెడ్‌సెట్, ఇయర్‌బడ్స్… ఇలా బ్లూటూత్‌తో కనెక్ట్ అయ్యే ఆడియో ప్రొడక్ట్స్  డివైజ్‌లు చాలా ఉన్నాయి

 రెండుమూడు ఆడియో ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇలాంటివి ఉపయోగిస్తారు కాబట్టి ప్రతీసారి బ్లూటూత్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఎందుకని ఎప్పటికీ బ్లూటూత్ మోడ్ ఆన్‌లో పెట్టడం స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలవాటైపోయింది. ఈ అలవాటే కొంపముంచుతోందని తాజాగా బయటపడింది.

బ్లూటూత్ ఆన్‌లో ఉంటే అది డిస్కవరీ మోడ్‌లో ఉన్నట్టే. అంటే బ్లూటూత్ ఆన్‌లో ఉంది కాబట్టి దగ్గర్లో బ్లూటూత్ డివైజ్ ఏదైనా ఉందా అని నిరంతరం సెర్చ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా ఖాళీ కావడం మాత్రమే కాదు, యూజర్లకు హ్యాకింగ్ రిస్క్ కూడా ఎదురవుతోంది. ఇలా బ్లూటూత్ డిస్కవరీ మోడ్‌లో ఉన్నప్పుడు, మీ డివైజ్‌కు పది మీటర్ల పరిధిలో ఉన్న హ్యాకర్లు, స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి

స్మార్ట్‌ఫోన్లు లేదా బ్లూటూత్‌తో పనిచేసే డివైజ్‌లలో ఉండే బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ ఉపయోగించి, హ్యాకర్లు ముఖ్యమైన డేటాను దొంగిలించడాన్నే ‘బ్లూబగ్గింగ్’ అంటారు. ఒక్కసారి మీ డివైజ్‌కు హ్యాకర్లు కనెక్ట్ అయ్యారంటే వాళ్లు ఫోన్ కాల్స్ వినొచ్చు. మెసేజెస్ చదవొచ్చు. ఓటీపీ లాంటి సున్నితమైన డేటాను కూడా యాక్సెస్ చేయొచ్చు. ఈ మొత్తం ప్రక్రియను ‘బ్లూబగ్గింగ్’ అని పిలుస్తారు.

హ్యాకర్లు ఒక్కసారి బ్లూటూత్ ఆప్షన్‌తో మీ డివైజ్‌ను కనెక్ట్ అయ్యారంటే చాలు. బ్లూటూత్ నుంచే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తారు. మీ మొబైల్‌లోని ముఖ్యమైన డేటాను కాజేస్తారు. ఎయిర్‌పాడ్స్, బ్లూటూత్ స్పీకర్స్, టీడబ్ల్యూఎస్ డివైజ్‌లు ఉయోగించే యూజర్లు ఎప్పుడూ బ్లూటూత్ మోడ్‌ను ఆన్‌లో ఉంచితే రిస్కులో పడ్డట్టే కాబట్టి అవసరం ఉన్నప్పుడే బ్లూటూత్ మోడ్ ఆన్ చేసి, ఆ తర్వాత ఆఫ్ చేయాలి. పబ్లిక్ ప్లేసెస్‌లో ఉన్నప్పుడు బ్లూటూత్ ఉపయోగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ బ్లూటూత్ ఉపయోగిస్తున్నా, మీ మొబైల్‌కు ఇతర డివైజ్‌లు ఏవైనా కనెక్ట్ అయ్యాయేమోనని గమనించాలి

మీ మొబైల్‌కు కనెక్ట్ అయ్యేందుకు ఏ డివైజ్ నుంచైనా రిక్వెస్ట్ వస్తే రిజెక్ట్ చేయాలి. అలాంటి సందర్భాల్లో బ్లూటూత్ మోడ్ పూర్తిగా ఆపెయ్యాలి. పెయిర్డ్ డివైజ్‌లు ఉంటే డిస్‌కనెక్ట్ చేయాలి. మంచి వీపీఎన్ సర్వీస్ ఉపయోగించాలి. పబ్లిక్ వైఫై అస్సలు ఉపయోగించకూడదు

ట్రూ వైర్‌లెస్ స్టీరియో) హెడ్‌ఫోన్‌లు లేదా ఇతర పరికరాలకు కనెక్ట్ చేసే యాప్‌లను ఉపయోగించే వినియోగదారులు సంభాషణలను రికార్డ్ చేయవచ్చు. హ్యాక్ చేసిన తర్వాత, దాడి చేసే వ్యక్తి మీ పరిచయాలకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు. వాటిని మార్చవచ్చు లేదా వాటిని తీసుకోవచ్చు, చాట్‌లను నిర్వహించవచ్చు. రికార్డ్ చేయవచ్చు, సందేశాలను చదవవచ్చు. పంపవచ్చు. మరిన్ని చేయవచ్చు.

‘బ్లూబగ్గింగ్’ అని పిలువబడే దాడులు బ్లూటూత్-సామర్థ్యం గల హార్డ్‌వేర్‌ను ఉపయోగించుకుంటాయి.

పరికరం యొక్క బ్లూటూత్ తప్పనిసరిగా కనుగొనగలిగేలా కాన్ఫిగర్ చేయబడాలి, ఇది సాధారణంగా డిఫాల్ట్ సెట్టింగ్. హ్యాకర్ బ్లూటూత్ ద్వారా పరికరంతో జత చేయడానికి ప్రయత్నిస్తాడు. కనెక్షన్ స్థాపించబడిన తర్వాత, ప్రామాణీకరణను దాటవేయడానికి హ్యాకర్లు బ్రూట్ ఫోర్స్ దాడులను ఉపయోగించవచ్చు. అనధికారిక యాక్సెస్‌ను పొందేందుకు మాల్వేర్‌ను కూడా ఇన్‌స్టాల్ చేయవచ్చు. బ్లూటూత్-ప్రారంభించబడిన పరికరం హ్యాకర్ యొక్క 10-మీటర్ల పరిధిలో ఉన్నప్పుడు, అది అమలు చేయబడుతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *