రూపాయి ఖర్చు లేకుండా సీసీ కెమెరా.. మీ పాత ఫోన్లో ఈ యాప్ వేసుకుంటే చాలు.. ఓ లుక్కేయండి

మార్కెట్లోని నిత్యం కొత్త కొత్త అప్డేట్స్ కలిగిన స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి.

దీంతో అనేక మంది తరచుగా ఫోన్లను మారుస్తూ ఉంటారు. ఆ సమయంలో పాత ఫోన్ ను పక్కకు పడే స్తూ ఉంటారు. అయితే.. పాత ఫోన్లు కూడా పనికి వస్తాయన్న విషయాన్ని గుర్తించుకోవాలి. జాగ్రత్తగావాడితే వాటిని ఇతర అవసరాలకు సైతం వాడుకోవచ్చు.

ప్రస్తుతం చిన్న, పెద్ద నగరాలు, గ్రామాల్లో దొంగతనాలు, నేరాలు అధికమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తమ ఇళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. తద్వారా ఇంటి బయట ఉంటూ ఇంటిని పర్యవేక్షించవచ్చన్నది ఆలోచన. అయితే, సీసీటీవీ ఏర్పాటుకు అయ్యే ఖర్చు రూ.5,000 నుంచి రూ.20,000 వరకు ఉంటుండడంతో వాటిని కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు

అటువంటి పరిస్థితిలో, మీరు ఇంట్లో ఉంచిన పాత ఫోన్‌ను సిసిటివిగా మార్చి ఉపయోగించుకోవచ్చు. మీ పాత ఫోన్ ను సీసీటీవీగా ఎలా మార్చుకోవచ్చో ఓ లక్కేద్దాం.

ఇపుడు చిన్న పెద్ద తరహా వ్యాపారస్తులకు, ఆఫీసులకు సీసీటీవీ అనేది అవసరం అవుతుంది.లొకేషన్ ఏదైనప్పటికీ, జాగ్రత్తలు తీసుకోవడం ఇపుడు పరిపాటిగా మారింది.

రూపాయి ఖర్చు లేకుండా సీసీటీవీ ఇఅయితే వీటికోసం పెద్దమొత్తంలో ఖర్చు చేయాలని కొంతమంది వీటిని ఏర్పాటు చేయకుండా కోరి కష్టాలు కొని తెచ్చుకుంటూ వుంటారు.తరువాత లబోదిబోమని అప్పులు చేసి మరీ మార్కెట్లో ఎక్కువ రేట్లు పోసి కొంటూ వుంటారు.

అయితే పైసా ఖర్చు లేకుండానేసీసీటీవీని ఏర్పాటు చేసుకోవచ్చని కొంతమంది నిపుణులు అంటున్నారు.ఆ విషయాలు ఇపుడు ఒక్కసారి చూద్దాం
దీనికి ఒక పాత ఫోన్, మరియు ఒక యాప్ ఉంటే సరిపోతుంది.ఇపుడు అది ఎలాగ చెయ్యాలో చూద్దాం.
1.ముందుగా మీ పాత ఫోనులో సెక్యూరిటీ కెమెరా యాప్ ని ఎంచుకోవాలి.ఇలాంటివి చాలా యాప్స్

2.సెటప్ చేసిన తర్వాత, మీ ఇంటిలో లేదా ఎక్కడి నుండైనా ఈ సెక్యూరిటీ కెమెరాను నియంత్రించవచ్చు.మీరు దీన్ని మీరు వాడుతున్న ఫోన్ ద్వారా చేయవచ్చు.మీ ఫోన్‌ను సెక్యూరిటీ కెమెరా చేసుకోవడానికి ఆల్ఫ్రెడ్ యాప్ వాడటం మంచిది.

మీ పాత ఫోన్, మీ ప్రస్తుత ఫోన్ రెండింటిలోనూ ఆల్ఫ్రెడ్ సీసీటీవీ కెమెరా యాప్‌ను  డౌన్‌లోడ్ చేసుకోవాలి. పాత స్మార్ట్‌ఫోన్‌ను సీసీటీవీగా మార్చేందుకు ఈ యాప్ ఉపయోగించబడుతుంది.

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను సీసీటీవీలా మరియు ఇప్పటికే ఉన్న ఫోన్‌ను మానిటర్‌గా ఉపయోగించుకోవచ్చు.

దీని తర్వాత మీరు ఫోన్‌ను సీసీటీవీగా ఉపయోగించాలనుకుంటున్న చోట పాత ఫోన్‌ను అమర్చాలి. ఈ ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది.

ఈ పాత ఫోన్ యొక్క బ్యాటరీ అయిపోకుండా ఉండాలంటే, మీరు దీనికి విద్యుత్ సరఫరాను కూడా ఇవ్వాల్సి ఉంటుంది లేదంటే పవర్ బ్యాంక్‌ను కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు, కెమెరాపై దుమ్ము మరియు ధూళి పడకూడదని కూడా గుర్తుంచుకోవాలి. అప్పుడు నీ పని అయిపోతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *