మార్కెట్లోకి అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు.. రేపే విడుదల

భారతదేశపు ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్ రేపు (సెప్టెంబర్ 8, 2022వ తేదీన) తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ ని విడుదల చేయనుంది. ఈ కారుకి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

స్వదేశంలో తయారైన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు బుధవారం మార్కెట్లోకి విడుదల కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ ఈఏఎస్ – ఈ కారు ధర 4 నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

టాటా మోటార్స్ నుండి రాబోయే కొత్త టియాగో ఈవీ దేశంలోనే అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ కారుగా రికార్డు సృష్టించనుంది. మార్కెట్లో ఇది టాటా నుండి లభ్యం కానున్న మూడవ ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారు అవుతుంది. కంపెనీ ఇప్పటికే, నెక్సాన్ ఈవీ మరియు టిగోర్ ఈవీలను విక్రయిస్తోన్న సంగతి తెలిసినదే. తాజాగా, టాటా మోటార్స్ తమ టియాగో ఈవీ లాంచ్‌కి సంబంధించి ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో టియాగో ఈవీ ఎక్స్టీరియర్ వివరాలను కంపెనీ వెల్లడి చేసింది

కంపెనీ విడుదల చేసిన టీజర్ వీడియోలో వెల్లడించిన వివరాల ప్రకారం, టాటా టియాగో ఈవీ గ్రిల్‌కు ఇరువైపులా ట్రై-యారో ప్యాటర్న్ లతో కూడిన గ్రిల్ ఉంటుంది. కాకపోతే, ఈ గ్రిల్ ట్రెడిషన్ ఓపెన్ హోల్ గ్రిల్ మాదిరిగా కాకుండా పూర్తిగా సీల్ చేయబడిన గ్లోస్-బ్లాక్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా, ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను దాని సాధారణ మోడల్‌ నుండి వేరు చేయడానికి వీలుగా ఈ ఫ్రంట్ గ్రిల్‌కు కుడి వైపున ‘EV’ బ్యాడ్జ్ కూడా ప్రత్యేకంగా కనిపిస్తుంది.

స్వదేశంలో తయారైన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు బుధవారం మార్కెట్లోకి విడుదల కానుంది. పీఎంవీ ఎలక్ట్రిక్ సంస్థకు చెందిన మైక్రో ఎలక్ట్రిక్ వెహికిల్ ఈఏఎస్ – ఈ కారు ధర 4 నుంచి 5 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది.

ముంబైకి చెందిన ఈ కంపెనీ కారును మూడు వేరియంట్లలో అందుబాటులోకి తేనుంది. మొత్తం 13 రంగుల్లో ఈ కారు లభ్యం కానుంది. కంపెనీ తెలిపిన సమాచారం మేరకు ఒక్క సారి ఛార్జ్ చేస్తే 120 నుంచి 200 కిలోమీటర్ల వరకు పయనిస్తుంది. 3కేడబ్ల్యూ ఎసీ ఛార్జర్‌ని ఆఫర్ చేస్తుండగా, బ్యాటరీ మొత్తం ఛార్జ్ కావడానికి నాలుగు గంటల సమయం పట్టనుంది. ఇక కారు ప్రత్యేకతలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. ఇందులో డిజిటల్ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, క్రూజ్ కంట్రోల్, సీటు బెల్టులు, ఏసీ, రిమోట్ కీ లెస్ ఎంట్రీ, రిమోట్ పార్క్ అసిస్ట్ వంటివి ఉన్నాయి. పొడవు 2,915 ఎంఎం, వెడల్పు 1,157 ఎంఎం, ఎత్తు 1600 ఎంఎంగా ఉంది. బరువు 550 కేజీలు, వీల్ బేస్ 2,087 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎంగా ఉంది. కాగా, ఈ కారును గతంలో టాటా కంపెనీ తెచ్చిన నానోతో పోలుస్తున్నారు. ఎలక్ట్రిక్ విభాగంలో మధ్య తరగతి వారికి నచ్చే, మెచ్చే మోడల్ అవుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *