మానువుని తప్పిదాల వల్ల నది జలాలు, సముద్రాలు ప్లాస్టిక్ చెత్తతో నిండిపోతున్నాయి. వీటి కారణంగా జలచర జీవుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఏటా నదులు, సముద్రాల ఒడ్డున లక్షలాది చేపలు వంటి పలు జలచర జీవులు ఈ ప్లాస్టిక్ కారణంగా చనిపోతున్నాయి.
ప్లాస్టిక్ సంచులని సరిగా పారవేయకపోతే, డ్రైనేజి సిస్టమ్ లోకి వెళ్ళి వాటిని మూసి వేయడం వలన అశుభ్రమైన వాతావారణాన్ని కలుగచేసి, నీటి ద్వారా వచ్చే వ్యాధులను కలుగచేస్తాయి. పునర్వినియోగం /రంగుల ప్లాస్టిక్ సంచులు, భూమిలోనికి శ్రవించి మట్టిని,, ఉప మట్టి నీటిని కలుషితం చేసే కొన్ని రసాయనాలని కలిగి ఉండవచ్చు. పునర్వినియోగం చేయడానికి ఉపయోగించే యూనిట్లు పర్యావరణపరంగా పటిష్ఠమైనవి కాకపోతే, పునర్వినియోగం సమయంలో ఉత్పత్తి అయ్యే విషపూరిత ఆవిరి వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయి. మిగిలిపోయిన ఆహారం కలిగిఉన్న లేదా ఇతర వ్యర్ధ పదార్ధాలతో కలిసిపోయి ఉన్న కొన్ని ప్లాస్టిక్ సంచులను జంతువులు తినడం వలన హానికరమైన ప్రభావాలు కలుగుతాయి. పాడవ్వని, చొచ్చుకు పోనీయని స్వభావంకల ప్లాస్టిక్ కారణంగా, మట్టిలో పారవేస్తే, భూగర్భ జల ఏక్విఫెర్లు నింపకుండా అడ్డుకోవచ్చు. అంతే కాకుండా, ప్లాస్టిక్ ఉత్పాదనల లక్షణాలని మెరుగు పరచడానికి, పాడయ్యే ప్రతి చర్యని నిరోధించడానికి సాధారణంగా ఎడిటివ్లను, ప్లాస్టిసైజర్లను, ఫిల్లర్లను, ఆజ్ఞిమాపకాలని, పిగ్ మెంట్లని ఉపయోగిస్తారు. ఇవి ఆరోగ్యం మీద ప్రభావాన్ని కలిగి ఉంటాయి.
ఇప్పుడూ ఆ ప్లాస్టిక్‌ని నీటి నుంచి సులభంగా వేరుచేసి ఫిల్టర్ చేసే రోబో చేప మన ముందుకు రానుంది. ఈ రోబో భవిష్యత్తు తరాలను నీటి కాలుష్యం నుంచి బయటపడేలా చేస్తోందంటున్నారు పరిశోధకులు.
వివరాల్లోకెళ్తే…తాగు నీటిలో, నదుల్లో ఉండే ఐదు మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉండే మైక్రో ప్లాస్టిక్‌ని ఏరేసి ఫిల్టర్ చేసే ఒక సరికొత్త త్రీడీ గిల్బర్ట్ రోబో చేపను రూపొందంచాడు సర్రే విశ్వవిద్యాలయ విద్యార్థి. ఈ రోబో చేప ఇంగ్లాండ్‌లోని సర్రే విశ్వవిద్యాలయం నిర్వహించిన నేచురల్ రోబోటిక్స్ కాంటెస్ట్‌ని గెలుచుకుంది. ఈ రోబోని కెమిస్ట్రీ గ్యాడ్యుయేట్ ఎలియనోర్ మాకింతోష్ అనే విద్యార్థి రూపొందించాడు. జలాల్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్‌ని తొలగించేడానికి ఈ రోబో ఉత్తమమైన పరిష్కార మార్గంగా భావిస్తున్నారు పరిశోధకులు.
ఈ మేరకు సర్రే విశ్వవిద్యాలయంలోని లెక్చరర్ డాక్టర్ రాబర్ట్ సిడాల్ మాట్లాడుతూ..నదులు, సముద్రాల్లోకి విసురుతున్న ప్లాస్టిక్ ఎక్కడకి వెళ్తుందో తెలియదు. గానీ ఈ రోబో చేప భవిష్యత్తు తరాలను ప్లాస్టిక్ మహమ్మారి నుంచి కాపాడుతుంది అనడంలో సందేహం లేదన్నారు. ఈ రోబో త్రీడీ గిల్బర్ట్ చేప తన తోక సాయంతో కదులుతుంది. ఇది ఈత కొడుతున్నప్పుడే నీటిన శుద్ధి చేసే ప్రక్రియ మొదలుపెడుతుంది.
నీటిని సేకరించడానికి నోటిని తెరుస్తుంది. దాని నోటిలో నీరు నిండిపోయిన వెంటనే మూసుకుపోతుంది. ఆ తర్వాత ఆ రోబో చేప అంతర్గత కుహరంలోని గిల్‌పాప్‌కి ఉన్న మెష్ ద్వారా ఫిల్గర్ చేసిన నీటిని బయలకు నెట్టేసి, ప్లాస్టిక్‌ని సంగ్రహిస్తుంది. ఈ రోబో చేప కాలుష్య పోరాటంలో చేరి ప్రపంచాన్ని మరింత సుస్థిరంగా చేస్తుందంటున్నారు పరిశోధకులు. ఐతే మైక్రో ప్లాస్టిక్ మాత్రం శాశ్వతంగా తొలగిపోవాలంటే వందలు లేదా వేల ఏళ్లు పట్టవచ్చు అని చెబుతున్నారు.