ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి పుట్టినరోజు వేడుకలు ఏపి స్టేట్ ఫైబర్ లిమిటెడ్ కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్బంగా ఏపీ స్టేట్ ఫైబర్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తరువాత వైస్ జగన్ పుట్టిన రోజును జరుపుకొని APSFL సంస్థ కొత్తగా 9 ప్యాకేజీలు ప్రకటించింది.
- రూ.190 రూపాయలకే 20 ఎంబీపీఎస్ (mbps) స్పీడ్ తో
400 జిబి (జీబీ) ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయం. - రూ.295 రూపాయలకు ఎన్టీఏ ఛానల్స్, 15ఎంబీపీఎస్
స్పీడ్ తో 200జీబీ ఇంటర్నెట్ - రూ.249 కే 50..ఎంబీపీఎస్ స్పీడ్ తో 600 జీబీ ఇంటర్నెట్
- ఏపీ.ఎస్.ఎఫ్.ఎల్ లో త్వరలో OTTలు
- రూ.299,రూ.399, రూ.799 రూపాయలతో ఒటీటీ, ఇంటర్నెట్, టెలిఫోన్ సదుపాయం
- రూ.499,రూ.699, రూ.999.. రూపాయలకే ఒటీటీతో పాటు ట్రిపుల్ ప్లే ప్యాకేజీలు అందిస్తుండగా
మరో పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభం
గౌతమ్ రెడ్డి పది రోజుల్లో కొత్త స్కీంలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. 19 వేల పైన ఉన్న గ్రామ పంచాయతీల్లో చివరి ఇంటి వరకు ఇంటర్నెట్ సౌకర్యం అందిస్తాం అని తెలిపారు. బిల్లులు చెల్లింపులు ప్రీపెయిడ్ విధానంలో, ఏ ప్రాంతంలోనైనా APSFL సేవలు అందేలా చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.
వైస్ జగన్ సరికొత్త రికార్డులు
ఇటీవల కాలంలో కేబుల్, ఇంటర్నెట్, ఫోన్ సేవల ప్రాధాన్యం బాగా పెరిగింది. దీనితో పాటు ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోవడం చాలా మందికి సర్వసాధారణంగా మారింది. కానీ వీటికి అయ్యే ఖర్చు మాత్రం వినియోగదరులకు భారమే. ఈ నేపథ్యంలో మూడు రకాల సేవలనూ కేబుల్, ఇంటర్నెట్, ఫోన్,వాయిస్, డేటా సేవల్ని ఒకే గొడుకు కిందకు తెచ్చి, అతి తక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం అందిస్తుంది. రాష్ట్ర ముఖ్య మంత్రిగా వైఎస్ జగన్ దేశంలో హైస్పీడ్ ఆప్టిక్ ఫైబర్ కేబుల్ నెట్ వర్క్ సేవలను అందించి రికార్డ్ సృష్టించిన విషయం తెలిసిందే.