ఏపీలో డిజిటల్‌ విప్లవం…

దేశ విద్యారంగ చరిత్రలోనే ఓ అపూర్వ ఘట్టం. పేద పిల్లలకూ ఇకమీదట డిజిటల్‌ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే సుమారు 4.6 లక్షల మంది ఎనిమిదో తరగతి విద్యార్థులకు అధునాతన ట్యాబ్‌ల పంపిణీని నేడు తన పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించారు సీఎం వైయస్‌ జగన్‌. మొత్తంగా విద్యార్థులకు రూ.1,400 కోట్ల లబ్ధి. ఇక సంపన్నులతో సమానంగా సామాన్యులకూ అధునాతన విద్య!

ఇకమీదట ఏపీ లో విద్యారంగం గురించి వైస్ జగన్ సీఎం అవ్వకముందు… సీఎం అయిన తరువాత అని చెప్పుకుంటారు. విద్యారంగ సంస్కర్తల జాబితాలో వైస్ జగన్ పేరు చేరనుంది. ఎందుకంటే పేదరికం చదువుకు అడ్డం కాకూడదని, అమ్మవడితో పేదలను బడికి రప్పించారు, గోరు ముద్దలతో ఆకలి తీర్చారు, నాడు నేడు ద్వారా గవర్నమెంట్ స్కూల్లను కోర్పారాట్ స్కూల్లలా మారుస్తున్నారు. ఇంకా అనేక వినుద్ద సంస్కరణలతో విద్యారంగానికి ఈ మూడున్నర ఏళ్లలో రూ.54 వేల కోట్లకు పైగా ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలలను దేశంలో అత్యున్నత ప్రమాణాలున్న గొప్ప గొప్ప స్కూళ్లకు ధీటుగా తీర్చి దిద్దుతున్నారు సీఎం వైస్ జగన్.

అంతటితో ఆగకుండా విద్యార్థులు 21వ శతబ్దపు నైపుణ్యాలను సాధించాలని మహోన్నత సంకల్పంతో నేడు తన పుట్టిజరోజు సందర్బంగా 8వ తరగతి చదివే సుమారు 4.6 లక్షల మంది విద్యార్థులుకు ట్యాబులను ఉచితంగా అందించే కార్యమాన్ని ప్రారంభిస్తున్నారు. అలానే బోధించే 60వేల ఉపధ్యాయులకు ట్యాబులు ఇవ్వనున్నారు. ఇకమీదట ఏటా 8వ తరగతికి వచ్చే విద్యార్థులకు ట్యాబులు ఇస్తారు. ఈ ట్యాబుల కోసం ప్రభుత్వం రూ. 688 కోట్ల భారీ వ్యయం చేస్తుంది. అంతేకాకుండా దేశంలో అతి పెద్ద కంపెనీ BYJUS తో ఒప్పందం కుదుర్చుకొని డిజిటల్ లెర్నింగ్కి శ్రీకారం చుట్టుంది వైస్ జగన్ ప్రభుత్వం. ఒక్కో విద్యార్థికి ఏడాదికి దాదాపు రూ. 15500 విలువ చేసే మొత్తం రూ. 778 కోట్ల విలువైన కంటెంట్ ను మన పిల్లలకోసం BYJUS ఉచితంగా అందిస్తోంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *