హైకోర్టు నుంచి 15 ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల.. విద్యార్హత, పోస్టులు పూర్తి వివరాలు తెలుసుకోండి

టీవల తెలంగాణ హైకోర్టునుంచి భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి.

జనవరి మొదటి వారంలో జిల్లా కోర్టుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు 6 నోటిఫికేషన్లకు పైగా విడుదల చేసిన హైకోర్ట.. జనవరి 11న మరో 9 నోటిఫికేషన్లు విడుదల చేసింది. మొత్తం 15

సంబంధించి అర్హతలు ఏంటి.. పోస్టులు ఎన్ని.. అనే పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

1. ఆఫీస్ సబార్డినేట్ : 50 పోస్టులు

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఉత్తీర్ణులై ఉండాలి. పదో తరగతి పాసైనా.. ఫెయిల్ అయినా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ.. పది తర్వాత హైయర్ స్టడీ చేసి ఉండకూడదు.

2. అసిస్టెంట్ : 10 పోస్టులు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ  ఉత్తీర్ణులై ఉండాలి.

3. ఎగ్జామినర్ : 17 పోస్టులు

4. సిస్టమ్ అసిస్టెంట్ : 45 పోస్టులు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ(ఈసీఈ/సీఎస్ఈ/ఐటీ) పూర్తి ఉండాలి. లేదా డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాలి. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ ఉన్న వాళ్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

5. అప్పర్ డివిజన్ స్టెనో: 2 పోస్టులు

ఏదైనా డిగ్రీతోపాటు టైపింగ్(హయ్యర్‌గ్రేడ్), షార్ట్‌హ్యాండ్ సర్టిఫికేట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కంప్యూటర్ డిగ్రీ/డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.

6. అసిస్టెంట్ లైబ్రేరియన్: 2 పోస్టులు

లా డిగ్రీతోపాటు బీఎల్ఐఎస్సీ డిగ్రీ ఉండాలి. ఎంఎల్‌ఐఎస్సీ ఉన్నవారికి ప్రాధాన్యం. లైబ్రరీ నిర్వహణకు సంబంధించి కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఇందుకు సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి.

7. కంప్యూటర్ ఆపరేటర్: 20 పోస్టులు

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు.. టైపింగ్ రైటింగ్(హయ్యర్ గ్రేడ్) పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఇంగ్లిష్‌లో నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. ఏడాది పీజీడిప్లొమా-కంప్యూటర్ ప్రోగ్రామింగ్/కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సు చేసి ఉండాలి. లేదా బీసీఏ డిగ్రీ కలిగి ఉండాలి.

8. ట్రాన్స్‌లేటర్ పోస్టులు సంఖ్య: 10

దీనిలో తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులు 08, ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులు 2 ఖాళీగా ఉన్నాయి. వీటికి మూడేళ్లు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉండాలి. తెలుగు ట్రాన్స్‌లేటర్ పోస్టులకు తెలుగు నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి తెలుగులోని ట్రాన్స్ లేషన్ చేయగలగాలి. అదేవిధంగా ఉర్దూ ట్రాన్స్‌లేటర్ పోస్టులకు ఉర్దూ నుంచి ఇంగ్లిష్, ఇంగ్లిష్ నుంచి ఉర్దూలోని అనువాదం చేయగలగాలి.

9. కోర్టు మాస్టర్స్/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శి ఖాళీల సంఖ్య: 20

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ (ఆర్ట్స్/సైన్స్/కామర్స్/లా) ఉత్తీర్ణులై ఉండాలి. వీటితో పాటు.. ప్రభుత్వం నిర్వహించే టైపింగ్ టెక్నికల్ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వం నిర్వహించే టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ (ఇంగ్లిష్- నిమిషానికి 45 పదాలు) పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.

జిల్లా కోర్టులో ఉద్యోగాలు ..

10.జూనియర్ అసిస్టెంట్

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు. మొత్తం 275 పోస్టులను జిల్లాల వారీగా విడుదల చేసింది. దీనికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నారు.

11.ఫీల్డ్ అసిస్టెంట్

ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు వివిధ జిల్లాల్లో 77 ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనికి డిగ్రీ పూర్తి చేసిన ప్రతీ ఒక్క అభ్యర్థి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

12.ఎగ్జామినర్

ఎగ్జామినర్ పోస్టులకు సంబంధించి మొత్తం 66 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

13.రికార్డ్ అసిస్టెంట్

రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి మొత్తం 97 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

14.ప్రాసెస్ సర్వర్

ప్రాసెస్ సర్వర్ పోస్టులకు సంబంధించి మొత్తం 163 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. పదో తరగతి పూర్తి చేసిన ప్రతీ ఒక్కరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

15.ఆఫీస్ సబార్డినేట్

ఆఫీస్ సబార్డినేట్ కు సంబంధించి మొత్తం 1226 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. వీటిని తెలంగాణలోని వివిధ జిల్లాల వారీగా భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 7వ తరగతి నుంచి 10 వ తరగతి మధ్య చదువు పూర్తి చేసి ఉండాలి. ఎక్కువ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు కారు.

జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలకు సంబంధించి 6 నోటిఫికేషన్లకు దరఖాస్తుల ప్రక్రియ జనవరి 11 నుంచి ప్రారభం అయ్యాయి. జనవరి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటికి సంబంధించి పరీక్షలకు కంప్యూటర్ విధానంలో మార్చి నెలలో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొత్తం 176 ఖాళీల భర్తీకి 9 నోటిఫికేషన్లను హైకోర్టు జనవరి 11న విడుదల చేసింది. వీటిలో హైకోర్టు సబార్డినేట్‌-50 పోస్టులు, సిస్టమ్‌ అసిస్టెంట్‌-45 పోస్టులు, ఎగ్జామినర్‌-17 పోస్టులు, అసిస్టెంట్‌-10 పోస్టులు, స్టెనో-2 పోస్టులు, అసిస్టెంట్‌ లైబ్రేరియన్‌-2 పోస్టులు, కంప్యూటర్‌ ఆపరేటర్‌-20 పోస్టులు, ట్రాన్స్‌లేటర్‌-10 పోస్టులు, కోర్టు మాస్టర్‌/ హైకోర్టు జడ్జిల వ్యక్తిగత కార్యదర్శులు-20 పోస్టులు ఉన్నాయి. వీటికి దరఖాస్తుల ప్రక్రియ జనవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. సరైన అర్హతలున్నవారు ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఫిబ్రవరి 20 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. పరీక్ష తేదీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కానీ.. మార్చిలో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.

మొత్తం హైకోర్టు నుంచి విడుదలైన 15 నోటిఫికేషన్లకు దరఖాస్తు ఫీజు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.600(అదనంగా మరో రూ.23), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400(అదనంగా మరో రూ.23) ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. పూర్తి వివరాలకు హెచ్టిటి పిఎస్ ://టిఎస్హెచ్సి.గొవ్.ఇన్ /గెట్ నోటిఫికెషన్స్ వెబ్ సైట్ సందర్శించొచ్చు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *