రిక్షా నడిపే వ్యక్తి కొడుకు ఐఏఎస్ ఆఫీసర్.. మొదటి ప్రయత్నంలోనే సక్సెస్.. యూపీ వాసి సక్సెస్ స్టోరీ..

సంకల్ప బలం, ఆత్మవిశ్వాసం, మన మీద మనకు నమ్మకం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. ఈ విషయాన్ని చేసి చూపించాడు ఓ రిక్షా నడిపే వ్యక్తి కొడుకు.

తినడానికి తిండి లేక, ఉన్నత చదువులకు ఆర్థిక పరిస్థితి ఆటంకంగా మారినా, ఆ వ్యక్తి వెనుకడుగు వేయలేదు. మొక్కవోని దీక్షతో సివిల్స్‌కుప్రిపేర్ అయ్యి, ఫస్ట్ అటెమ్ట్‌లోనే సక్సెస్ అయ్యాడు. అతడే ఉత్తర్‌ప్రదేశ్‌లోని నిరుపేద కుటుంబానికి చెందిన గోవింద్ జైశ్వాల్. యూపీలోని వారణాసికి చెందిన రిక్షా నడిపే వ్యక్తి నారాయణ్

కుమారుడు గోవింద్.. తొలి ప్రయత్నంలోనే ఐఏఎస్ క్లియర్ చేసి, నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే ఈ ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. ప్రస్తుతం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గోవింద్ సక్సెస్ స్టోరీ చూద్దాం.

గోవింద్ చిన్నతనంలో అతని కుటుంబ పరిస్థితి బాగానే ఉండేది. అయితే అతని తల్లి ఇందు తీవ్ర అనారోగ్యం బారిన పడింది. దీంతో ఆమె వైద్యానికి భారీగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గోవింద్ తండ్రినారాయణ్‌కు 1995లో 35 రిక్షాలు ఉండేవి. అతని భార్య అనారోగ్యం కారణంగా 20 రిక్షాలను విక్రయించాడు. అయినా ఫలితం లేకపోయింది. బ్రెయిన్ హెమరేజ్‌తో 1995లోనే ఆమె మరణించింది. ఒకపక్క తల్లి మరణం, మరోపక్క ఆర్థికంగా అతని కుటుంబం చితికిపోయింది. ఆ సమయంలో గోవింద్ 7వ తరగతి చదువుతుండేవాడు. గోవింద్ తన ప్రాథమిక విద్యను ఉస్మాన్‌పురలోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశాడు.

తండ్రితో పాటు రిక్షా నడిపాడు

పూట గడవడమే కష్టంగా ఉండడంతో గోవింద్ కుటుంబం మొత్తం కాశీలోని అలీపురాలోని ఒక చిన్న గదికి మారారు. ఆ రోజుల్లో గోవింద్, ముగ్గురు సోదరీమణులు, తండ్రి ఎండు రోటీలు మాత్రమే తింటూ ఆకలి తీర్చుకునేవారు. డబ్బు సంపాదించడం కోసం గోవింద్ తన తండ్రితో కలిసి రిక్షా నడపడం ప్రారంభించాడు.

హరిశ్చంద్ర యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్..

ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా నారాయణ్ మాత్రం తమ పిల్లల చదువును మానిపించలేదు. తన ముగ్గురు కుమార్తెలను డిగ్రీ వరకు చదివించాడు. ఇక వారి పెళ్లిళ్ల కోసం మిగిలిన రిక్షాలను కూడా అమ్మేశాడు. గోవింద్ వారణాసిలోని హరిశ్చంద్ర యూనివర్సిటీ నుంచి గణితంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉండడంతో పిల్లలకు గోవింద్ ట్యూషన్స్ కూడా చెబుతుండేవాడు. ఆర్థిక కష్టాల నుంచి తన కుటుంబాన్ని గట్టెక్కించాలని బలంగా అనుకున్నాడు గోవింద్. దీంతో యూపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2006లో యూపీఎస్సీ పరీక్షల ప్రిపరేషన్‌ కోసం మకాం ఢిల్లీకి మార్చాడు.

తొలి ప్రయత్నంలోనే సివిల్స్ క్లియర్..

ఢిల్లీకి వెళ్లిన తరువాత రోజువారీ ఖర్చులు పెరిగిపోవడంతో అక్కడ కూడా ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. అయినా ఖర్చులకు సరిపడా డబ్బు రాకపోవడంతో ఉదయం పూట టిఫిన్, టీ పూర్తిగా మానేశాడు. జీవితంలో ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన గోవింద్ 2007లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ క్లియర్ చేసి శెభాష్ అనిపించుకున్నాడు. గోవింద్ సివిల్స్ పరీక్షలో ఆలిండియా 48వ ర్యాంక్ సాధించాడు. పేదరికాన్ని, జీవితంలో ఆటుపోట్లను జయించి ఐఏఎస్ ఆఫీసర్‌ స్థాయికి ఎదిగి.. ఈ తరం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు గోవింద్.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *