పట్టిన పట్టు వదలకుండా.. ఐఏఎస్ కొట్టానిలా.. చివరికి..

 ర్యాంక్ సాధించడానికి ఓ వ్యక్తి ఏకంగా తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు ప్రయత్నించి.. యూపీఎస్సీ సివిల్స్‌లో 54వ ర్యాంకు సాధించాడు.

ఈతని పేరే విధు శేఖర్. అంకిత భావంతో పనిచేసే విజయం సొంతం అవుతుంది అనడానికి విధు మంచి ఉదాహరణ. ఈ నేపథ్యంలో ఐపీఎస్ ఆఫీసర్ విధు శేఖర్ సక్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేపథ్యం :
విధు శేఖర్.. తండ్రి ప్రొఫెసర్ నిషిత్ రాయ్. ఈయన లక్నోలోని డాక్టర్ శకుంతల మిశ్రా జాతీయ పునరావాస విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. తల్లి అనితా రాయ్ గృహిణి. అతని అక్క షచి రాయ్. ఈమె లక్నో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్. అతని బావ మనీష్ కుమార్ 2018 బ్యాచ్ ఉత్తరాఖండ్ కేడర్ ఐఏఎస్.

ఎడ్యుకేషన్ :
విధు శేఖర్.. తన ప్రాథమిక విద్యను లక్నోలోని లామార్టినియర్‌లో పూర్తి చేశారు. అలహాబాద్‌లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు.

విధు శేఖర్.. 2012 నుంచి 2016 వరకు ఐఐఐటీ నుంచి బీటెక్‌ పూర్తి చేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని ప్రారంభించారు. అతను ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. ఆ సమయంలో తన చదువును కూడా కొనసాగించాడు. జనరల్ నాలెడ్జ్ , ఇతర సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి ఒక సమయాన్ని తీసుకున్నాడు. అలాగే యూపీఎస్సీ సివిల్స్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. నాలుగు సార్లు ప్రయత్నించి.. చివరికి ఐఏఎస్ అయ్యాడు. గతంలో రెండుసార్లు మంచి ర్యాంకే వచ్చినా.. ఇంకా మంచి ర్యాంకు రావాలని అప్పుడు వదిలేశాడు. చివరకు తన కష్టం ఫలించి ఐఏఎస్ అయ్యాడు. 2020 యూపీఎస్సీ ఫలితాల్లో విధు శేఖర్ 54వ ర్యాంకు సాధించాడు

పట్టిన పట్టు వదలకుండా.. ఐఏఎస్ కొట్టానిలా..
2017 సంవత్సరంలో జరిగిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ప్రియూపీఎస్సీ  లిమ్స్ పరీక్ష ఫలితాలు అనుకూలంగా వచ్చినప్పుటికి.., అతను ఉద్యోగాన్ని విడిచిపెట్టి, పరీక్షకు పూర్తిగా సిద్ధం కావడం ప్రారంభించాడు. అయితే.., మొదటి ప్రయత్నంలోనే మెయిన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ధైర్యాన్ని కోల్పోకుండా.. పరీక్ష ప్రిపరేషన్‌పై పూర్తిగా అంకితం అయ్యాడు. 2018లో యూపీఎస్సీ  సివిల్స్‌లో 173 వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఆదాయపు పన్ను)కి ఎంపికయ్యాడు.

నేషనల్ అకాడమీ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ , నాగ్‌పూర్‌లో శిక్షణ పొందుతున్న సమయంలో కూడా.., మళ్లీ పరీక్ష కోసం తన సన్నాహాలను కొనసాగించాడు. అలాగే 2019 మూడవ ప్రయత్నంలో 191వ ర్యాంక్ సాధించాడు. కానీ దీనికి కూడా అతను ప్రాధాన్యత ఇవ్వలేదు. శిక్షణతో పరీక్షకు సిద్ధమవుతూనే ఉన్నాడు. శిక్షణ సమయంలో కూడా అతనికి సమయం దొరికినప్పుడల్లా.. పరీక్షకు సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉండేవాడు. అతను యూపీఎస్సీ 2020 సివిల్స్‌లో పరీక్షలో తను అనుకున్న ర్యాంక్ సాధించాడు.

రోజుకు దాదాపు 8 గంటల పాటు..
రోజుకు దాదాపు 8 గంటలు పాటు విధు శేఖర్ చదువుకునేవాడు. కరోనా కారణంగా యూపీఎస్సీ సివిల్స్‌ ప్రిపరేషన్ అంతరాయం వచ్చింది. దీంలో ఆన్‌లైన్‌లో ప్రిపరేషన్‌కు కొనసాగించాడు. మెయిన్స్ పరీక్ష కోసం ట్యుటోరియల్స్ కూడా సహాయపడ్డాయి. ఇతర సబ్జెక్టుల టీచర్లు అతనికి మద్దతు ఇచ్చారు. అలాగే స్వీయ అధ్యయనం కూడా చేశారు.

యూపీఎస్సీ సివిల్స్ కోసం.. త కెరీర్‌ని పణంగా పెట్టాడు. ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ రెండు లేదా మూడు సంవత్సరాలు ప్రైవేట్ ఉద్యోగంలో పని చేయకపోతే.., భవిష్యత్తులో ఉద్యోగం పొందడం కష్టమవుతుంది. ప్రస్తుతం అర్హత కలిగిన నిపుణుల కొరత లేదు. టెక్నాలజీ వేగంగా మారుతోంది. అటువంటి పరిస్థితిలో.., అతను యూపీఎస్సీ  లో విజయం సాధించకపోతే.., అప్పుడు అతను తన కెరీర్‌లో ఎక్కడ ముందుకు వెళ్తాడని అతను భావించాడు? కానీ అతను యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తాడని తనను తాను విశ్వసించాడు. ఈ ఆత్మవిశ్వాసమే అతనికి ప్రేరణగా మారింది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *