ఫోన్లు చోరీ అయినప్పుడు పోలీసులు ఎలా వెతికి పట్టుకుంటారో తెలుసా?

స్మార్ట్ ఫోన్ చేతిలో లేకపోతే పూట గడవని పరిస్థితి. మనం ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎటు వెళ్లినా ఫోన్ తప్పనిసరి అయిపోయింది. కాకుంటే ఈ ఫోన్లు వారి వారి స్తోమతకు తగ్గట్టుగా కొంత మంది దగ్గర విలువైనవి ఉంటే, మరికొంత మంది దగ్గర నార్మల్‌ వి ఉంటాయి.

మరి ఈ ఫోన్ ఒకవేళ పోతే? లేదంటే ఎవరైనా చోరీ చేస్తే? ఇలాంటి ఘటనలు నిత్యం జరిగేవే. అయితే ‘పోయిన వస్తువు తిరిగిరాదులే..’ అన్నట్లుగా వాటి గురుంచి ఆలోచించడం మానేస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు విజయనగరం జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక వెబ్ పోర్టల్ తీసుకొచ్చింది. ఇందులో పిర్యాదు చేస్తే 15 నుంచి 30 రోజుల్లో రికవరీ చేసి మీ ఫోన్ మీ వద్దకు తిరిగి చేరుస్తారు.

ఫోన్ పోతే ముందుగా ఫోన్ గురించి కాకుండా అందులో ఉన్న సమాచారం కోసమే ఎక్కువ ఆందోళన ఉంటుంది. ఇది సహజం. ఈ డేటా మరొకరి చేతికి వెళ్లకుండా ఉండాలంటే ఫోన్ పోయిన విషయాన్ని గుర్తించిన వెంటనే కేంద్ర టెలికాం శాఖ నిర్వహించే సిఇఐర్అనే వెబ్ సైట్ కు సమాచారం ఇవ్వాలి. వాళ్లు వెంటనే పోయిన ఫోన్ బ్లాక్ చేస్తారు. దాని వలన ఫోన్ దొంగిలించిన/దొరికినవాళ్లు మన ఫోన్‌ను ఉపయోగించకుండా ఆపొచ్చు. అలాగే గూగుల్ అకౌంట్ల నుంచి సైన్ అవుట్ అవ్వాలి. అప్పుడు మొబైల్‌లో ఎలాంటి సమాచారం బయటకు పోదు. ఆ తరువాత పోలీసులకు పిర్యాదు చేయాలి.

పిర్యాదు ఎలా చేయాలంటే..

మొబైల్ పోతే పిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లక్కర్లదు. వీజ్మ్మొబిలైత్రకెర్. ఇన్  పోర్టల్ లోకివెళ్లి సంబంధిత వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ ఫిర్యాదు నేరుగా సైబర్ సెల్ కు వెళ్తుంది. అక్కడ నుంచి సైబర్ సెల్ టీం ఆఫీసులోని అన్నీ సిస్టమ్స్ కు ఆ కంప్ల్టైట్ వెళ్తుంది. దానిలో ఫోన్ నెంబర్ నుంచి ఆ ఫోన్ మోడల్ వరకు అన్నీ వివరాలు ఉంటాయి. ఫోన్ దొంగలించిన/దొరికినా ఆ వ్యక్తులు వెంటనే ఫోన్ స్వీచ్ ఆఫ్ చేసి, సిమ్ తీసేయడం సహజం. అందుకే ఈఎంఈఐ నంబర్ అవసరం. ఒకవేళ అది కూడా లేకపోయినా ఆ ఫోన్‌లో వాడిన నంబరు ఆధారంగానైనా ఫోన్ ట్రేస్ చేస్తారు.

వారు చివరగా చెప్పేది ఇదే..

సెల్ ఫోన్ పోతే చాలా మంది దాని గురుంచి ఫిర్యాదు చేయకుండా కొత్తది కొనుక్కోవాలని చూస్తున్నారు. అలా చేయడం కరెక్టే.. కాదనం. కానీ, అది అసాంఘిక శక్తుల చేతుల్లోకి వెళ్తే దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దొంగతనం చేసిన ఫోన్ ఎక్కడో అమ్మేస్తారు. ఆ ఫోన్ ఎక్కడెక్కడికో వెళ్లి, చివరకి నేరగాళ్ల చేతిలో పడితే.. వారు సైబర్ నేరాలకు వాడతారు. ఆ తరువాత జరివేవాటికి బాధ్యత వహించాల్సింది మీరు. అందుకే మీ ఫోన్ పోగానే వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు, నెట్ వర్క్ సంస్థలకు తెలియజేయాలి అని సూచిస్తున్నారు.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *