రాత్రిపూట నిద్ర పట్టడం లేదా..! ఈ చిట్కాలు పాటించండి రాత్రిపూట కాఫీ,టీలు సేవించరాదు గోరువెచ్చని పాలు త్రాగితే మంచిది నిద్రించే ముందు మితాహారం మంచిది బెడ్రూం వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి చాలా మందికి అనేక రకాల సమస్యలతో బాధపడుతుంటారు. అయితే ఆ టెన్షన్ లో రాత్రి సమయంలో నిద్ర పట్టకుండా ఉంటుంది.
మన శరీర పోషణకు నిద్ర ముఖ్యం. కానీ మన బిజీ షెడ్యూల్స్ వల్ల, మానసిక ఒత్తిడి, విపరీతమైన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో అవకతవకలు.. ఇలా అన్నీ కలిసి రాత్రి సమయంలో పట్టే నిద్ర మీద ప్రభావం చూపుతున్నాయి.
ప్రశాంతమైన నిద్ర లేనిదే ఉదయం వేళలో యాక్టివ్ గా ఉండలేరు.
మన శరీరం, మనస్సు సక్రమంగా పనిచేయడానికి నిద్ర చాలా అవసరం. రాత్రి నిద్రను సంసృతంలో భూతధాత్రి అని అంటారు. అంటే సమస్త సృష్టికి తల్లి అనే అర్థం వస్తుంది. తల్లి తన బిడ్డలను
ఎలా చూసుకుంటుందో అలాగే నిద్రా స్థితిలో విశ్రాంతి తీసుకుంటూ అందరినీ పోషిస్తుందనే అర్థం. నిద్ర అనేది మన దినచర్యలో సహజమైన ఆవశ్యకమైన భాగం. ఇది మనకు శక్తిని అందిస్తుంది. నిద్ర ఆరోగ్యకరమైన జీవితానని గడపడానికి అవసరం. లోతైన, సరైన నిద్ర మన మనస్సు, శరీరానికి పూర్తి విశ్రాంతిని ఇస్తుంది. ఇది శరీరానికి తాజాదనాన్ని, శక్తివంతంగా, సంతోషంగా మారుస్తుంది. అసంతృప్తి నిద్రవల్ల బాధ, బలహీనత, నీరసం, తక్కువ జీవితకాలం వంటి ఇబ్బందులు మొదలవుతాయి
మంచి నిద్రకు చిట్కాలు..
1. పడుకునే ముందు పాదాలను శుభ్రంగా కడుక్కోవాలి. అరికాళ్ళకు మసాజ్ లా చేయడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.
2. నిద్రపోతున్నప్పుడు శరీరంలో గాలి ప్రసరించేలా వదులుగా, సౌకర్యవంతమైన దుస్తులు వేసుకోవాలి.
3. నిద్రపోయే ముందు లోతైన శ్వాస తీసుకోండి. కాసేపు ప్రశాంతంగా ఏ ఆలోచనా లేకుండా ధ్యానం చేయండి.
4. వంటగదిలో నిద్రించకండి. పడకగదిలో ఆహార పదార్థాలు ఉంచకండి.
5. పడకగది కాస్త విశాలంగా స్వచ్ఛమైన గాలి ఉండేలా చూసుకోవాలి. చీకటి, తడి గదిలో ఎప్పుడూ నిద్రపోకూడదు..
6. సన్నగా, మెత్తగా ఉండే దిండు మీద తల ఉంచి నిద్రపోండి.