ఇప్పుడంతా ఫోన్ల ప్రపంచం. ఎవరైనా సరే చెవిలో హెడ్ ఫోన్లు పెట్టుకుని తమ లోకంలో తాము ఉంటున్నారు. ఇయర్ ఫోన్, హెడ్ ఫోన్లతో ఇబ్బందులున్నా పట్టించుకోవడం లేదు.
ఇయర్‌ఫోన్‌లు ఎక్కువగా వాడటం వల్ల చాలా సార్లు సౌండ్ భ్రమ వస్తుంది. ఇయర్‌ఫోన్‌లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల మన చెవులపై ప్రభావం పడటమే కాకుండా గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని తెలిస్తే బహుశా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఇది హృదయ స్పందన రేటును వేగవంతం చేస్తుంది, ఇది హృదయ స్పందనను పెంచుతుంది.
ఫలితంగా రోగాలకు దగ్గరవుతున్నారు. ఇయర్ ఫోన్లతో సమస్యలున్నాయని తెలిసినా విడిచిపెట్టడం లేదు. ఇయర్ ఫోన్లు ఉపయోగించడం వల్ల వినికిడి సామర్థ్యం దెబ్బతింటుంది. గుండె సమస్యలకు కూడా మూలమవుతుంది. ఇయర్ ఫోన్ల వాడకం వల్ల శబ్దం చెవిపోటుకు దగ్గరగా ఉన్న కర్ణబేరిని తాకడం వల్ల చెవిపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నేటి కాలంలో మన జీవనశైలితో అనేక సమస్యలు వస్తున్నాయి.
90 డెసిబుల్స్ మరియు అంతకంటే ఎక్కువ వాల్యూమ్ ఉన్న ఇయర్‌ఫోన్‌ను ధరించడం వల్ల, మీరు వినికిడి సమస్య లేదా వినికిడి లోపం కలిగి ఉండవచ్చు. 15 నిమిషాలకు పైగా 100 డెసిబుల్స్ కంటే ఎక్కువ వినడం వలన, మీరు వినికిడి నష్టం కలిగి ఉండవచ్చు.
ఈ రోజుల్లో, అద్భుతమైన ఆడియో అనుభవాన్ని అందించే ఇయర్‌ఫోన్‌లు ఉన్నాయి, కానీ గొప్ప అనుభవంతో ఆరోగ్యానికి కూడా ప్రమాదం వస్తుంది. ఇయర్‌ఫోన్‌లు చెవి కాలువలో చొప్పించడానికి నిర్మించబడ్డాయి, ఇది గాలి మార్గాన్ని అడ్డుకుంటుంది, ఇది చెవి ఇన్‌ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇయర్ ఫోన్ల వాడకంతో గుండె జబ్బు సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్ ఫోన్లతో వినికిడి సామర్థ్యం దెబ్బతిని అది గుండె జబ్బులకు దారితీస్తోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇది హృదయ స్పందనల రేటును పెంచుతుంది. ఫలితంగా గుండె జబ్బులు చుట్టు ముట్టే ప్రమాదం ఏర్పడుతోంది. దీనిపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇయర్ ఫోన్లతో ధ్వని భ్రాంతి కూడా కలుగుతుంది.
అంతేకాదు ఇయర్ ఫోన్లు ఒకరి చెవి నుంచి మరొకరి చెవిలో పెట్టుకుంటే బ్యాక్టీరియా సోకే అవకాశాలు ఉన్నాయి. ఇయర్ ఫోన్లలో ఉండే స్పాంజి వల్ల ఒకరి నుంచి మరొకరికి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇవి ఎక్కువ సేపు చెవిలో ఉంచుకుంటే చెవి నరాలపై ఒత్తిడి పడుతుంది. సిరల వాపుకు కారణమవుతుంది. కంపనం వల్ల వినికిడి కణాలు సున్నితత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇయర్ ఫోన్లు చెవిలో పెట్టుకుని పాటలు, సంగీతం వింటూ లోకాన్ని మరచిపోతుంటారు. చుట్టుపక్కల ఏం జరిగినా పట్టించుకోరు.
ఇయర్ ఫోన్ల ప్రభావంతో చెవిపోటు వస్తుంది. ఇయన్ ఫోన్ల వాడకంతో చెవికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కొంత కాలం తరువాత చెవి నొప్పి కూడా వస్తుంది. ఇయర్ ఫోన్ల తో ఇన్ని సమస్యలుంటున్నా వాటిని వాడకంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఉదయం నడకతో ప్రారంభమయ్యే ఇయర్ ఫోన్ల వల్ల భవిష్యత్ లో కూడా నష్టాలు రావచ్చు. కానీ వీటిని పట్టించుకోకుండా నేటి ప్రజలు ఇయర్ ఫోన్ల వాడకానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా చెవి రోగాలకు దగ్గరవుతున్నారు. అయినా నిర్లక్ష్యంతోనే వాటిని వాడుతున్నారు.