ఇన్‌స్టాంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారం వాట్సాప్‌కు ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో యూజర్‌లు ఉన్నారు.
తన వినియోగదారులకు బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు వాట్సాప్ తరచూ అప్‌డేట్స్‌ను అందిస్తోంది
ఇండియాలో కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేక సందర్భాలలో విషెస్ చెప్పడానికి ఎక్కువ మంది వాట్సాప్‌నే వినియోగిస్తారు. రోజూ సాధారణ గుడ్ మార్నింగ్, గుడ్‌నైట్ మెసేజ్‌లకు కూడా వాట్సాప్ వేదికైంది. రోజూ ఇలాంటి మెసేజ్‌లు వాట్సాప్ స్టోరేజ్‌ను పెద్ద మొత్తంలో ఆక్రమిస్తాయి. వీటిని ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు చూద్దాం
దీంతో రోజూ పెద్దమొత్తంలో అందిన అన్‌వాంటెడ్ మీడియాను మాన్యువల్‌గా తొలగించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా వాట్సాప్ స్టోరేజ్ టూల్‌ను అందిస్తుంది. దీని ద్వారా వినియోగదారులు ఎక్కువ స్టోరేజీని ఆక్రమించే చాట్‌ను గుర్తించే అవకాశం ఉంది. అదే విధంగా ఫైల్‌లను సైజు ప్రకారం సార్ట్ చేయడానికి సహాయపడుతుంది
వాట్సాప్ స్టోరేజ్ స్పేస్‌ను ఖాళీ చేయడానికి.. ఈ సింపుల్ స్టెప్స్‌ను ఫాలో అవ్వండి..
మొదట వాట్సాప్ ఓపెన్ చేసి చేసి చాట్స్ ట్యాబ్‌కు వెళ్లండి. అక్కడ మోర్ ఆప్షన్‌పై ట్యాప్ చేసి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత స్టోరేజ్ అండ్ డేటా ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మేనేజ్ స్టోరేజ్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
ఎగువన వినియోగదారులు అనేకసార్లు ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లు కనిపిస్తాయి. దాని కింద ‘లార్జర్ దెన్ 5ఎంబి ‘ ఫైల్స్ ఉంటాయి. ఫైల్స్‌పై యూజర్ ప్రెస్ చేసి ఉంచితే డిలీట్ ఆప్షన్ వస్తుంది. సెలక్టెడ్ ఫైల్స్‌ను డిలీట్ చేయవచ్చు, లేదా అన్ని ఫైల్స్‌ను ఒకేసారి డిలీట్ చేయవచ్చు. యాప్ టాప్ రైట్‌లో డిలీట్ ఆప్షన్ వస్తుంది. సెర్చ్ ఆప్షన్ ఉపయోగించి కూడా యూజర్లు చాట్ నుంచి మీడియాను తొలగించవచ్చు
స్టిక్సర్ సెండ్ చేయడం ఎలా?
కొన్ని సంవత్సరాలుగా గ్రీటింగ్స్, విషెస్ చెప్పడానికి స్టిక్టర్స్ పాపులర్ అయ్యాయి. ప్రియమైన వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఇతర స్టిక్కర్‌లను పంపాలనుకుంటే.. ఇలా చేయండి..
ఉదాహరణ హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్‌లను పంపడానికి, యూజర్లు ముందుగా వాటినిగూగుల్ ప్లే స్టోర్నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ నుంచి నచ్చిన ఏదైనా స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి
హ్యాపీ న్యూ ఇయర్ స్టిక్కర్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత.. దాన్ని ఓపెన్ చేసి వాట్సాప్‌కి యాడ్ చేయాలి. యాప్‌లో మల్టిపుల్ స్టిక్కర్ ప్యాక్‌లు కనిపిస్తాయి. వాటి పక్కన ప్లస్ (+) ఆకారంలో యాడ్ చేసే బటన్ ఉంటుంది. ఆ సింబల్‌పై క్లిక్ చేస్తే వాట్సాప్‌కు స్టికర్స్ యాడ్ అవుతాయి. ఇప్పుడు వాట్సాప్‌లో ఏదైనా చాట్ విండో ఓపెన్ చేసి నచ్చిన స్టిక్కర్‌లను పంపవచ్చు. యూజర్లు ఎమోజీ సెక్షన్ ఓపెన్ చేస్తే.. కుడివైపున ఉన్న ట్యాబ్‌లో కొత్తగా యాడ్ చేసిన స్టిక్కర్స్ ఉంటాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు మాత్రమే ఈ పద్ధతిని ఉపయోగించి స్టిక్కర్‌లను పంపగలరని గుర్తుంచుకోండి