పేటీఎంతో మీ ఎల్పిజి సిలిండర్లను బుకింగ్ చేస్తే.. క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.. బుకింగ్ ఎలా చేయాలి? ట్రాకింగ్ ప్రాసెస్ ఇదిగో..!

 ప్రముఖ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం కంపెనీ పేటీఎం తమ యూజర్లు అదిరిపోయే ఆఫర్లను అందిస్తోంది. పేటీఎం యాప్ ద్వారా చేసే చెల్లింపులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది.

ముఖ్యంగా.. పేటీఎం యూజర్లు ఎవరైతే.. తమ ఎల్పిజి సిలిండర్లను యాప్ ద్వారా బుకింగ్ చేసుకుంటారో వారికి ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ అందిస్తోంది. అందులో భారత్ గ్యాస్, ఇండనే హెచ్పి గ్యాస్ అంతటా ఎల్పిజి సిలిండర్ బుకింగ్‌పై యూజర్లకు పేటీఎం అద్భుతమైన క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లను అందిస్తోంది. డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫాం పేటీఎం మొదటి గ్యాస్ బుకింగ్‌పై ఫ్లాట్ రూ. 15 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. పేటీఎం వ్యాలెట్ ద్వారా సిలిండర్ బుకింగ్‌పై రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. అదనంగా, యాప్ బుకింగ్‌ను ట్రాక్ చేసేందుకు కూడా వినియోగదారులను అనుమతిస్తుంది.

ఎల్పిజి సిలిండర్‌లను బుక్ చేసుకునే కొత్త యూజర్లకు పేటీఎం మంగళవారం అద్భుతమైన క్యాష్‌బ్యాక్ డీల్స్ ప్రకటించింది. కొత్త పేటీఎం యూజర్లు రూ. 15 క్యాష్‌బ్యాక్ పొందాలంటే “ఫస్ట్ గ్యాస్” కోడ్‌ని ఉపయోగించవచ్చు. అంతేకాదు.. వినియోగదారులు పేటీఎం వ్యాలెట్ ఉపయోగించి సిలిండర్‌ల బుకింగ్‌పై రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్ పొందేందుకు “వాలెట్ 50 గ్యాస్” కోడ్‌ని ఉపయోగించవచ్చు. పేటీఎం వినియోగదారులను రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లను ఉపయోగించి సౌకర్యవంతంగా అదనపు ఛార్జీలతో గ్యాస్ రీఫిల్‌లను బుక్ చేసేందుకు అనుమతిస్తుంది..బుకింగ్ ప్రాసెస్‌తో పాటు బుక్ చేసిన సిలిండర్‌ల డెలివరీ ప్రక్రియను చూపే యాప్‌లో ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ బుకింగ్‌ను ట్రాక్ చేయవచ్చు. ముఖ్యంగా, మొదటి బుకింగ్ తర్వాత.. యాప్ బుకింగ్ వివరాలను కూడాసేవ్చేస్తుంది, తద్వారా కొత్త బుకింగ్‌ను ప్రాసెస్ చేసేందుకు వినియోగదారులు 17-అంకెల ఎల్పిజి ఐడిని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. పేటీఎం ద్వారా మీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం

పేటీఎం యాప్‌ ద్వారా గ్యాస్ సిలిండర్‌ను ఎలా బుక్ చేసుకోవాలంటే? :
* పేటీఎం యాప్‌ని ఓపెన్ చేయండి. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల కేటగిరీ కింద ‘బుక్ గ్యాస్ సిలిండర్’ ట్యాబ్‌కు వెళ్లండి.
* ఇప్పుడు ఎల్పిజి సిలిండర్ సర్వీస్ ప్రొవైడర్‌ని ఎంచుకోవాలి. ఆపై మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్/ 17-అంకెల ఎల్పిజి ఐడి/కన్స్యూమర్ నంబర్‌ను నమోదు చేయండి.
* పేమెంట్ చేయడం ద్వారా మీ బుకింగ్‌ను కొనసాగించండి.
* మీరు పేటీఎం వాలెట్, పేటీఎం యుపిఐ , కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్ వంటి మీకు ఇష్టమైన పేమెంట్ మోడ్‌లలో దేనినైనా చెల్లించవచ్చు.

ముఖ్యంగా, పేటీఎం వినియోగదారులు పేటీఎం పోస్ట్‌పెయిడ్‌తో గ్యాస్‌ను బుక్ చేసుకోవాలంటే.. వచ్చే నెలలో సున్నా వడ్డీ, జీరో జాయినింగ్ ఫీజుతో చెల్లించేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. అదనంగా, పేటీఎం యూజర్లుఇవ్ర్స్లేదా ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా బుక్ చేసుకున్న గ్యాస్ సిలిండర్ల కోసం కూడా చెల్లించవచ్చు.

* మీ బుకింగ్ ధృవీకరించినట్టు మెసేజ్ రాగానే.. మీ గ్యాస్ సిలిండర్ మీ రిజిస్టర్డ్ అడ్రస్‌కు 2-3 రోజుల్లో సమీపంలోని గ్యాస్ ఏజెన్సీ ద్వారా డెలివరీ అవుతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *