యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.. ఈ 6 విషయాలు తప్పక గుర్తుంచుకోండి!

యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త.. మీరు యూపీఐ పేమెంట్స్ చేసే సమయంలో ఈ ఆరు విషయాలు తప్పక గుర్తుంచుకోండి.

లేదంటే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే ప్రమాదం ఉంది. యూపీఐ వినియోగదారులకు సురక్షితమైన యూపీఐ లావాదేవీల గురించి సైబర్ సెక్యూరిటీ అవగాహన పెంచుతోంది. ఇందులో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ముఖ్యమైన టిప్స్ అందిస్తోంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ నగదు బదిలీలను చేసుకునేందుకు అనుమతిస్తుంది.

అయితే నగదు రహితంగా, పేపర్‌లెస్‌గా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఇన్‌స్టంట్ రియల్ టైమ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చు. యూపీఐ పేమెంట్స్ ఒక్క క్లిక్‌తో లావాదేవీలు చేసుకునే వీలు కల్పిస్తోంది. భారత డిజిటల్ వేవ్‌లో భాగంగాయూపీఐ లావాదేవీలకు యూపీఐ లావాదేవీలకు సంబంధించిన సైబర్ నేరాలు, మోసాలు, స్కామ్‌ల గురించి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇదే విషయంపై అవగాహన పెంచుతూ సురక్షితమైన లావాదేవీల కోసం SBI ట్విట్టర్ వేదికగా టిప్స్ అందిస్తోంది. యూపీఐ లావాదేవీలను మరింత సురక్షితంగా చేసేందుకు SBI భాగస్వామ్యంతో యూపీఐ సెక్యూరిటీ టిప్స్ ఓసారి చూద్దాం.

యూపీఐ లావాదేవీలు చేసే ముందు గుర్తుంచుకోవలసిన 6 ముఖ్యమైన చిట్కాలు

1. పేమెంట్ రిసీవ్ సమయంలోయూపీఐ పిన్ అవసరం లేదు :
మీరు యూపీఐ ద్వారా ఎవరి నుంచి అయినా నగదు రిసీవ్ చేసుకుంటే అప్పుడు యూపీఐ పిన్ అవసరం లేదు. తెలియని వారికి యూపీఐ పిన్ అనేది షేర్ చేయకూడదు. మీరు ఎవరికైనా డబ్బు పంపేటప్పుడు మీరు ఈ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఎవరైనా నగదును పంపేటప్పుడు మీ యూపీఐ పిన్‌ను షేర్ చేయమని మిమ్మల్ని అడిగితే జాగ్రత్తగా ఉండండి.

2. మీరు నగదు పంపేది ఎవరో ధృవీకరించండి :
మీరు QR కోడ్ లేదా ఫోన్ నంబర్ ద్వారా యూపీఐ పేమెంట్ చేస్తున్నప్పుడు.. వ్యక్తి గుర్తింపును క్రాస్ చెక్ చేయండి. QR కోడ్ లేదా ఫోన్ నంబర్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బును ఎప్పుడూ పంపొద్దు.

3. ఎవరైనా మీకు కలెక్ట్ రిక్వెస్టులను పంపితే అంగీకరించవద్దు :
కొన్నిసార్లు మోసగాళ్లు యూపీఐ యాప్ ‘కాలేచ్ట్ రిక్వెస్ట్’ ఫీచర్‌ను ఉపయోగించి వినియోగదారుని పేమెంట్ చేయమని కోరవచ్చు. అయితే మీకు గుర్తుతెలియని వారి నుంచి అలా రిక్వెస్ట్ వస్తే దానిపై క్లిక్ చేయరాదు. అలాంటి రిక్వెస్టులు మీకు డబ్బులు వస్తాయని నమ్మిస్తారు. వాస్తవానికి ఆ లింకులను క్లిక్ చేస్తే మీకు నగదు రాదు.. వారికి మీ అకౌంట్లో నుంచి నగుదు బదిలీ అవుతుందని గుర్తించండి.

4. మీ యూపీఐ పిన్‌ని ఎవరితోనూ షేర్ చేయవద్దు :
మీ యూపీఐ పిన్ అనేది మీ సేఫ్టీ పిన్‌.. ఆ పిన్ ఎప్పుడూ ఎవరితోనూ షేర్ చేయవద్దు.

5. QR కోడ్ ద్వారా పేమెంట్ చేస్తే.. ఎల్లప్పుడూ ఆ వివరాలను ధృవీకరించండి :
ఈ రోజుల్లో, QR కోడ్‌ల ద్వారా చేసే యూపీఐ పేమెంట్లు సర్వసాధారణంగా మారాయి. దుకాణదారుల నుంచి ఆటో డ్రైవర్ల వరకు ప్రతి ఒక్కరూ డబ్బును స్వీకరించడానికి QR కోడ్‌ను పెడతారు. అయితే కొన్నిసార్లు సైబర్ నేరగాళ్లు తమ క్యూఆర్ కోడ్‌లను పోస్టర్‌లపై రహస్యంగా ఉంచి ప్రయాణికులను, దుకాణదారులను కూడా మోసం చేస్తారు. మీరు చెల్లింపు చేసిన ప్రతిసారీ, మీరు పంపుతున్న వ్యక్తి పేరు, వివరాలను ధృవీకరించండి.

6. మీ యూపీఐ పిన్‌ను రోజూ మార్చుకోండి :
ATM పిన్‌ల మాదిరిగానే,యూపీఐ పిన్‌ను ప్రతిరోజూ మార్చడం మంచి పద్ధతి. మీరు అనుకోకుండా ఎవరితోనైనా పిన్‌ను షేర్ చేసినట్లయితే.. మిమ్మల్ని ఏదైనా మోసాల నుంచి కాపాడుతుంది.

Previous Post
Next Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *